చైతూ స్టైలే వేరు.. నాగచైతన్య కొనుగోలు చేసిన ఈ కారు ధర ఎంతో తెలుసా?

టాలీవుడ్‌ స్టార్‌ యువ సామ్రాట్‌ అక్కినేని నాగచైతన్యకు కార్లంటే అమితమైన ప్రేమ. ఈ స్టార్‌ హీరో తాజాగా సరికొత్త లగ్జరీ కారుని కొనుగోలు చేశాడు. దీనికి సంబంధించిన పిక్స్‌ ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారాయి. తాజాగా చేరిన కొత్త స్పోర్ట్స్‌ కారుతో ఆయన గ్యారేజీలో మరో స్పోర్ట్స్‌ కారు వచ్చి చేరింది.

ప్రస్తుతం నాగచైతన్య గ్యారేజీలో బ్లాక్ మెర్సిడెస్-బెంజ్ G63 AMG, రెడ్‌ కలర్‌ ఫెరారీ 488 GTBతో సహా అనేక రకాల విదేశీ కార్లు ఉన్నాయి. తాజాగా పోర్షే 911 GT3 RS కారుని ఆయన కొనుగోలు చేశారు. దీంతో ఆయన గ్యారేజీకి మళ్లీ కలర్‌ఫుల్‌ లుక్‌ వచ్చి చేరింది. ఈ యువ హీరోకు కార్లతో పాటు స్పోర్ట్స్‌ బైక్స్‌ అంటే కూడా అమితమైన ప్రేమ.

Naga-Chaitanya-Porsche

స్టార్‌ హీరో నాగచైతన్యకు కారుని విజయవంతంగా డెలివరీ చేసినట్లు పోర్షే సెంటర్ చెన్నై వెల్లడించింది. అందుకు సంబంధించిన చిత్రాలను ఫోర్షే పోస్ట్ చేసింది. మిస్టర్ అక్కినేని నాగ చైతన్యను పోర్షే కుటుంబానికి మళ్లీ చేర్చుకున్నందుకు సంతోషిస్తున్నామని కాప్షన్‌లో పేర్కొంది. 911 GT3 RSని అతనికి డెలివరీ చేసినందుకు సంతోషంగా ఉందని.. ఈ స్టార్‌ హీరో జర్నీ విజయవంతంగా జరగాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపింది.

ఈ కారు ఖరీదు అక్షరాల రూ. 3.5 కోట్లుగా ఉంది. ఇది కేవలం ఎక్స్‌-షోరూమ్‌ ధర మాత్రమే. 4 లీటర్‌ 6 సిలిండర్‌ నేచురల్ ఆస్పిరేటెడ్‌ ఇంజిన్‌తో ఈ కారు పనిచేస్తుంది. ఇక పర్ఫామెన్స్‌ విషయానికి వస్తే 518 bhp వద్ద 468nm టార్క్‌ని విడుదల చేసిందు. అలాగే ఇది 7-స్పీడ్‌ DCT గేర్‌బాక్స్‌ జతచేయబడి ఉంది. గంటకు ఈ కారు 296 కి.మీ వేగాన్ని అందుకుంటుంది.

Naga-Chaitanya-Porsche-911-GT3-RS

ఈ స్టార్‌ హీరో గ్యారేజీలో AMG మెర్సెడెస్‌ బెంజ్‌ G63 AMG పవర్‌ఫుల్‌ ఎస్‌యూవీ ఉంది. ఇది 4.0-లీటర్ V8 ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 577bhp వద్ద 480Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనిపై ఆఫ్-రోడ్‌లో కూడా సులభంగా ప్రయాణించవచ్చు. Mercedes ప్రస్తుతం G63 గ్రాండ్ ఎడిషన్‌ను విక్రయిస్తోంది. దీని ధర రూ. 4 కోట్లు ఎక్స్-షోరూమ్‌గా ఉంది.

చైతన్య గ్యారేజీలో మరో కారు రేంజ్ రోవర్‌ వోగ్‌ రోవర్ సిరీస్‌లోని దీని ధర రూ. 2.38గా ఉంది. ఇది 523bhp వద్ద 750Nm టార్క్‌ని అందిస్తుంది. 4.4-లీటర్ V8తో ఇంజిన్ ఆప్షన్‌తో పనిచేస్తుంది. ఆయన గ్యారేజీలోని మరో కారు పోర్షే 991. దీని ఉత్పత్తి నిలిపివేయబడింది. 3.8-లీటర్ ఫ్లాట్-సిక్స్ ఇంజిన్‌తో ఈ కారు పనిచేస్తుంది. ఇది 395bhp వద్ద 440Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Naga-Chaitanya-Porsche

ఈయన గ్యారేజీలోని మరో కారు ఫెరారీ 488 GTB. దీని ధర రూ. 4.88 కోట్లు (ఎక్స్-షోరూమ్). 3.9-లీటర్ ట్విన్-టర్బో V8 ద్వారా శక్తిని పొందుతుంది. ఇంజిన్ 7-స్పీడ్ DCTతో జత చేయబడింది, ఇది వెనుక చక్రాలకు శక్తిని పంపుతుంది. ఫెరారీ 488 GTB 670bhp వద్ద 760Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, May 21, 2024, 15:38 [IST]
English summary
Akkineni nagachaitanya buys porsche 911 gt3 rs worth of 3 5 crores
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+