ఆప్రిలియా సూపర్‌‌బైక్ కొనుగోలు చేసిన హీరో అజిత్

By Ravi

తమిళ నటుడు అజిత్ మరోసారి ప్రేమలో పడ్డాడు. కంగారుపడకండి ప్రేమలో పడింది ఏ అమ్మాయితోనో లేక హీరోయిన్‌తోనో కాదు, ఓ సూపర్‌బైక్‌తో. తమిళంలో సూపర్ స్టార్ ఇమేజ్‌ను దక్కించుకున్న హీరో అజిత్‌కి బైక్ రేసింగ్ అన్నా వేగంగా పరుగులు తీసే సూపర్ బైక్‌లన్నా ఎంతో క్రేజ్ ఉన్న సంగతి తెలిసినదే.

అజిత్ ఇటీవలే కొనుగోలు తన కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎస్1000ఆర్ఆర్ (BMW S1000RR) మోటార్‌సైకిల్‌పై చెన్నై నుంచి బెంగళూరు వరకు రైడ్ చేసుకుంటూ వెళ్లి, రోడ్ సేఫ్టీ గురించి బైకర్లలో అవగాన కల్పించే ప్రయత్నం చేసిన సంగతి తెలిసినదే.

కాగా.. తాజాగా హీరో అజిత్ మరో సూపర్‌బైక్ కొనుగోలు చేశాడు. ఆప్రిలీయా కపోనార్డో 1200 (Aprilia Caponord 1200) అనే డ్యూయెల్ స్పోర్ట్స్ మోటార్‌సైకిల్‌ అజిత్ బైక్ కలెక్షన్‌లోకి వచ్చిన లేటెస్ట్ మోడల్.

అజిత్ కొనుగోలు చేసిన ఆప్రిలియా కపోనార్డో 1200సీసీ మోటార్‌సైకిల్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

అజిత్ - ఆప్రిలియా

అజిత్ - ఆప్రిలియా

అజిత్ కొనుగోలు చేసిన ఆప్రిలియా కపోనార్డో 1200 స్పోర్ట్స్ బైక్.

భారత్‌లో విడుదల

భారత్‌లో విడుదల

ఇటలీకి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం పియాజ్జియో గ్రూప్ గత కొద్ది నెలలో క్రితమే ఈ ఆప్రిలియా కపోనార్డో 1200 డ్యూయెల్ స్పోర్ట్ మోటార్‌సైకిల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది.

తొలి అడ్వెంచర్ బైక్

తొలి అడ్వెంచర్ బైక్

కపోనార్డో 1200 ఆప్రిలియా బ్రాండ్ క్రింద అడ్వెంచర్ బైక్ సెగ్మెంట్లో విడుదలైన తొలి బైక్ కావటం విశేషం. గడచిన సంవత్సరంలో ఇటలీలో జరిగిన ఈఐసిఎమ్‍‌ఏ మోటార్‌సైకిల్ షోలో ఈ బైక్‌ను తొలిసారిగా విడుదల చేశారు.

ఫీచర్లు

ఫీచర్లు

ఆప్రిలియా కపోనార్డో 1200 స్పోర్ట్స్ బైక్ ఏడిడి (ఆప్రిలియా డైనమిక్ డ్యాంపింగ్), మల్టీ‌మ్యాప్ రైడ్ బై వైర్, ఏటిసి (ఆప్రిలియా ట్రాక్షన్ కంట్రోల్), ఏసిసి (ఆప్రిలియా క్రూయిజ్ కంట్రోల్), ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), మోనోషాక్ సస్పెన్షన్ వంటి ఫీచర్లతో లభిస్తుంది.

ఇంజన్

ఇంజన్

ఇందులో 1197సీసీ, వి90 ఫోర్-స్ట్రోక్, వి-ట్విన్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 68 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తిచ చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది.

ధర

ధర

భారత మార్కెట్లో ఆప్రిలియా కపోనార్డో 1200 స్పోర్ట్స్ బైక్ ధర సుమారు రూ.25 లక్షలకు పైగా ఉండొచ్చని అంచనా.

ఆప్రిలియా కపోనార్డో 1200

ఆప్రిలియా కపోనార్డో 1200 స్పోర్ట్స్ బైక్ టాప్ వ్యూ.

ఆప్రిలియా కపోనార్డో 1200

ఆప్రిలియా కపోనార్డో 1200 స్పోర్ట్స్ బైక్ సైడ్ వ్యూ.

More from DriveSpark

Article Published On: Monday, September 2, 2013, 14:22 [IST]
English summary
South Indian Actor Ajith added yet another Super bike to his collection. The star actor had recently bought a new Caponord 1200 Super Bike.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+