అంబానీ కుమారుడి కారులో గడియారం విలువే 1.95 కోట్లు! ఇక ఈ కారు ధర ఎంతో మీరే చూడండి

Written By:

మీ నాన్న గారు అత్యంత రిచెస్ట్ పర్సన్ అయితే, మీరు ఎలాంటి కారును వినియోగిస్తారు ? దీనికి సమాధానం చెప్పేలోపు మీకు ఒకర్ని పరిచయం చేస్తాం రండి... ఇండియాలో అత్యంత ధనికుడైన ముఖేష్ అంబానీ పుత్ర రత్నం ఈ మధ్యనే ఓ ఖరీదైన కారును కొనుగోలు చేసాడు. ధర మరియు ఇతర ప్రత్యేకతలు ఎలా ఉన్నాయో చూద్దాం రండి...

To Follow DriveSpark On Facebook, Click The Like Button
ఆకాశ్ అంబానీ బెంట్యాగా ఎస్‌యూవీ

ఇండియాలో అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీకి ఇద్దరు పుత్ర రత్నాలున్నారు. ఒకరు ఆకాశ్ అంబానీ, ఇంకొకరు అనంత్ అంబానీ. నిజానికి ముఖేష్ అంబానీకి కార్లంటే అమితమైన ఇష్టం. అయితే ఇతని కుమారులు మరో మెట్టు పైకెక్కి పోటీ పడి మరీ లగ్జరీ కార్లను కొనుగోలు చేస్తున్నారు.

ఆకాశ్ అంబానీ బెంట్యాగా ఎస్‌యూవీ

ముఖేష్ అంబానీ పెద్ద కుమారుడు ఇండియాలోనే అత్యంత ఖరీదైన ఎస్‌యూవీ బెంట్లీ బెంట్యాగా ను కొనుగోలు చేశాడు. దీని ధర సుమారుగా రూ. 3.85 కోట్లు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఉంది. ఆన్ రోడ్ ధర నాలుగు కోట్ల పైమాటే.

ఎందుకింత ఖరీదు...?

ఎందుకింత ఖరీదు...?

లగ్జరీకి మారుపేరుగా నిలిచిన కార్ బ్రాండ్లలో బెంట్లీ ఒకటి, వీటి కార్ల పరంగానే కాకుండా ఇందులో అందించే ఫీచర్ల పరంగా కూడా బెంట్లీ కార్ల ధరల్లో భారీ వ్యత్యాసం ఉంటుంది. దీని ధర సుమారుగా నాలుగు కోట్లుగా ఉండటానికి ప్రధానం కారణం ఇందులోని గడియారం.

ఆకాశ్ అంబానీ బెంట్యాగా ఎస్‌యూవీ

బెంట్లీ కార్ల తయారీ సంస్థ ఈ బెంట్యాగా ఎస్‌యూవీలో అందించిన అత్యంత ఖరీదైన గడియారం పేరు బ్రీట్లింగ్ ముల్లినర్ టర్బిలియన్. ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం దీని ధర రూ. 1.95 కోట్లుగా ఉంది.

ఆకాశ్ అంబానీ బెంట్యాగా ఎస్‌యూవీ

అంబానీ కుంటుంబం ఈ అత్యంత ఖరీదైన బెంట్లీ బెంట్యాగా ను ఎందుకు ఎంచుకుందో ఇప్పుటికే చాలా మందికి అర్థమై ఉంటుంది. ఖరీదైన గడియారంతో పాటు ఇందులో అనేక ఖరీదైన ఫీచర్లను అందివ్వడం జరిగింది.

ఆకాశ్ అంబానీ బెంట్యాగా ఎస్‌యూవీ

ఆకాశ్ అంబానీ ఈ బెంట్యాగా ఎస్‌యీవీని 12 కలర్ షేడ్స్ గల బ్రిటీష్ రేసింగ్ గ్రీన్ కలర్‌లో ఎంచుకున్నాడు. గ్రీన్ కలర్‌కు అదనంగా అన్నిడోర్లకు ఉన్న అద్దాల మీద కార్బన్ ఫైబర్ కలదు.

ఇంజన్ వివరాలు

ఇంజన్ వివరాలు

సాంకేతికంగా బెంట్లీ బెంట్యాగా ఎస్‌యూవీలో 6.0-లీటర్ సామర్థ్యం ఉన్న డబ్ల్యూ12 ఇంజన్ కలదు, ఇది గరిష్టంగా 600బిహెచ్‌పి పవర్ మరియు 900ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

ఆకాశ్ అంబానీ బెంట్యాగా ఎస్‌యూవీ

లగ్జరీ సౌకర్యాలు, శక్తివంతమైన ఇంజన్ పరంగానే కాకుండా వేగం పరంగా కూడా దీనికి ప్రత్యేక స్థానం కలదు. ఈ ఎస్‌యూవీ కేవలం 4.1 సెకండ్ల కాలవ్యవధిలోనే గంటకు 0 నుండి 10 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

ఆకాశ్ అంబానీ బెంట్లీ బెంట్యాగా ఎస్‌యూవీని వీడియో ద్వారా వీక్షించగలరు....

