ఈ క్రేజీ డిజైన్ ఆల్ఫా రోమియో కార్లను ఎప్పుడైనా చూశారా?

పురాతన కార్లకు ఎల్లప్పుడూ ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అందులోనూ ఆనాటి కాన్సెప్ట్ కార్లకు మరింత ప్రత్యేకత ఉంటుంది. అప్పటి సాంకేతిక పరిజ్ఞానానికి మరియు ఇంజనీర్ల డిజైన్ పనితనానికి ఇవి ఉదాహరణలుగా నిలుస్తాయి. ఆర్‌ఎమ్ సోథెబైస్ నిర్వహించిన వేలంలో 1950 కాలానికి చెందిన మూడు ఆల్ఫా రోమియో కాన్సెప్ట్ కార్లు భారీ ధర పలికాయి.

ఈ క్రేజీ డిజైన్ ఆల్ఫా రోమియో కార్లను ఎప్పుడైనా చూశారా?

ఈ మూడు కాన్సెప్ట్ కార్లను ఒక యూనిట్‌గా ప్రజెంట్ చేశారు. ఈ కార్లను 1953, 1954 మరియు 1955 సంవత్సరాలలో తయారు చేశారు. వేలంలో ఈ మూడు కార్లు అత్యధికంగా బిడ్ చేయబడ్డాయి. వీటి కోసం గరిష్టంగా 14.84 మిలియన్ డాలర్ల మొత్తంలో బిడ్డింగ్స్ వచ్చాయి.

ఈ క్రేజీ డిజైన్ ఆల్ఫా రోమియో కార్లను ఎప్పుడైనా చూశారా?

గత 1950వ దశకంలో, ఇటాలియన్ కార్ బ్రాండ్ ఆల్ఫా రోమియో బెర్లినా ఏరోడినామికా టెక్నికా (B.A.T.) అనే పేరుతో ఈ మూడు కాన్సెప్ట్ కార్లను తయారు చేసింది. వీటి పేర్లు కూడా చాలా సింపుల్‌గా ఉంటాయి, వీటిని బెర్టోన్ డిజైన్ చేశారు. ఈ కార్లను BAT 5, 7 మరియు 9డి అని పిలుస్తారు.

MOST READ:ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్.. మహీంద్రా నుండి స్పెషల్ ఆఫర్స్..

ఈ క్రేజీ డిజైన్ ఆల్ఫా రోమియో కార్లను ఎప్పుడైనా చూశారా?

ఆర్‌ఎమ్ సోథెబైస్ నిర్వహించిన వేలంలో ఈ మూడు కార్లు 14,840,000 డాలర్ల ధర పలికాయి, వీటిని ఒకే లాట్‌గా మాత్రమే విక్రయించాలని ఆక్షన్ సంస్థ నిర్ణయించింది. ఇవి ఇప్పుడు ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఆల్ఫా రోమియో కార్లుగా నిలిచాయి. మరో విధంగా చెప్పాలంటే, ఈ కార్ల ధర దాదాపు 200 యూనిట్ల ఆల్ఫా రోమియో గియులియా క్వాడ్రిఫోగ్లియో మోడళ్ల ధరతో సమానం.

ఈ క్రేజీ డిజైన్ ఆల్ఫా రోమియో కార్లను ఎప్పుడైనా చూశారా?

కొద్ది రోజుల క్రితం న్యూయార్క్‌లో జరిగిన సోథెబైస్ కాంటెంపరరీ ఆర్ట్ ఈవినింగ్ వేలంలో ఈ అమ్మకం జరిగింది. ఈ వేలం కోసం న్యూయార్క్, లండన్ మరియు హాంకాంగ్ నుండి వచ్చిన కొందరు ప్రముఖులు బిడ్డింగ్స్ వేసినట్లు ఆర్ఎమ్ సోథెబైస్ వెల్లడించింది.

MOST READ:భారత మార్కెట్లో టాటా హారియర్ క్యామో ఎడిషన్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

ఈ క్రేజీ డిజైన్ ఆల్ఫా రోమియో కార్లను ఎప్పుడైనా చూశారా?

ఈ మూడు బ్యాట్ ఆల్ఫా రోమియో కాన్సెప్ట్ మోడళ్లు ఏరోడైనమిక్‌గా సమర్థవంతంగా రూపొందించబడ్డాయి, ముందుగా 1953లో BAT 5 (బూడిద రంగులో ఉండే కారు)ను తయారు చేశారు. ఆ తర్వాత 1954లో BAT 7 (నీలం రంగులో ఉన్న కారు)ను మరియు 1955లో BAT 9d (వెండి రంగులో ఉండే కారు)ను తయారు చేశారు.

Most Read Articles

English summary
Alfa Romeo BAT Concept Auctioned As Most Valuable Car 14.84 Million Dollar Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X