ఖరీదైన రేంజ్ రోవర్ SUV లో మెరిసిన ఆలియా- రణ్‌బీర్ జంట.. ఈ కారులో ఎన్ని ప్రత్యేకతలో.!!
బాలీవుడ్ జంట రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ కారులో తళుక్కుమన్నారు. రేంజ్ రోవర్ అంతర్జాతీయ మార్కెట్లో అత్యంత విలాసవంతమైన కారు మోడళ్లలో ఒకటి.
సినీ సెలబ్రిటీలు ఏం చేసినా విశేషమే.. అందుకే వారికి సంబంధించిన ఏ టాపిక్ అయినా సరే తెగ వైరల్ అవుతుంది. ముఖ్యంగా వారి లగ్జరీ కార్లు. సినీ రంగంలో దాదాపు చాలా మంది సెలబ్రిటీలకు లగ్జరీ కార్లున్నాయి. బాలీవుడ్ ఫేవరెట్ కపుల్ ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ ప్రముఖ ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్(Land Rover Range Rover) కారులో నుంచి దిగుతున్న వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

లగ్జరీ సౌకర్యాలు కోరుకునే వారి కోసం, ల్యాండ్ రోవర్.. రేంజ్ రోవర్ కారులో లగ్జరీ ఫీచర్లను అందిస్తోంది. అందుకే ఇది భారత్‌లో ధనవంతులకు, సెలబ్రిటీలకు ఇష్టమైన కార్ మోడల్‌గా మారింది. ఇందులో లగ్జరీ ఫీచర్లు మాత్రమే కాకుండా.. సేఫ్టీ పరంగానూ నెం.1 గా ఉంది.
అందుకే దేశంలో అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ కార్లలో కూడా ఈ సేఫ్టీ కారు చోటు దక్కించుకుంది. ప్రముఖులకు వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఉన్నప్పటికీ మరింత సేఫ్టీ కోసం ఇలాంటి లగ్జరీ, సేఫ్టీ ఫీచర్లు ఉన్న కార్లలోనే ఎక్కువగా తిరుగుతారు. కాగా ఆలియా భట్(Alia-Ranbir Kapoor), రణ్‌బీర్ కపూర్ ఉపయోగిస్తున్న కారు నాల్గవ తరం రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ LWB వెర్షన్.

అప్పటికే వారి నివాసంలోని గ్యారేజ్‌లో వద్ద రేంజ్ రోవర్ వెలార్(Range Rover Velar) ఉండటంతో తాజా వెర్షన్ కారును కూడా కొనుగోలు చేశారు. కాగా వారు కొనుగోలు చేసిన కారు కలర్ బెల్గ్రావియా గ్రీన్ కలర్. ఇది చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇంకా రేంజ్ రోవర్ ఆటో బయోగ్రఫీ LWBలో సంస్థ అందిస్తున్న అత్యంత అద్భుతమైన మరియు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్స్‌లో ఇది ఒకటి.
కాగా రణబీర్ కపూర్-ఆలియా భట్ తమ ప్రధాన ప్రయాణాల్లో ఈ కారును ఉపయోగించటానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ కారులో ప్రయాణిస్తున్నప్పుడు విలాసవంతమైన ఓడలో ప్రయాణిస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. అందుకే ఈ కారుకు దేశంలో అంత డిమాండ్ ఉంది. అంతే కాకుండా గుంతల రోడ్లపై కూడా రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ఎటువంటి అప్ అండ్ డౌన్స్ లేకుండా ఈజీగా ముందుకు వెళ్తుంది.
ఇంకా రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీలో సస్పెన్షన్ సెటప్ చాలా సమర్థవంతంగా ఉంటుంది. అంతే కాకుండా, ఈ కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఇందులోని ప్రయాణికులకు బయటి నుంచి ఎలాంటి శబ్దాలు వినిపించవు. కనీసం కారు ఇంజిన్ శబ్దం, టైర్ల చప్పుడు కూడా వారికి వినిపించదంటే ఆశ్చర్యమే కదా. అలాంటి సూపర్ కెపాసిటీ ఉన్న కారు మోడల్ ఇది. ఈ కారులో ఒకేసారి ఏడుగురు ప్రయాణించవచ్చు.
బ్రాండ్ న్యూ ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్‌లో ఆలియా-రణ్‌బీర్ కపూర్ ముంబయి ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఆ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ లగ్జరీ కారు ధర దాదాపు రూ. 3.14 కోట్లు(ఎక్స్ షో రూమ్). ఆడి R8, ఆడి A8L, Mercedes-AMG G63, ల్యాండ్ రోవర్ రేంజ్ స్పోర్ట్, BMW X7 లగ్జరీ SUV వంటి టాప్-టైర్ మోడళ్లను ఈ జంట కలిగి ఉంది.
ఇక ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ లాంగ్ వీల్ బేస్ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 3.0 లీటర్ టర్బోచార్జ్డ్ ఇన్‌లైన్ 6 డీజిల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 350 PS వద్ద 700 Nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇంకా మోటార్ 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో జత చేయబడింది.


Click it and Unblock the Notifications








