ప్రపంచంలో అత్యంత ఖరీదైన యుద్ధ విమానం ఎఫ్-35 గురించి పూర్తి వివరాలు
ప్రపంచ వ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన అమెరికా. అమెరికా అతి త్వరలో అత్యంత ఖరీదైన ఫైటర్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్‌ను తమ సైన్యంలోకి ప్రవేశపెట్టనుంది. సాంకేతికంగా అత్యాధునిక ఐదవ తరానికి చెందిన ఫైటర్ జెట్ విమానం ఎఫ్-35 పేరుతో యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ విభాగంలోకి ప్రవేశపెట్టనుంది. అత్యంత ఖరీదైన ఫైటర్ జెట్‌గా నిలిచిన దీని గురించి పూర్తి వివరాలు క్రింది కథనంలో...

బహుళ ప్రయోజనాలు
దీనిని గ్రౌండ్ మరియు ఎయిర్ రెండు ప్రయోజనాల కోసం వినియోగించనున్నారు. శత్రువుల జాడలను గుర్తించేందుకు ఎఫ్-35 ఫైటర్‌జెట్‌ను వివిధ రకాలలో గస్తీకి వినియోగించవచ్చు.

అమెరికాలో అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రముఖ లాక్ హీక్ మార్టిన్ సంస్థ ఈ ఎఫ్-35 పైటర్ జెట్‌ను ఆవిష్కరించింది.

అత్యంత ఖరీదైన
అమెరికా మిలటరీ ప్రధానం కార్యాలయంలో ఉన్న అత్యంత ఖరీదైన ఆయుధాలలో ఎఫ్-35 ఫైటర్ జెట్ విమానం అత్యంత ఖరీదైనదిగా నిలిచింది. అమెరికా ఎయిర్ ఫోర్స్ తెలిపిన వివరాల ప్రకారం సైన్యం యొక్క బలాన్ని ఈ ఫైటర్ జెట్ ద్వారా కొత్త కోణంలో చూడగలరని తెలిపింది.

విలువ
అమెరికా ఎయిర్ ఫోర్స్‌లోకి వచ్చి చేరుతున్న సరికొత్త ఫైటర్ జెట్ విమానం ధర అంచనా సుమారుగా 400 బిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉంది. ప్రపంచ చరిత్రలో ఒక ఆయుధానికి ఇంత ఖర్చు చేయడం ఇదే మొదటి సారి. ఆర్థిక మరియు సాంకేతిక కారణాల వలన దీనిని తీసుకురావడం అమెరికా ఆలస్యం చేస్తూ వచ్చింది.

ఫీచర్లు
ఇందులో కేవలం ఒక్కరు మాత్రమే ప్రయాణించే వీలున్న ఇందులో సింగల్ ఇంజన్ కలదు. అన్ని వాతావరణ పరిస్థితులలో కూడా దీనిని వినియోగించవచ్చు. శత్రువుల యొక్క రూపాలను మరియు వారి రాడార్ సాంకేతికతలను పసిగట్టే విధంగా దీనిని రూపొందించారు

ప్రత్యేకతలు
పైలట్ హెల్మెట్ మీద ఒక కెమెరా అమర్చిబడి ఉంటుంది. దీని ద్వారా ఎయిర్ క్రాఫ్ట్‌ను నడుపుతూనే చుట్టూ అంశాలను గమనించవచ్చు. అంతే కాకుండా శత్రువుల దాడి నుండి ఎంతో సులభంగా తప్పించుకునే వీలుంది.

ఆలస్యం
ఈ ప్రాజెక్ట్ ఆలస్యం కావడానికి కారణం ఆర్థిక వనరులే అని తెలిసింది. అయినప్పటికీ 2014 లో ఈ ఎయిర్ క్రాఫ్ట్‌ను పరీక్షిస్తున్నపుడు మంటలు చెలరేగాయి. అందుకోసం దీనిని సాంకేతికంగా మరింత అభివృద్ది చేయడానికి తీసుకున్న సమయం వల్లేనే ఆలస్యం అయ్యిందని తెలిసింది.

మట్టి పాలు చేసే ప్రణాళికలా ?
పెంటగాన్ చేసి స్టడీ ప్రకారం, దీనిని మట్టి పాలు చేసే ఆలోచనలో ఉన్నట్లు అనిపించింది. ఎందుకంటే ఎంతో ఖర్చు పెట్టి రూపొందిస్తున్న ఇందులో సవాలక్ష సమస్యలు ఎదురవుతున్నాయి. ఇంధన ట్యాంకు లోపం వలన మంటలు చెలరేగడం, శత్రువుల నుంచి తప్పించుకునేందుకు తక్కువ అవకాశాలు, నాణ్యత లేని సెన్సార్లు అదే విధంగా సంతృప్తిపరచలేని దీని పనితీరు అని పెంటగాన్ పేర్కొంది.

మార్పులు
పెంటగాన్ నివేదిక అనంతరం ఇది అత్యాధునికంగా అభివృద్ది చెందనట్లు తెలిసింది. ధృడత్వం మరియు సాంకేతికంగా పూర్తి స్థాయిలో సరిచేయబడింది. అతి త్వరలో అమెరికా మిలిటరీలోకి అడుగిడనున్న దీనికి యుద్ద క్షేత్రంలో కూడా ఉపయోగించడానికి అనుమతులు లభించినట్లు తెలిసింది.

మాతో కలిసి ఉండండి
ఇండియా రష్యా తో చేతులు కలిపి ఐదవ తరానికి చెందిన అత్యాధునిక ఎయిర్ క్రాఫ్ట్‌ను రూపొందిస్తోంది. రానున్న కాలంలో ఈ పథకం పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చనున్నట్లు తెలిసింది. ఈ ఎయిర్ క్రాఫ్ట్ అందుబాటులోకి వస్తే ఇండియా అంతర్జాతీయంగా అత్యంత శక్తివంతమైన దేశాలలో మరింత శక్తివంతంగా మారనుంది

నాగసాకి, హిరోషిమా నగరాల నాశనానికి కారణం విమానం దొరికింది
సమర్థవంతమైన దాడి చేయగల ప్రపంచ టాప్ 10 సైనిక హెలికాప్టర్లు


Click it and Unblock the Notifications








