పోర్చుగల్ ర్యాలీలో ఇండియన్ పవర్.. 2,000 కి.మీ రేసులో టీవీఎస్ రేసింగ్ సపోర్ట్‌తో దుమ్ము రేపుతున్న ఐశ్వర్య

భారతీయ మోటార్ స్పోర్ట్స్ చరిత్రలో టీవీఎస్ రేసింగ్‌కు (TVS Racing) చెందిన రైడర్ ఐశ్వర్య పిస్సే ఒక అపూర్వమైన రికార్డును సృష్టించారు. ఎఫ్ఐఎం క్రాస్ కంట్రీ ర్యాలీస్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ (W2RC) రేసులో - బీపీ అల్టిమేట్ ర్యాలీ-రైడ్ పోర్చుగల్ 2025 లో - పోటీ పడిన ఆసియా నుంచి తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. ఇది ఆమె కల అయిన దకార్ ర్యాలీ 2026 (Dakar Rally 2026) వైపు వేసిన కీలకమైన అడుగు. దకార్ ర్యాలీలో పోటీపడే తొలి భారతీయ మహిళగా నిలవడమే ఆమె అంతిమ లక్ష్యం.

టీవీఎస్ రేసింగ్ బృందం నుండి దూసుకుపోతున్న రైడర్ ఐశ్వర్య పిస్సే ఇప్పుడు ఒక కొత్త చరిత్ర సృష్టించింది. ఆమె FIM క్రాస్ కంట్రీ ర్యాలీస్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‎లో పోటీపడిన ఆసియా నుండి వచ్చిన మొదటి మహిళగా రికార్డుల్లోకెక్కింది. బీపీ అల్టిమేట్ ర్యాలీ-రైడ్ పోర్చుగల్ 2025 లో ఆమె పాల్గొనడం, డాకర్ ర్యాలీ 2026 లో రేసింగ్ చేయాలనే ఆమె లక్ష్యానికి ఇదో ముఖ్యమైన మైలురాయి.

Aishwarya Pissay Makes History First Asian Woman to Compete at W2RC Portugal

డాకర్ ర్యాలీ 2026 లో పోటీపడే మొదటి భారతీయ మహిళగా నిలవడమే ఐశ్వర్య అంతిమ లక్ష్యం. ఆమె ఈ ప్రయాణంలో దేశవ్యాప్తంగా ఉన్న మహిళా రైడర్‌లను పెద్ద కలలు కనడానికి, తమ లిమిట్స్ అధిగమించడానికి స్ఫూర్తినిస్తోంది.

ఈ నాలుగో రౌండ్ W2RC ర్యాలీ సెప్టెంబర్ 28, 2025న ముగుస్తుంది. ఈ ర్యాలీ మొత్తం 2,000 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇందులో ఐదు స్టేజీలు, ఒక ప్రలోగ్ ఉంటాయి. పోర్చుగల్‌లోని అలెంటిజో, రిబటెజో ప్రాంతాలు.. స్పెయిన్‌లోని ఎక్స్‌ట్రేమదురా అంతటా 100% గ్రావెల్, డర్ట్ ట్రాక్‌లపై ఈ ర్యాలీ జరుగుతుంది. పోర్చుగల్‌లో ఐశ్వర్య పాల్గొనడం ఆమె సన్నాహాల్లో కీలకమైన అడుగు. ఆ తర్వాత డాకర్‌కు ముఖ్యమైన క్వాలిఫైయర్ అయిన ర్యాలీ ఆఫ్ మొరాకో లో ఆమె పాల్గొంటుంది.

Aishwarya Pissay Makes History First Asian Woman to Compete at W2RC Portugal

ఐశ్వర్య పిస్సే తన ప్రయాణం గురించి మాట్లాడుతూ.. "ఈ ప్రయాణం నా మనసుకు పూర్తి సంతృప్తిని, గర్వాన్ని ఇచ్చింది. ఈ స్థాయిలో నేను భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉంది. నేను సాధించిన ప్రతి మైలురాయి కూడా టీవీఎస్ రేసింగ్ అందించిన సపోర్టు, సరైన మార్గదర్శకత్వం, ట్రైనింగు వనరుల వల్లే సాధ్యమైంది. పోర్చుగల్‌లో జరుగుతున్న FIM వరల్డ్ ర్యాలీ-రైడ్ ఛాంపియన్‌షిప్‌లో పోటీపడటం నా లక్ష్య సాధనకు సిద్ధం కావడంలో ఒక ముఖ్యమైన అడుగు.

