చాలా మంది కలలు కనే సూపర్‌కార్ !! ఇప్పుడు ఇటలీ పోలీసు బలగాల్లో చేరింది !

ఇటాలియన్ సూపర్ లగ్జరీ కార్ బ్రాండ్ 'ఆల్ఫా రోమియో' విక్రయిస్తున్న 'గియులియా' కార్ ఇప్పుడు అధికారిక ఇటాలియన్ పోలీస్ వాహనంగా మారింది. ఇటలీ పోలీసు బలగాల కోసం బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్‌తో ఈ ఆల్ఫా రోమియో గియులియా కారును ప్రత్యేకంగా రూపొందించామని కంపెనీ పేర్కొంది.

చాలా మంది కలలు కనే సూపర్‌కార్ !! ఇప్పుడు ఇటలీ పోలీసు బలగాల్లో చేరింది !

ఇటాలియన్ పోలీస్ పెట్రోలింగ్ వాహనాల్లో ఇప్పటికే అనేక సూపర్ కార్లు ఉండగా, తాజాగా ఈ ఆల్ఫా రోమియో గియులియా సూపర్ కూడా వచ్చి చేరింది. కారాబినియరీ అని పిలువబడే భద్రతా సిబ్బంది ఈ కారును ఉపయోగించనున్నారు.

చాలా మంది కలలు కనే సూపర్‌కార్ !! ఇప్పుడు ఇటలీ పోలీసు బలగాల్లో చేరింది !

కారాబినియరీ అనేక ఇటలీ యొక్క జాతీయ భద్రత బలగం, ఇది ప్రధానంగా దేశీయ పోలీసింగ్ విధులను నిర్వహిస్తుంది. పోలిజియా డి స్టాటో మరియు గార్డియా డి ఫినాన్జా బలగాల మాదిరిగానే ఇటలీలోని ప్రధాన భద్రత బలగాలలో కారాబినియరీ కూడా ఒకటి.

MOST READ:కస్టమైజ్ ఫోర్డ్ పిక్-అప్ ట్రక్కు డ్రైవ్ చేస్తూ కనిపించిన 'సద్గురు జగ్గీ వాసుదేవ్' [వీడియో]

చాలా మంది కలలు కనే సూపర్‌కార్ !! ఇప్పుడు ఇటలీ పోలీసు బలగాల్లో చేరింది !

ఈ ఇటాలియన్ కార్ కంపెనీ కారాబినియరీ బలగాల కోసం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 1,700 ఆల్ఫా రోమియో గియులియా కార్లను తయారు చేసి, అందించనుంది. పోలీస్ పెట్రోలింగ్‌కు ఉపయోగించడానికి అనువుగా స్టాండర్డ్ గియులియా కారులో కొద్దిపాటి మార్పులు చేసి, వీటిని తయారు చేస్తున్నారు.

చాలా మంది కలలు కనే సూపర్‌కార్ !! ఇప్పుడు ఇటలీ పోలీసు బలగాల్లో చేరింది !

ఆల్ఫా రోమియో గియులియా కారులో శక్తివంతమైన ఇంజన్ ఉంటుంది. ఇందులో అమర్చిన 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 197 బిహెచ్‌పిని ఉత్పత్తి చేయగలదు. ఈ ఇంజన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

MOST READ:కరోనా ఎఫెక్ట్: 700 మందికి పైగా అరెస్ట్.. ఎక్కడో తెలుసా?

చాలా మంది కలలు కనే సూపర్‌కార్ !! ఇప్పుడు ఇటలీ పోలీసు బలగాల్లో చేరింది !

ఈ సూపర్ కార్ కేవలం 6.6 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు. దీని గరిష్ట వేగం గంటకు 230 కిలోమీటర్లుగా ఉంటుందని ఆల్ఫా రోమియో సంస్థ పేర్కొంది. ఇటాలియన్ పోలీసుల బలగాల కోసం ఈ ఆల్ఫా రోమియో గియులియా కారును ప్రత్యేకమైన నలుపు రంగులో ఫినిష్ చేశారు.

