సింగం రిటర్న్స్‌లో స్కార్పియోకి బదులుగా టాటా సఫారీ
కార్ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకునేందుకు ఇప్పుడు కొత్త రూట్‌ను ఎంచుకున్నాయి. పాపులర్ హీరోలు నచించే సినిమాల ద్వారా కార్ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రచారం చేసుకునేందుకు శ్రీకారం చుట్టాయి. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో అత్యంత మంచి సక్సెస్ సాధించిన 'సింగం' సీక్వెల్‌ను బాలీవుడ్‌లో 'సింగం రిటర్న్స్' పేరుతో తెరకెక్కిస్తున్నారు.
ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ఈ చిత్రంలో నటిస్తుండగా, దీనికి రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నాడు. అసలు విషయం ఏంటంటే, సింగం చిత్రంలో అజయ్ దేవగన్ మహీంద్రా స్కార్పియోను ఉపయగించగా, దీని సీక్వెల్ 'సింగం రిటర్న్స్'లో మాత్రం టాటా సఫారీని ఉపయోగించబోతున్నాడు.

ఈ చిత్రంలో ఇంకా టాటా సుమో, సఫారీ స్టోర్మ్, ఆరియా, సుమో గ్రాండే, జెనాన్, నానో కార్లను ఉపయోగించినట్లు సమాచారం. రోహిత్ శెట్టికి సాధారణంగానే కార్లంటే మహా ఇష్టం, అతను డైరెక్ట్ చేసిన అనేక సినిమాల్లో ఇప్పటి మహీంద్రా స్కార్పియో వాహనాలనే ఎక్కువగా ఉపయోగించాడు. కానీ సింగం సీక్వెల్ చిత్రంలో మాత్రం అతను పాపులర్ టాటా సఫారీ ఎస్‌యూవీని ఉపయోగించాడు.
ఈ విషయంపై రోహిత్ శెట్టి కామెంట్ చేస్తూ.. అజయ్ దేవగన్ మళ్లీ బాజీరావ్ సింగం పాత్రను పోషిస్తున్నాడని, ఈసారి టాటా సఫారీ స్టోర్మ్‌ను అతను ఉపయోగిస్తాడని, ఇంకా ఈ సినిమాలో ఇతర టాటా మోటార్స్ వాహనాలను ఉపయోగించామని చెప్పాడు. సింగం రిటర్న్స్ చిత్రం ఆగస్ట్ 15, 2014వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications








