Viral Video గాల్లో ఉండగానే ఊడిపోయిన విమానం డోర్‌.. 16,000 అడుగుల ఎత్తులో ఘటన

విమానం టేకాఫ్‌ అయిన తర్వాత డోర్లు అన్నీ మూసి ఉంటాయన్న సంగతి మనకు తెలిసిందే. కానీ ఆకాశంలో విమానం ఎగురుతున్నప్పుడు డోర్‌ తెరుచుకోవడం మీరెప్పుడైనా చూశారా.?? ఇక్కడ అమెరికా గగనతలంలో ప్రయాణిస్తున్న ఓ విమానం డోర్‌ అకస్మాత్తుగా ఊడిపోయింది. సిబ్బంది అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది.

అమెరికా గగనతలంలో ఊహించని సంఘటన చోటుచేసుకుంది. అలెస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్‌ విమానం(Flight Door Open)లో 171 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ప్రయాణిస్తున్నారు. అయితే విమానం టేకాఫ్‌ అయిన కాసేపటికే డోర్‌ ఊడిపోయింది. ఈ హఠాత్పరిణామానికి ఫ్లైట్‌లోని ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళన చెందారు.

Alaska-Flight-Door-Blows-Out

శుక్రవారం(జనవరి 5)న ఈ సంఘటన చోటుచేసుకుంది. 177 మంది ప్రయాణికులతో బోయింగ్‌ 737-9 MAX విమానం AS1282 పోర్ట్‌ల్యాండ్‌ నుంచి అంటారియో, కాలిఫోర్నియాకు బయలుదేరింది. అయితే ఫ్లైట్‌ టేకాఫ్‌ అయిన కాసేపటికే డోర్‌ ఊడిపోయింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ఫ్లైట్‌ను తిరిగి పోర్ట్‌ల్యాండ్‌కు ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేశారు. ప్రయాణికులు వెంటనే ఊపిరి పీల్చుకున్నారు.

ఈ సంఘటనను ప్రయాణీకులు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. మిడ్ క్యాబిన్ ఎగ్జిట్ డోర్.. విమానం నుండి పూర్తిగా విడిపోవడాన్ని వీడడియోలో చూడవచ్చు. ఈ క్రమంలో ఈ సంఘటనపై అలస్కా ఎయిర్‌లైన్స్‌ స్పందించింది. విమానాన్ని పోర్ట్‌ల్యాండ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండింగ్‌ చేసినట్లు పేర్కొంది. ఘటనపై విచారణ చేపట్టినట్లు తెలిపింది.

Alaska-Flight-Door-Blows-Out

అలాస్కా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 1282కి సంబంధించిన పూర్తి పరిస్థితిని యూఎస్ నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) పరిశీలిస్తున్నట్లు ట్విట్టర్‌లో వెల్లడించింది. ఈ ఘటన సంభవించినప్పుడు విమానం గరిష్ఠంగా 16,325 అడుగుల ఎత్తులో ఉన్నట్లు రియల్ టైమ్ ఎయిర్‌క్రాఫ్ట్ మూవ్‌మెంట్ మానిటర్ తన Flightradar24 అనే సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొంది.

కాగా ప్రమాదానికి గురైన బోయింగ్ 737 MAX 9 విమానం అక్టోబరు 1, 2023న అలస్కా ఎయిర్‌లైన్స్‌లో చేరింది. నవంబర్ 11, 2023 నుంచి వాణిజ్య సేవలందిస్తోంది. ఈ ఘటన నేపథ్యంలో భారత విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ అప్రమత్తమైంది. కాగా ఘటన తర్వాత అంతర్జాతీయంగా నడుస్తున్న మొత్తం 737 మ్యాక్స్ 9 విమానాల సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.

Alaska-Flight-Door-Blows-Out

అంతర్జాతీయంగా బోయింగ్ 737 విమానాలను ఉపయోగించే అన్ని విమానయాన సంస్థలు తమ సేవల షెడ్యూల్‌ను మార్చాయి. వాటి స్థానంలో ఇతర విమానాలను పంపాయి. మరికొన్ని కంపెనీలు తమ విమానాలను రద్దు చేసుకున్నాయి. అయితే భారత్‌లో బోయింగ్ 737 విమానాలను వివిధ కంపెనీలు ఉపయోగిస్తాయి.

ప్రధానంగా ఆకాశ ఎయిర్‌కు 22, స్పైస్ జెట్‌కు 13, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు 9 విమానాలు ప్రస్తుతం వినియోగంలో ఉండగా.. బోయింగ్ 737 మ్యాక్స్ 9 వేరియంట్ భారతదేశంలోని ఏ ఎయిర్‌లైన్‌ ద్వారా కూడా సేవలందిచండం లేదు. కాగా ఆకాశ ఎయిర్‌లో మ్యాక్స్ 8 ఎయిర్‌క్రాఫ్ట్‌ సేవలందిస్తోంది.

Alaska-Flight-Door-Blows-Out

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, January 8, 2024, 9:10 [IST]
English summary
Alaska airlines boeing 737 max 9 plane door blows out in mid air
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+