ధోనీ ఎక్స్132 హెల్‌క్యాట్ గురించి మీరు తెలుసుకోవాల్సినది..
గ్రేటర్ నోయిడాలోని బుధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ (బిఐసి)ను తొలిసారిగా సందర్శించిన భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ఆ రేస్ ట్రాక్‌పై తాను ఇటీవలే కొనుగోలు చేసిన ఇంపోర్టెడ్ బైక్ 'ఎక్స్132 హెల్‌క్యాట్'తో వేగాన్ని రుచి చూశాడు. మరి మన ధనాధన్ ధోనీ ఉపయోగించే ఈఎక్స్132 హెల్‌క్యాట్ సూపర్‌బైక్ గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి. గడచిన సంవత్సరంలో ధోనీ ఈ బైక్‌ను విదేశాల నుంచి ఆర్డర్ చేయించి మరీ భారత్‌కు దిగుమతి చేయించుకున్నాడు.
అమెరికాకు చెందిన ప్రముఖ సూపర్‌బైక్‌ల తయారీ కంపెనీ 'కాన్ఫెడరేట్ మోటార్‌సైకిల్స్' అందిస్తున్న పవర్‌ఫుల్ మోటార్‌సైకిళ్లలో ఎక్స్132 హెల్‌క్యాట్ కూడా ఒకటి. అమెరికన్ స్ట్రీస్ బైక్ డిజైన్‌ను తలపించే ఈ 'ఎక్స్132 హెల్‌క్యాట్' బైక్ పూర్తిగా చేతుల్తోనే తయారు చేయబడినది(హ్యాండ్ బిల్ట్). ఈ సూపర్‌బైక్‌లో శక్తివంతమైన 2163 సీసీ వి-ట్విన్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 132 బిహెచ్‌పిల శక్తిని, 150 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యవల్ గేర్ సిస్టమ్‌తో లభిస్తుంది.
ఎక్స్132 హెల్‌క్యాట్ బైక్‌లో అమర్చిన ఇంజన్ విడుదల చేసే శక్తి దాదాపు ఓ ప్రీమియం కారు (చెవర్లే క్రూజ్ వంటిది) విడుదల చేసే శక్తికి సమానం. భారత మార్కెట్లో ఈ సూపర్‌బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ.27 లక్షలకు పైమాటే. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, భారతదేశంలో ఎక్స్132 హెల్‌క్యాట్ బైక్‌ను కలిగి ఉన్న ఏకైక వ్యక్తి కూడా మహేంద్ర సింగ్ ధోనీనే. ఒకవేళ ధోనీ తర్వాత ఎవరైనా ఈ బైక్‌ను కొనుగోలు చేస్తే, మొదటి కొనుగోలుదారుడు మాత్రం ధోనీనే అవుతాడు.
వేగం అంటే ఇష్టపడే మహేంద్ర సింగ్ ధోనీ వద్ద శక్తివంతమైన ఓ హమ్మర్ హెచ్3 ఎస్‌యూవీ కూడా ఉంది. ఇంకా ఇతని గ్యారేజ్‌లో అనేక సూపర్‌కార్లు, స్పోర్ట్స్ బైక్‌లు కొలువుదీరి ఉన్నాయి. ఎక్స్132 హెల్‌క్యాట్ సూపర్‌బైక్ కొనుగోలుతో.. ఇప్పటికే హెల్‌క్యాట్ బైక్‌లను కలిగి ఉన్న ఇంగ్లాడ్ ఫుట్ బాల్ కెప్టెన్ డేవిడ్ బెక్‌హామ్ వంటి ప్రముఖ సెలబ్రిటీల సరసన ధోనీ కూడా చేరిపోయాడు. మరి మన ధనాధన్ ధోనీ నరకపు పిల్లి (హెల్‌క్యాట్)ని చూసొద్దాం రండి..!

మహేంద్ర సింగ్ ధోనీ - ఎక్స్132 హెల్‌క్యాట్ బైక్

Click it and Unblock the Notifications