చాలా మంది కలలు కనే సూపర్‌కార్ !! ఇప్పుడు ఇటలీ పోలీసు బలగాల్లో చేరింది !

ఈ పోలీస్ కారులో చేసిన మార్పుల విషయానికి వస్తే, కారు ముందు భాగంలో బానెట్‌పై ఇటాలియన్ భద్రతా సంస్థ అయిన కారాబినియరీ పేరు ముద్రించబడి ఉంటుంది. పోలీసుల ఉపయోగం కోసం అవసరమైన అన్ని పరికరాలను ఈ కారులో జోడించారు.

MOST READ:రైతులకు గుడ్ న్యూస్.. ట్రాక్టర్ కావాలంటే ఫ్రీగా వాడుకోవచ్చు.. ఎక్కడంటే?

చాలా మంది కలలు కనే సూపర్‌కార్ !! ఇప్పుడు ఇటలీ పోలీసు బలగాల్లో చేరింది !

ఇటాలియన్ ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన చిత్రాన్ని గమనిస్తే, కారు బానెట్‌పై భద్రత బలగాల బ్రాండింగ్, దానికి ఇరువైపులా బానెట్ బాడీ లైన్స్‌పై రెడ్ కలర్‌లో అంటించిన ఫ్లాష్ స్టైల్ స్టిక్కరింగ్, పైభాగంలో సెంట్రల్ బీకన్ మరియు సైరన్, బ్లూ కలర్ ఫ్లాష్ లైట్స్ వంటి డిజైన్ విశిష్టతలు ఇందులో ఉన్నాయి.

చాలా మంది కలలు కనే సూపర్‌కార్ !! ఇప్పుడు ఇటలీ పోలీసు బలగాల్లో చేరింది !

కారు రూఫ్ భాగాన్ని మరియు వెనుక స్పాయిలర్‌ను తెలుపు రంగులో ఫినిష్ చేశారు. అంతేకాకుండా, ఈ సూపర్ కారును పోలీసుల భద్రత కోసం పి 4-లెవల్ సేఫ్టీ షీల్డ్ విండో గ్లాస్‌తో తయారు చేశారు. ఇవి బుల్లెట్ ప్రూఫ్‌ను కలిగి ఉండి, శత్రువులు చేసే దాడి నుండి అధికారులను రక్షించేందుకు సహకరిస్తాయి.

MOST READ:భారత్‌లో విడుదలైన 2021 జిఎల్‌ఎ & ఎఎమ్‌జి జిఎల్‌ఎ 35; ధర & వివరాలు

చాలా మంది కలలు కనే సూపర్‌కార్ !! ఇప్పుడు ఇటలీ పోలీసు బలగాల్లో చేరింది !

ఆల్ఫా రోమియో సంస్థ చాలా సంవత్సరాలుగా ఇటాలియన్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీతో అనుబంధంగా ఉంది. సుమారు 70 సంవత్సరాల క్రితం ఇటాలియన్ ప్రభుత్వానికి 1900 మీటర్ల "మాట్టా" జీపును అందించిన ఆల్ఫా రోమియో, ఈ కూటమిని ఇలానే కొనసాగించాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.

చాలా మంది కలలు కనే సూపర్‌కార్ !! ఇప్పుడు ఇటలీ పోలీసు బలగాల్లో చేరింది !

పోలీసులు సూపర్ కార్లను ఇటలీలోనే కాకుండా అనేక దేశాల్లో కూడా ఉపయోగిస్తున్నారు. ఇవి సాధారణ కార్ల కంటే వేగంగా పరుగులు తీస్తూ, అత్యవసర సమయాల్లో సమయానికి సంఘటనా స్థలాలకు చేరుకునేందుకు సహకరిస్తాయి. అంతేకాకుండా, ఇతర వాహనాల్లో పారిపోతున్న దుండగులను వేగంగా చేజ్ చేసి పట్టుకునేందుకు కూడా ఇవి ఎంతగానో ఉపయోగపడుతాయి.

Most Read Articles

English summary
Alfa Romeo Giulia Becomes Official Patrolling Car For Italian Police, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X