బస్ డ్రైవర్ నైపుణ్యం వల్ల ప్రాణాలతో బయట పడ్డ బైక్ రైడర్ [వీడియో]
భారతదేశంలో ప్రతిరోజూ వందలాది ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలలో కూడా ద్విచక్ర వాహన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ కారణంగా మోటారు వాహన చట్టం ప్రకారం ద్విచక్ర వాహనాలపై ప్రయాణించేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి.
![బస్ డ్రైవర్ నైపుణ్యం వల్ల ప్రాణాలతో బయట పడ్డ బైక్ రైడర్ [వీడియో] బస్ డ్రైవర్ నైపుణ్యం వల్ల ప్రాణాలతో బయట పడ్డ బైక్ రైడర్ [వీడియో]](https://images.drivespark.com/te/img/2020/10/alert-bus-driver1-1603182965.jpg)
చాలా మంది మోటార్‌సైకిలిస్టులు హెల్మెట్ ధరించరు. తత్ఫలితంగా ద్విచక్ర వాహనాల ప్రమాదాల వల్ల రైడర్స్ ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది. వాహనదారులు పరిమిత వేగం కంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తూ ఉంటారు. ఇది కూడా ప్రమాదానికి కారణమవుతోంది.
![బస్ డ్రైవర్ నైపుణ్యం వల్ల ప్రాణాలతో బయట పడ్డ బైక్ రైడర్ [వీడియో] బస్ డ్రైవర్ నైపుణ్యం వల్ల ప్రాణాలతో బయట పడ్డ బైక్ రైడర్ [వీడియో]](https://images.drivespark.com/te/img/2020/10/alert-bus-driver4-1603182987.jpg)
ఇటీవల కేరళలో ఒక బైక్ రైడర్ అనుకోకుండా పెను ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ సంఘటన యొక్క వీడియో సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో వైరల్ అయ్యింది. వీడియోలో బైక్ రైడర్ ఒక పెద్ద ప్రమాదం నుండి తప్పించుకోవడం చూడవచ్చు. బస్సు డ్రైవర్ యొక్క చురుకుదనం కారణంగా బైక్ రైడర్ రక్షించబడ్డాడు.
![బస్ డ్రైవర్ నైపుణ్యం వల్ల ప్రాణాలతో బయట పడ్డ బైక్ రైడర్ [వీడియో] బస్ డ్రైవర్ నైపుణ్యం వల్ల ప్రాణాలతో బయట పడ్డ బైక్ రైడర్ [వీడియో]](https://images.drivespark.com/te/img/2020/10/alert-bus-driver5-1603182995.jpg)
ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఏర్పాటు చేసిన సిసిటివి ఫుటేజ్ బయటుపడింది. ఈ వీడియోలో మీరు బైక్ రైడర్ అకస్మాత్తుగా జారడం చూడవచ్చు.
రైడర్ వర్షపు నీటితో తడిసిన రహదారిపై బ్రేక్ వేసిన కారణంగా బైక్ స్కిడ్ అవుతుంది. బైకర్ కూడా బైక్ మీద నుంచి పడిపోయాడు. ఈ సమయంలో ప్రైవేట్ బస్సు బైక్‌పైకి వచ్చింది. బస్సు డ్రైవర్ వెంటనే బస్సును తిప్పి బ్రేక్‌లు వేశాడు. కాబట్టి ఈ పెద్ద ప్రమాదం నుంచి బయటపడగలిగారు.
![బస్ డ్రైవర్ నైపుణ్యం వల్ల ప్రాణాలతో బయట పడ్డ బైక్ రైడర్ [వీడియో] బస్ డ్రైవర్ నైపుణ్యం వల్ల ప్రాణాలతో బయట పడ్డ బైక్ రైడర్ [వీడియో]](https://images.drivespark.com/te/img/2020/10/alert-bus-driver6-1603183001.jpg)
కానీ బస్సు డ్రైవర్ సమయానికి ఎంతో చాకచక్యంగా బస్సుని కంట్రోల్ చేసాడు. అతను రోడ్డుపై ఉన్న చిన్న గీతను దాటకుండా చూసుకున్నాడు. బైకర్ కింద పడినప్పుడు, ప్రజలు ఆ ప్రాంతంలో ఎక్కువగా గుమిగూడారు.
![బస్ డ్రైవర్ నైపుణ్యం వల్ల ప్రాణాలతో బయట పడ్డ బైక్ రైడర్ [వీడియో] బస్ డ్రైవర్ నైపుణ్యం వల్ల ప్రాణాలతో బయట పడ్డ బైక్ రైడర్ [వీడియో]](https://images.drivespark.com/te/img/2020/10/alert-bus-driver9-1603183022.jpg)
ఈ సంఘటన జరగడానికి ముందు అనేక వాహనాలు ఒకే రహదారిని దాటుతున్నట్లు వీడియో చూపిస్తుంది. కానీ ఎవరూ ప్రమాదానికి గురి కాలేదు. అయితే ఈ బైక్ రైడర్ బైక్ బ్రేక్ వేయడం కారణంగా కింద పడిపోయింది.
అక్కడికక్కడే ఉన్నవారు వెంటనే తన బైక్‌తో సహా బైక్ రైడర్‌ను పక్కకు తీసుకెళ్లారు. ఈ సంఘటన వల్ల ద్విచక్ర వాహనదారులు తడి రోడ్లపై వేగంగా వెళ్లకూడదు అని గుర్తుంచుకోవాలి.
![బస్ డ్రైవర్ నైపుణ్యం వల్ల ప్రాణాలతో బయట పడ్డ బైక్ రైడర్ [వీడియో] బస్ డ్రైవర్ నైపుణ్యం వల్ల ప్రాణాలతో బయట పడ్డ బైక్ రైడర్ [వీడియో]](https://images.drivespark.com/te/img/2020/10/alert-bus-driver10-1603183029.jpg)
తడి రోడ్లపై వాహనాల ట్రాఫిక్ మరియు స్థిరత్వం పూర్తిగా తగ్గుతుంది. అందువలన వాహనం కంట్రోల్ తప్పుతుంది. ఈ పరిస్థితి పెద్ద ప్రమాదాలకు దారితీస్తుంది. వర్షం పడినప్పుడు వాహనాలు నెమ్మదిగా కదలడం మంచిది. వాహనాలు నెమ్మదిగా కదలడం వల్ల ప్రమాదాలనుంచి బయటపడటమే కాకుండా ప్రాణాలను సైతం కాపాడుకోవచ్చు.


Click it and Unblock the Notifications