నా నెక్ట్స్ టార్గెట్ ర్యాలీ ఆఫ్ మొరాకో, ఇది డాకర్ ర్యాలీకి కీలకమైన క్వాలిఫైయర్. డాకర్ ర్యాలీ 2026 పైనే నా దృష్టి పూర్తిగా ఉంది. అడ్డంకులను ఛేదించడానికి, హద్దులను దాటడానికి, ప్రపంచ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి నేను మునుపెన్నడూ లేనంతగా స్ట్రాంగుగా ఉన్నాను. నా ఈ ప్రయాణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళా రేసర్‌లు తమపై నమ్మకం ఉంచి, తమ కలలను ఛేదించడానికి స్ఫూర్తినిస్తుందని నేను నమ్ముతున్నాను" అని అన్నారు.

Aishwarya Pissay Makes History First Asian Woman to Compete at W2RC Portugal

టీవీఎస్ రేసింగ్ 1982లో భారతదేశపు మొదటి ఫ్యాక్టరీ ర్యాలీ జట్టుగా స్థాపించబడింది. అప్పటినుండి, ఇది భారతీయ మోటర్‌స్పోర్ట్స్‌లో ఒక బలమైన పునాదిగా నిలిచి, 3,000 మందికి పైగా ప్రొఫెషనల్ రేసర్‌లకు వేదికగా మారింది. అధిక పర్ఫామెన్స్ గల టీవీఎస్ అపాచే మోటార్‌సైకిళ్లపై తమ లిమిట్స్ అధిగమిస్తూ, ఈ బృందం జాతీయ, అంతర్జాతీయ పోటీలలో అనేక విజయాలను సాధించింది.

ఈ సంస్థ 20 ఏళ్ల ట్రాక్ టు రోడ్ సిద్ధాంతం, రేసింగ్ నైపుణ్యాన్ని తమ రోజువారీ వినియోగ మోటార్‌సైకిళ్లకు బదిలీ చేయడాన్ని నిర్ధారిస్తుంది. 2016లో టీవీఎస్ రేసింగ్ ప్రపంచంలోనే మొట్టమొదటి అన్ని మహిళల ఫ్యాక్టరీ రేసింగ్ టీమ్‌ను పరిచయం చేసి మరో చరిత్ర సృష్టించింది. ఈ రకమైన ప్రయత్నాలు మహిళా రైడర్‌లను ప్రోత్సహించడంలో, ఐశ్వర్య వంటి ఛాంపియన్‌లు హై లెవల్స్‎లో పోటీపడేలా వారి టాలెంటును పెంచడంలో టీవీఎస్ రేసింగ్కున్న తమ నిబద్ధతలను తెలియజేస్తాయి.

టీవీఎస్ మోటార్ కంపెనీ ప్రీమియం బిజినెస్ హెడ్ విమల్ సుంబ్లీ మాట్లాడుతూ.. "టీవీఎస్ రేసింగ్ ఎల్లప్పుడూ భారతీయ మోటర్‌స్పోర్ట్స్‌లో ఒక మార్గదర్శిగా ఉంది. గత నలభై ఏళ్లుగా ఛాంపియన్‌లను తయారుచేస్తూ, హద్దులను చెరిపేస్తూ, టాలెంటును పెంచుతోంది. రేసింగ్‌లో ఆసక్తి ఉన్నవారిని, ముఖ్యంగా మహిళా రైడర్‌లను ప్రోత్సహించడంలో మా నిబద్ధత ప్రతి అడుగులోనూ కనిపిస్తుంది.

ఐశ్వర్య పిస్సే మా విజన్‌కు ఉదాహరణ. టాలెంటుకు కరెక్ట్ సపోర్టు లభించినప్పుడు ఏమి సాధ్యమో ఆమె ధైర్యం, నైపుణ్యం, సంకల్పం నిరూపించాయి. డాకర్ 2026 కోసం పోర్చుగల్‌లో ఆమె పరుగెడుతున్నప్పుడు, ఆమె తన వ్యక్తిగత లక్ష్యాన్ని మాత్రమే కాకుండా, ఒక తరాన్ని పెద్ద కలలు కనడానికి, అడ్డంకులను ఛేదించడానికి, ప్రపంచ వేదికపై పోటీపడటానికి స్ఫూర్తినిస్తుంది" అని అన్నారు.

పోర్చుగల్ నుండి మొరాకో వరకు, ఆపై కూడా ఐశ్వర్య ప్రయాణం మోటర్‌స్పోర్ట్స్‌లో మహిళలకు ఏమి సాధ్యమో తిరిగి నిర్వచించి, ఒక కొత్త తరం రైడర్‌లను అసాధారణమైన వాటిని సాధించడానికి స్ఫూర్తినిస్తోంది.

More from DriveSpark

Article Published On: Friday, September 26, 2025, 18:04 [IST]
English summary
Aishwarya pissay makes history first asian woman to compete at w2rc portugal
Read more on: #tvs #tvs apache #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+