ఇకపై ఆ రాష్ట్రంలో ఎలక్ట్రిక్‌ వాహనాలు తప్పనిసరి.. జనవరి 1 నుంచి అమలు.!!

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతోంది. పెరుగుతున్న ఇంధన ధరలు కూడా వినియోగదారులు ఈవీలపై మొగ్గు చూపడానికి కారణం. ఇప్పటికే ప్రముఖ వాహన తయారీదారులతో పాటు స్టార్టప్‌లు సైతం ఈవీ రంగంలో తమ సత్తాను చాటుతున్నాయి. ఈ నేపథ్యంలో గోవా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులకు సబ్సిడీ ఇస్తుండగా, మరో వైపు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఈవీల కొనుగోలుకు అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. ఇప్పుడు గోవా ప్రభుత్వం కూడా తమ రాష్ట్రంలో ఈవీలను ప్రోత్సహించడానికి కొత్త ప్రతిపాదనతో ముందుకు వచ్చింది. ఇది త్వరలో అమలు కానుంది.

Electric-Vehicles

గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ జనవరి 1, 2024 నుంచి రిజిస్టర్ చేయబడిన అన్ని టూరిస్ట్ 'రెంట్-ఎ-క్యాబ్' మరియు 'రెంట్-ఎ-బైక్' సేవలకు ఎలక్ట్రిక్ వాహనాలను తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంతో గోవాలో రాబోయే అద్దె కార్లు మరియు ద్విచక్ర వాహనాలన్నీ ఎలక్ట్రిక్ వాహనాలుగా మారనున్నాయి.

ఇ-మొబిలిటీని వేగవంతం చేసే దిశగా విధానాలను అమలు చేయడంపై 'ఎనర్జీ ట్రాన్సిషన్ వర్కింగ్ గ్రూప్' ప్రారంభ సమావేశంలో గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ మాట్లాడారు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తేలికపాటి ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయనుందని వెల్లడించారు.

Electric-Vehicles

గోవా గ్లోబల్ టూరిజం హాట్‌స్పాట్‌గా పేరు గాంచింది. అతి చిన్న రాష్ట్రమైన గోవాలోదాదాపు 15 లక్షల జనాభా ఉంది. కానీ ప్రతి సంవత్సరం దాదాపు 85 లక్షల కంటే ఎక్కువ మంది పర్యాటకులు గోవాను సందర్శిస్తారు. పర్యాటకులు ప్రయాణించడానికి ఉపయోగించే టాక్సీలు, అద్దె వాహనాలు మరియు బస్సుల కారణంగా రాష్ట్రంలో కర్బన ఉద్గార స్థాయిలు ఎక్కువగా ఉన్నాయి.

గోవాలో 40 శాతం కర్బన ఉద్గారాలు ఇంధనంతో నడిచే అంతర్గత దహన ఇంజిన్ (ICE) వాహనాల నుండి వెలువడుతున్నాయని సీఎం ప్రమోద్‌ సావంత్‌ చెప్పారు. అందుకే, గోవాలోని రెంటల్ ఫ్లీట్ ఆపరేటర్లు తమ వాహనాల్లో 30 శాతం వాహనాలను జూన్ 2024 నాటికి ఈవీలుగా మార్చుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.

దీని ప్రకారం జనవరి 2024 నుంచి అన్ని కొత్త ప్రయాణీకుల వాహనాలు, అద్దె క్యాబ్‌లు మరియు అద్దె బైక్‌లు తప్పనిసరిగా EVలు అయి ఉండాలి. బహుళ టూరిస్ట్ ట్యాక్సీలు, రెంట్-ఎ-బైక్ మరియు రెంట్-ఎ-క్యాబ్ ఆపరేటర్లను కలిగి ఉన్న పర్మిట్ హోల్డర్లు జూన్ 2024 నాటికి ఫ్లీట్‌లో 30 శాతం ఎలక్ట్రిక్ వాహనాలకు మారడం తప్పనిసరిగా చేసింది.

గోవా పర్యాటకం పరంగా జాతీయ సగటు కంటే 4.5 రెట్లు ఎక్కువగా ఉంది. వాహనాల సాంద్రత పరంగానూ గోవా ప్రపంచంలో 15వ స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఈవీల వినియోగాన్ని వీలైనంత త్వరగా అమలు చేస్తే కర్బన ఉద్గారాలను అదుపులోకి తీసుకురావచ్చని సీఎం తెలిపారు.

అయితే ఇక్కడ ఆసక్తికర విషయమేమంటే గోవా ప్రభుత్వం గతేడాది ఎలక్ట్రిక్‌ వాహనాలపై సబ్సిడీని నిలిపివేసింది. పథకం సమయంలో 1600 పైగా ఎలక్ట్రిక్‌ వాహనాల కొనుగోలుపై ఆర్థిక ప్రోత్సాహకాలను అందించింది. ఈవీల వినియోగాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం అందించిన FAMEII సబ్సిడీలు ఇప్పటికీ రాష్ట్రంలో అమలవుతున్నాయి.

అయితే కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎలక్ట్రిక్‌ టూ వీలర్ల తయారీపై అందించే సబ్సిడీ FAME2 ను తగ్గించింది. దీని ఫలితంగా గత రెండు నెలల్లో ఈవీల విక్రయాలు తగ్గాయి. ఈ ప్రభావం తాత్కాలికంగానే ఉంటుందని త్వరలోనే గ్రీన్‌ మొబిలిటీ మళ్లీ ఊపందుకునే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

More from DriveSpark

Article Published On: Friday, July 21, 2023, 10:13 [IST]
English summary
All new rental cabs and motorcycles to be electrified in goa from january 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+