అద్భుతమైన కార్లను కలిగి ఉన్న అక్కినేని ఫ్యామిలీ

Written By:

అక్కినేని కుటుంబం ఈ పేరు వినని, తెలియని తెలుగువారుండరు. కొన్ని దశాబ్దాల పాటు అక్కినేని కుటుంబం తెలుగు వారితో విడదీయరాలేని బంధం ఏర్పరుచుకుంది. నాగేశ్వర రావు గారి నటనతో మొదలైన బంధం నాగార్జున మరియు వారి కుమారులు చైతు, అఖిల్‌లతో కొనసాగుతూ వస్తోంది.

వెండి తెర ద్వారా తెలుగువారితో అత్యంత సాన్నిహిత్యం ఏర్పరచుకున్న అక్కినేని కుటుంబాన్ని ఉమ్మడి కుటుంబానికి ఒక చక్కటి ఉదాహరణగా అభివర్ణించవచ్చు. అక్కినేని కుటుంబం యొక్క కార్ల కలెక్షన్ గురించి క్రింది కథనంలో తెలుసుకుందాం రండి.

 నాగార్జున బిఎమ్‌డబ్ల్యూ 7- సిరీస్

నాగార్జున బిఎమ్‌డబ్ల్యూ 7- సిరీస్

నాగార్జున్న తరచూ బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ 730ఎల్‌డి మోడల్ లగ్జరీ కారును వినియోగిస్తాడు. సాధారణమైన నలుపు రంగులో లభించే కారులో మరిన్ని పరికరాలను పూర్తిగా నల్లటి రంగులోకి మార్పించుకున్నాడు. ఇందులో విలాసవంతమైన లగ్జరీ ఫీచర్లు కలవు.

బిఎమ్‌డబ్ల్యూ 7- సిరీస్

బిఎమ్‌డబ్ల్యూ 7- సిరీస్

బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ 730ఎల్‌డి కారులో 2993 సీసీ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్‌ కలదు. ఇది సుమారుగా 262బిహెచ్‌పి పవర్ మరియు 620ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది పెట్రోల్ ఇంజన్‌లో కూడ లభ్యమవుతుంది. దీని ధర రూ. 1.50 కోట్లు ఎక్స్ షోరూమ్‌గా ఉంది.

నాగార్జున ఆడి ఏ7

నాగార్జున ఆడి ఏ7

నాగుర్జున ఎంచుకున్న ఏ7 కారు ఎక్కువ కాలం పాటు ఇండియన్ మార్కెట్లో ఉండలేకపోయింది. అయితే ఆడి దీని స్థానంలో ఏ6 కన్వర్టిబుల్ సెడాన్‌ పేరుతో మరొ కారును అందుబాటులోకి తీసుకువచ్చింది.

అక్కినేని ఫ్యామిలీ కార్ కలెక్షన్

నాగార్జున ఎంచుకున్న ఏ7 కారునే కేరళలోని ప్రముఖ నటుడు మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి కూడా ఎంచుకున్నారు.

 నాగార్జున బిఎమ్‌డబ్ల్యూ ఎమ్6

నాగార్జున బిఎమ్‌డబ్ల్యూ ఎమ్6

నాగార్జున ఎక్కువగా వినియోగిస్తున్న మరొక కారు బిఎమ్‌డబ్ల్యూ ఎమ్6 కూపే. నలుగురు కూర్చోడానికి వీలున్నది ఇది అతి తక్కువ వ్యవధిలోనే గరిష్ట వేగాన్ని అందుకుంటుంది. ఇది కేవలం 4.8 సెకండ్ల కాలంలోనే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

 బిఎమ్‌డబ్ల్యూ ఎమ్6

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్6

ఇందులో 5 లీటర్ వి10 ఇంజన్ కలదు. ఇందులోని న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్ సుమారుగా 500బిహెచ్‌పి పవర్ మరియు 520ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును. దీని ధర సుమారుగా రెండు కోట్ల వరకు ఉంది.

