గోల్డెన్ బెంజ్ కారుపై అక్షయ్ కుమార్ స్టన్నింగ్ స్టంట్

By Ravi

బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ తాను నటించే సినిమాల్లో చాలా వరకు స్టంట్‌లను తానే స్వయంగా చేస్తుంటాడు. ఏదైనా కార్యక్రమానికి ఎంట్రీ ఇచ్చినా లేదా సినిమాలో హీరో ఎంట్రీ ఉన్నా, సదరు ఎంట్రీని మాత్రం విశిష్టంగా చేస్తుంటాడు అక్షయ్ కుమార్.

తాజాగా అక్షయ్ నటించిన బాలీవుడ్ చిత్రం 'బాస్‌'లో అలాంటి ఓ స్టన్నింగ్ ఎంట్రీని ఇచ్చాడు మన 'కిలాడి'. ఈ చిత్రం పేరుకు తగినట్లుగా బాస్ ఓ గోల్డ్ కలర్ బెంజ్‌పై గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. బాస్ చిత్రం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఈ గోల్డ్ కలర్ బెంజ్ కారు ఎటవాలుగా రెండు చక్రాలపై వెళ్తుంటే, తాను బాస్ మాదిరిగా పైన నిల్చుని సవారీ చేస్తూ కనిపిస్తాడు అక్షయ్.

మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫోచర్‌లో పరిశీలించండి.

అక్షయ్ స్టన్నింగ్ స్టంట్ చూశారా?

ఈ స్పెషల్ గోల్డ్ కలర్ మెర్సిడెస్ బెంజ్ కారును ప్రత్యేకించి యూరప్ నుంచి బ్యాంకాక్‌కు దిగుమతి చేసుకున్నారు. ఈ కారు బ్యాంకాక్‌కు వచ్చిన తర్వాత తమ స్టంట్‌కు కావల్సినట్లుగా దీనిని మోడిఫై చేశారు.

అక్షయ్ స్టన్నింగ్ స్టంట్ చూశారా?

ప్రత్యేకంగా కస్టమైజ్ చేసిన ఈ బ్రైట్ గోల్డ్ కలర్ మెర్సిడెస్ కారులో బాలీవుడ్‌లో ఇదివరకెన్నడు ప్రయత్నించని విధంగా ఓ కొత్తరకమైన స్టంట్‌ను చేసినట్లు సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

అక్షయ్ స్టన్నింగ్ స్టంట్ చూశారా?

అక్షయ్ కుమార్ బాస్ చిత్రం కోసం ప్రత్యేకంగా కస్టమైజ్ చేసిన ఈ గోల్డ్ కలర్ బెంజ్ కారుకు ముందు వైపు అలాగే వెనుక వైపు రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లకు బదులుగా వాటి స్థానంలో బాస్ అనే నెంబర్ ప్లేట్స్ కనిపిస్తాయి.

అక్షయ్ స్టన్నింగ్ స్టంట్ చూశారా?

ఈ గోల్డెనె బెంజ్ కారు కేవలం స్టంట్‌లో మాత్రమే కాకుండా, బాస్ చిత్రం టైటిల్ సాంగ్‌లో కూడా కనిపిస్తుంది (చివరి స్లైడ్‌లోని వీడియోలో వీక్షించవచ్చు).

అక్షయ్ స్టన్నింగ్ స్టంట్ చూశారా?

అక్షయ్ కుమార్ ఈ గోల్డెన్ బెంజ్ కారును చూడగానే సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయాడట. కారు రెండు చక్రాలపై బ్యాలెన్స్ చేస్తున్నప్పుడు ఎలాంటి తాళ్ల సాయం లేకుండానే అక్షయ్ ఈ స్టంట్ చేసినట్లు సమాచారం.

అక్షయ్ స్టన్నింగ్ స్టంట్ చూశారా?

వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ అండ్ అశ్విన్ వార్డే ప్రొడక్షన్స్ బ్యానెర్‌లో నిర్మితమైన బాస్ చిత్రాన్ని అంటోనీ డిసౌజా డైరెక్ట్ చేశారు.

అక్షయ్ స్టన్నింగ్ స్టంట్ చూశారా?

ఈ బుధవారం ప్రేక్షకులకు ముందుకు విచ్చేసిన బాస్ చిత్రం మొదటి రోజునే బాక్సాఫీస్ రికార్డులు బద్దలు చేసి, దర్శకనిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. మొదటి రోజునే అక్షయ్ కుమార్ బాస్ చిత్రం 11.50 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసినట్లు సమాచారం.

అక్షయ్ కుమార్ బాస్ చిత్ర ప్రమోషన్ వీడియోని వీక్షించండి.

More from DriveSpark

Article Published On: Tuesday, October 22, 2013, 15:15 [IST]
English summary
Bollywood actor Akshay Kumar has done a superb stunt with golden Mercedes Benz in his newly movie Boss. Here is some interesting stunt images from movie Boss.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+