ఆకాశ్ అంబానీ బెంట్యాగా ఎస్‌యూవీ

ముఖేష్ అంబానీ పెద్దోడు ఆకాశ్ బెంట్లీ గురించి చూశారు కదా..! ఇప్పుడు ముఖేష్ చిన్నోడు అనంత్ అంబానీ కారు గురించి తెలిస్తే కంగుతినాల్సిందే. రోల్స్ రాయిల్స్ కార్లు దేశవ్యాప్తంగా చాలా అరుదుగా ఉన్నాయి. అందులోనూ... అత్యంత అరుదైన డ్రాప్ హెడ్ కూపే కారును అనంత్ కొనుగోలు చేశాడు.

ఆకాశ్ అంబానీ బెంట్యాగా ఎస్‌యూవీ

రోల్స్ రాయిస్ డ్రాప్ హెడ్ కూపే ఎంచుకుని అన్నను మించిన తమ్ముడు అనిపించుకున్నాడు అనంత్ అంబానీ. ఇందులో అంత ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా...? ఈ డ్రాప్ హెడ్ కూపే కారు రోల్స్ రాయిస్ లైనప్‌లోని అత్యంత ఖరీదైనది. దీని ధర రూ. సుమారుగా రూ. 8.84 కోట్లు ఎక్స్ షోరూమ్‌గా ఉంది.

ఆకాశ్ అంబానీ బెంట్యాగా ఎస్‌యూవీ

సౌకర్యం మరియు ఖరీదు మాత్రమే కాదు లుక్ పరంగా కూడా బాగా ఆకట్టుకుంటుంది. తెల్లటి ఎక్ట్సీరియర్ బాడీ పెయింట్,ఎరుపు రంగులో ఉన్న రూప్ టాప్, తెల్లటి అంచును కలిగి ఉన్న బ్లాక్ అల్లాయ్ వీల్స్ లతో విభిన్నమైన రూపాన్ని కలిగి ఉన్న డ్రాప్ హెడ్ కూపేను అనంత్ ఎంచుకున్నాడు.

ఆకాశ్ అంబానీ బెంట్యాగా ఎస్‌యూవీ

సాంకేతికంగా రోల్స్ రాయిస్ డ్రాప్ హెడ్ కూపే కారులో 6.75-లీటర్ల సామర్థ్యం గల వి12 ఇంజన్ కలదు, ఇది గరిష్టంగా 454బిహెచ్‌పి పవర్ మరియు 720ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయను.

ఆకాశ్ అంబానీ బెంట్యాగా ఎస్‌యూవీ

వేగం విషయానికి వస్తే ఇది కేవలం 5.8 సెకండ్ల కాలంలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ప్రస్తుతం ఉన్న రోల్స్ రాయిల్స్ లైనప్‌లో అత్యంత వేగవంతమైన కారు కూడా ఇదే అని చెప్పవచ్చు.

ఆకాశ్ అంబానీ బెంట్యాగా ఎస్‌యూవీ

అనంత్ అంబానీ రోల్స్ రాయిస్ డ్రాప్ హెడ్ కూపేతో పాటు మరో రెండు ఫార్చ్యూనర్ ఎస్‌యూవీల ఎప్పుడూ వెంటే ఉంటాయి. అనంత్ ఎక్కడికెళ్లినా మహారాష్ట్ర పోలీసులు ఈ ఆర్మ్‌డ్ వెహికల్స్‌లో గస్తీకి వస్తారు. అనంత్ దక్కరికెళ్లడానికి ప్రయత్నించారు... ఈ పోలీసులు తమదైన శైలిలో ట్రీట్ చేస్తారు.

ఇక్కడ ఉన్న వీడియోలో అనంత్ అంబానీ రోల్స్ రాయిస్ డ్రాప్ హెడ్ కూపే కారును వీక్షించగలరు....

మరిన్ని కథనాల కోసం...

మీరు టాటా టియాగో హ్యాచ్‌బ్యాక్ ప్రేమికులయితే... టియాగోకు కొనసాగింపుగా అతి త్వరలో విడుదల కానున్న టిగోర్ స్టైల్ బ్యాక్ సెడాన్ ఫోటోలను ఖచ్చితంగా వీక్షించాల్సిందే....

మరిన్ని టాటా టిగోర్ స్టైల్ బ్యాక్ సెడాన్ ఫోటోలను వీక్షించండి...

 
English summary
Also Read In Telugu: Akash Ambani buys India’s most EXPENSIVE SUV, & his brother? The costliest Rolls Royce!
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark