'నాగ చైతన్య' మైండ్ బ్లోయింగ్ కార్లు, బైకులు - తప్పకుండా చూడాల్సిందే..
దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన నటులలో ఒకరైన యువ సామ్రాట్ 'అక్కినేని నాగ చైతన్య' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ కథనంలో నాగ చైతన్య గ్యారేజిలో ఉన్న కార్లు, బైకుల గురించి మరిన్ని వివరాలు వివరంగా తెలుసుకుందాం.
జోష్ సినిమాతో సినీ రంగంలో అడుగుపెట్టిన నాగ చైతన్య ఏమాయ చేసావే సినిమాతో ఎంతో మంది అభిమానులను పొందగలిగాడు. ఆ తరువాత మజిలీ, బంగార్రాజు, మజ్ను, వెంకీ మామ వంటి సినిమాలతో దూసుకెళ్లిన చై.. త్వరలో తండేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నాగ చైతన్య గ్యారేజిలో ఖరీదైన మరియు విలాసవంతమైన అన్యదేశ్య లగ్జరీ కార్లు మరియు సూపర్ బైకులు చాలానే ఉన్నాయి.

ఫెరారీ 488 (Ferrari 488)
ఇటాలియన్ సూపర్ కార్ల తయారీ సంస్థ ఫెరారీ కంపెనీకి చెందిన 488 GBT కారు నాగ చైతన్య గ్యారేజిలో ఉంది. ఎరుపు రంగులో చూడచక్కగా ఉన్న ఈ సూపర్ కారు 3.9 లీటర్ ట్విన్ టర్బో ఛార్జ్ వీ8 పెట్రోల్ ఇంజిన్ కలిగి 670 bhp పవర్ మరియు 760 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీని ధర సుమారు రూ. 4.88 కోట్లు అని తెలుస్తోంది.
ఫోర్స్చే 911 (Porsche 911)
ప్రపంచ మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన ఫోర్స్చే 911 కూడా నాగ చైతన్య గ్యారేజిలో ఉంది. చై గ్యారేజిలో ఉన్న కారు పాత వెర్షన్. ఇది కూడా రెడ్ కలర్ పొందింది. ఈ సూపర్ కారు 3.8-లీటర్ ఇంజిన్ కలిగి 400 పీఎస్ పవర్ మరియు 440 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. మంచి పర్ఫామెన్స్ అందించే ఈ కారు డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉంటుంది.

ఎంవీ అగస్టా ఎఫ్4 (MV Agusta F4)
నాగ చైతన్య గ్యారేజిలో సూపర్ బైకులలో ఒకటి 2017 మోడల్ ఎంవీ అగస్టా ఎఫ్4 (MV Agusta F4). ఇది చూడటానికి చాలా స్టైలిష్ డిజైన్ కలిగి ఉంటుంది. ఈ బైక్ 998 సీసీ ఫోర్ సిలిండర్ లిక్విడ్ కోల్డ్ ఇంజిన్ పొందుతుంది. కావున ఇది 192 bhp పవర్ మరియు 110 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. దీని ధర సుమారు రూ. 27.83 లక్షలు.
బీఎండబ్ల్యూ ఆర్ నైన్ టీ (BMW R Nine T)
జర్మన్ వాహన తయారీ సంస్థ బీఎండబ్ల్యూ యొక్క 'R Nine T' కూడా నాగ చైతన్య గ్యారేజిలో ఉంది. ఈ బైక్ 1170 సీసీ ట్విన్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 110 పీఎస్ పవర్ మరియు 116 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ మోటార్ సైకిల్ ధర రూ. 17 లక్షల నుంచి రూ. 18 లక్షల మధ్య ఉంటుంది.

ట్రయంఫ్ థ్రక్ట్సన్ ఆర్ (Triumph Thruxton R)
ట్రయంఫ్ కంపెనీకి చెందిన థ్రక్ట్సన్ ఆర్ బైక్ కూడా అక్కినేని నాగ చైతన్య గ్యారేజిలో ఉంది. రెడ్ అండ్ బ్లాక్ కలర్ డ్యూయెల్ టోన్ షేడ్‌లో పూర్తయిన ఈ బైక్ చూడచక్కగా ఉంటుంది. ఈ బైక్ 1200 సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది 98 పీఎస్ పవర్ మరియు 112 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 2016లో ఈ బైక్ ధర రూ.10.9 లక్షలు (ఎక్స్-షోరూమ్).
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