 నాగచైతన్య రేంజ్‌రోవర్ వోగ్

నాగచైతన్య రేంజ్‌రోవర్ వోగ్

నాగార్జున మొదటి కుమారుడు నాగచైతన్య అద్భుతమైన కార్లను ఎంచుకుంటాడు. నటుడిగా కెరీర్‌ను ప్రారంభించకముందే. రేంజ్‌ రోవర్ వోగ్‌తో చక్కర్లుకొట్టేవాడు. హీరోగా ఎదిగిన తరువాత తన డైలీ లైఫ్‌లో ఈ రేంజ్‌రోవర్ వోగ్ లగ్జరీ ఎస్‌యువి సర్వసాధారణమైపోయింది.

రేంజ్‌రోవర్ వోగ్ గురించి

రేంజ్‌రోవర్ వోగ్ గురించి

ఇందులో 3.0 లీటర్ సామర్థ్యం ఉన్న టిడివి6 డీజల్ ఇంజన్ కలదు. ఇది సుమారుగా 244.6 బిహెచ్‌పి పవర్ మరియు 600ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 209 కిలోమీటర్లుగా ఉంది మరియు ఇది కేవలం 7 సెకండ్ల కాలంలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని ధర సుమారుగా రెండు కోట్లకు పైగా ఉంది.

నాగచైతన్య నిస్సాన్ జిటి-ఆర్

నాగచైతన్య నిస్సాన్ జిటి-ఆర్

నాగచైతన్య కార్లలో అత్యంత విలువైన కారుగా నిలిచింది నిస్సాన్ జిటి-ఆర్. సూపర్‌ కార్లను నాగార్జున మరియు నాగ చైతన్య ఇద్దరూ సమంగానే ఇష్టపడతారు. అంతే కాకుండా వీరు ఫెరారి ఎఫ్430 మరియు ల్యాంబోర్గిని గల్లార్డోను కూడా కలిగి ఉన్నారు. జిటి-ఆర్ కారు కేవలం 3 సెకండ్ల వ్యవధిలోనే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

నిస్సాన్ జిటి-ఆర్ గురించి

నిస్సాన్ జిటి-ఆర్ గురించి

ఇందులో 3.8 లీటర్ వి6 ఇంజన్ కలదు, ఇది సుమారుగా 542బిహెచ్‌పి పవర్ మరియు 612ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును. దీని ధర సుమారుగా కోటిన్నర వరకు ఉంది.

చైతన్య రేంజ్‌రోవర్ ఆటోబయోగ్రఫీ

చైతన్య రేంజ్‌రోవర్ ఆటోబయోగ్రఫీ

నాగచైతన్య తరచూ వినియోగించే కార్లలో రేంజ్‌రోవర్ ఆటోబయోగ్రఫీ ఒకటి. ఎస్‌యువి సెగ్మెంట్లో అత్యంత విలాసవంతమైన కారు ఈ రేంజ్‌రోవర్ బయోగ్రఫీ. ఇది పోర్షే క్యాయేన్ కన్నా ఖరీదైన కారు.

రేంజ్‌రోవర్ ఆటోబయోగ్రఫీ గురించి

రేంజ్‌రోవర్ ఆటోబయోగ్రఫీ గురించి

రేంజ్‌రోవర్ ఆటోబయోగ్రఫీ కారులో 3.0 లీటర్ సామర్థ్యం ఉన్న ట్విన్ టుర్బో డీజల్ ఇంజన్ కలదు. ఇది సుమారుగా 254బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 8-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను అనుసంధానం చేశారు. దీని ధర సుమారుగా 2.18 కోట్లుగా ఉంది. డీజల్ కారు అయితే 40 లక్షలు వరకు ఎక్కువగానే ఉంది.

