అంబానీ కొడుకు అయితే కొమ్ములున్నాయా అంటున్న నెటిజన్లు.. ఎందుకో తెలుసా?

దేశంలో చాలా మంది ట్రాఫిక్‌ నిబంధల్ని పాటించడం లేదు. వీరి వల్ల అమాయకులు ప్రమాదాల్లో చిక్కుని ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రస్తుతం ఇలాంటి వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వీరిలో మరీ ముఖ్యంగా సంపన్నులు, సెలబ్రిటీలు ఉంటుండటం కలవరానికి గురిచేస్తుంది. అంతే కాకుండా వీరు వినియోగించే కార్లకు బ్లాక్‌ ఫిల్మ్‌ని (విండోస్‌) వాడుతున్నారు. మరికొందరు నంబర్‌ప్లేట్‌ని సైతం వారికి ఇష్టం వచ్చినట్లు మార్చేస్తున్నారు. వీరు ఫైన్‌ చెల్లించడానికి సిద్ధంగా ఉంటున్నారు తప్పా ట్రాఫిక్‌ నిబంధల్నీ అస్సలు పాటించడం లేదు. ప్రస్తుం ఈ సమస్య దేశంలో పెద్ద తలనొప్పిగా మారింది. వారు చేసే ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు సామాన్య ప్రజలు బలి అవుతున్నారు.

దేశంలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌, కార్లలో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలనే కఠిన నిబంధనలు ఉన్నాయి. అయితే వీటిని కొంతమంది పట్టించుకోవడం లేదు. కొన్ని రాష్ట్రాల్లో హెల్మెట్‌ ధరించని వారికి జరిమానాలు సైతం విధిస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్‌ని తప్పనిసరి చేసి వాటిని ఉల్లంఘించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అయితే చాలా మంది వాహనదారులు వీటిని పాటించడం లేదు.

Akash-Ambani-Driving-Without-Seatbelt

తాజాగా ముఖేష్ అంబానీ కుమారుడు ఆకాశ్ అంబానీ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపణలు వచ్చాయి. ఇటీవల సీట్ బెల్ట్ పెట్టుకోకుండా ఆయన ఖరీదైన సూపర్‌ లగ్జరీ కారులో ప్రయాణించారు. ఈ వీడియో విడుదల నుంచి ఆకాశ్‌ అంబానీ చుట్టూ వివాదం చెలరేగుతోంది. ప్రస్తుతం ముఖేష్ అంబానీ కుటుంబంలో ప్రతి ఒక్కరూ పెద్ద లగ్జరీ కార్ల ప్రేమికులు ఉన్నారు.

ముకేశ్‌ అంబానీ కుటుంబానికి రూ .15,000 కోట్ల విలువైన ఆంటిలియన్ లగ్జరీ ఇల్లు ఉంది. ఇందులో రూ.100 కోట్లకు పైగా విలువ చేసే కార్లు ఉన్నాయి. వారి వద్ద ఉన్న అత్యంత ఖరీదైన కార్ మోడళ్లలో ఫెరారీ ప్రోసాంగ్ ఒకటి. ఈ కారును అంబానీ కుటుంబం ఇటీవలే కొనుగోలు చేసింది. ఇది ఫెరారీ మొదటి ఎస్‌యూవీగా ఉంది.

Akash-Ambani-Driving-Without-Seatbelt

ఈ కారు మోడల్ యొక్క ఒక యూనిట్ ధర మాత్రమే రూ. రూ.10.5 కోట్లకు పైగా ధర పలికింది. ఈ అధిక ధర కలిగిన ఈ కారుని ఆ కుటుంబం విరివిగా వాడుతోంది. ఈ కారులో ఆకాశ్ అంబానీ సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కారులో ప్రయాణించారు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. దేశంలో అత్యంత ధనవంతుడి కుమారుడు ట్రాఫిక్ ఉల్లంఘనలో చిక్కుకోవడంతో నెటిజన్లు మండిపడుతున్నారు.

ఈ ఉల్లంఘన కారణంగా ఆకాశ్ అంబానీపై చర్యలు తీసుకుంటారా అని పలువురు నెటిజన్లు తమదైన శైలిలో ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రభావంతో త్వరలోనే ఆయనపై యాక్షన్ పడే అవకాశం ఉంది. భారత్లో సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే రూ.1,000కు పైగా జరిమానా విధిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ తరహా పెనాల్టీ ఆకాశ్ అంబానీపై పడే అవకాశం ఉంది.

ఫెరారీ ప్రోసాంగ్ లో 6.5-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా 725bhp పవర్ మరియు 716nm టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారులో నాలుగు డోర్లు, ఐదు సీట్లు ఉంటాయి. ఇది ఐదుగురి వరకు ప్రయాణించగలదు. ఐదుగురు కూర్చున్నా సరిపడా స్థలం ఉంటుంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఇలాంటి వీడియోల ఆధారంగా పోలీసులు ఇప్పటికే జరిమానాలు విధించిన సంఘటనలు ఉన్నాయి.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, June 20, 2024, 17:33 [IST]
English summary
Akash ambani drove rare ferrari purosangue suv without seatbelt
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+