మెర్సిడెస్ బెంజ్ జి63 ఏఎమ్‌జి

మెర్సిడెస్ బెంజ్ జి63 ఏఎమ్‌జి

అక్కినేని కుటుంబం యొక్క కార్ల కలెక్షన్ లో వచ్చి చేరిన లేటెస్ట్ లగ్జరీ ఎస్‌యువి మెర్సిడెస్ బెంజ్ జి63 ఏఎమ్‌జి. ఇక అన్నదమ్ముల అందాన్ని నేల మీద నుండి చూడాలి అంటే ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని నిరూపించారు.

అక్కినేని ఫ్యామిలీ కార్ కలెక్షన్

మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి లో 5.5 లీటర్ ట్విన్ టుర్బో వి8 ఇంజన్ కలదు. ఇది సుమారుగా 571 హార్స్‌పవర్ మరియు 760ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

అఖిల్ స్కోడా సూపర్బ్

అఖిల్ స్కోడా సూపర్బ్

అక్కినేని కుటుంబంలో అత్యంత యువ కథానాయకుడు అక్కినేని అఖిల్. ఇక ఈ మధ్య అయితే తన ప్రేమ గురించి రకరకాల కథనాలు వెలువడుతున్నాయి. అది ఎంత వరకు నిజమో తేలాల్సి ఉంది. అత్యంత విలాసవంతమైన స్కోడా సూపర్బ్‌ను అఖిల్ తన ఫేవరేట్ కారుగా అక్కినేని కార్ గ్యారేజ్‌లో చేర్చాడు.

స్కోడా సూపర్బ్

స్కోడా సూపర్బ్

స్కోడా సూపర్బ్ పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంధన రకాలలో కూడా లభిస్తుంది. పెట్రోల్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 23.83 లక్షలు మరియు డీజల్ ప్రారంభం వేరియంట్ ధర రూ. 27.73 లక్షలు‌గా ఉన్నాయి. రెండు ధరలు ఎక్స్‌ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.

పోర్షే క్యాయేన్

పోర్షే క్యాయేన్

నాగార్జున పోర్షే వారి క్యాయేన్ ఎస్‌యువిని కూడా కలిగి ఉన్నాడు. అయితే అమలా దీనిని వినియోగిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పోర్షే క్యాయేన్ అత్యంత ఉత్తమమైన ఎస్‌యువిగా నిలిచింది. పనితీరు మరియు భద్రత పరందా పోర్షే బ్యాడ్జిని కలిగి ఉన్న క్యాయేన్ అంతే లగ్జరీగా ఉంటుంది.

పోర్షే క్యాయేన్ గురించి

పోర్షే క్యాయేన్ గురించి

పోర్షే వారి క్యాయేన్ ప్రపంచ వ్యాప్తంగా విసృత స్థాయి ఇంజన్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉంది. మరియు ఇండియాలో ఇది రెండవ అత్యంత ఖరీదైన లగ్జరీ ఎస్‌యువి వాహనంగా నిలిచింది. మొదటి రేంజ్‌రోవర్ ఆటోబయోగ్రఫీ. ‌పోర్షే ప్రారంభ ధర రూ. కోటి పది లక్షలుగా ఉంది.

బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్

బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్

1941 లో 17 ఏళ్లకే ధర్మపత్ని అనే సినిమా ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యాడు. అలా సుమారుగా సుమారుగా 70 సంవత్సరాలకు పైగా సినిమా రంగంలో ఉన్నాడు. కుటుంబ సమేతంగా తెరకిక్కిన చివరి చిత్రం మనం అనంతరం 2014 లో శివైక్యం పొందారు. వయసైపోయిన తరువాత అక్కినేని నాగేశ్వరరావు గారు బిఎమ్‌డబ్ల్యూకి చెందిన 5-సిరీస్ కారును వినియోగించేవాడు. మనం చిత్రీకరణలో ఇలా తన కారుతో ఫోటోకు ఫోజిచ్చారు.

బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్

బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్

బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్ కారు పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ధర సుమారుగా రూ 55 లక్షలు ఎక్స్ షోరూమ్‌గా ఉంది.

 

Source

English summary
Akkineni Nagarjuna Family And Their Cars
Please Wait while comments are loading...

Latest Photos