డీజీల్ కార్లు ఎందుకు రావట్లేదు..? BS6 కొత్త నియమాల్లో ఏముంది.. పూర్తి వివరాలు
ఏప్రిల్ 1 నుంచి దేశంలో విక్రయించబడే అన్ని వాహనాలు BS6 ఫేజ్ 2 ఉద్గార నిబంధనల్నీ కచ్ఛితంగా పాటించాలి. లేకుంటే వారిపై కేంద్రం కఠిన చర్యలు తీసుకోనుంది. ఇందులో భాగంగా కార్లు/బైక్స్ కంపెనీలు ధరల్నీ విపరీతంగా పెంచేశాయి. కొత్తగా తీసుకువచ్చిన ఆ నిబంధనల్లో ఏముంది..? అసలు ఆ వాహనాలను మాత్రమే ఎందుకు కొనుగోలు చేయాలి. ఇలాంటి మరెన్నో విషయాలు మీకోసం..
వాతావరణంలో జరుగుతన్న మార్పులకు ప్రధాన కారణం వాయు కాలుష్యం. కార్లు లేదా బైకులు విడుదల చేసే పొగ లేదా ఉద్గారల ద్వారా పర్యవరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. దీనిని నివారించేందుకు BS6 ఉద్గార నియామలు అందుబాటులోకి వచ్చాయి. అయితే తాజాగా BS6 2.0ని కేంద్రం తప్పనిసరి చేయడంతో ఈ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది.

తేడా ఏంటి..?
ప్రస్తుతం దేశంలో విక్రయించే అన్ని వాహనాలకు OBD (ఆన్ బోర్డ్ డయాగ్నస్టిక్) పరికరాన్ని అమర్చనున్నాయి. అయితే అంతకుముందు వాహనాలకు ఈ డివైజ్ ఉండేది కాదు. ఈ పరికరం ఇప్పుడు కొత్త వాహనాలకు అదనంగా జోడించి వస్తుంది. అందుకే వాహన కంపెనీలు ధరల్నీ అమాంతం పెంచేశాయి. ఈ పెరిగన ధరలు ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి రానున్నాయి.
BS6, BS6 2.0 వాహనాల మధ్య ముఖ్య తేడా ఏమిటంటే..కొత్త BS6లో OBD పరికరం నిజ సమయంలో కారు లేదా బైక్ నుంచి విడుదలయ్యే ఉద్గార స్థాయిలను పర్యవేక్షిస్తుంది. ఆక్సిజన్ సెన్సార్, కాటలిస్టిక్ కన్వర్టర్ వంటి కీలక భాగాలను పర్యవేక్షిస్తుంది. వాహన స్థాయికంటే అధికంగా ఉద్గారాలను విడుదల చేస్తే వెంటనే ఇది అలెర్ట్ చేస్తుంది.

ఈ పరికరం అందించే ఇండికేషన్ల ఆధారంగా వెహికిల్ ని వెంటనే చెక్ చేసుకోవడం లేదా సర్వీసింగ్ కి ఇవ్వడం వంటివి చేయాలి. అయితే BS6 మోడళ్లలో ఈ సదుపాయం ఉండదు. వెహికిల్ నుంచి విడుదలైన ఉద్గారాలను ల్యాబ్ కి పంపడం ద్వారా ఉద్గారాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవచ్చు. ప్రస్తుతం దేశంలో ఉన్న ట్రాఫిక్ పరిస్థితుల ఆధారంగా BS6 2.0 వాహనాల ద్వారా ఉద్గార స్థాయిల్లో తీవ్ర వత్యాసాన్ని సులభంగా అంచనా వేయవచ్చు.
డీజీల్ మోడల్స్ ఎందుకు తగ్గుతున్నాయి..
దేశంలో డీజీల్ వాహనాల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఉద్గార నిబంధనలకు అనుగుణంగా డీజీల్ వాహనాలు చేరుకోక పోవడంతో ఈ సమస్య వస్తుంది. ఒకవేళ వాటిని సవాల్ గా స్వీకరించి తయారుచేసినా ధరలు ఎక్కువగా ఉంటున్నాయి. అందుకే డీజీల్ వెహికిల్స్ తగ్గుముఖం పడుతున్నాయి. అందుకు తగినట్లు సంస్థలు కేవలం CNG, పెట్రోల్, పెట్రోల్-హైబ్రిడ్ మోడల్‌ల వైపు మొగ్గు చూపిస్తున్నాయి.
BS6 2.0 డీజిల్ ఇంజిన్ కోసం, వాహనంలో SCR (సెలెక్టివ్ క్యాటలిటిక్ రిడక్షన్) పరికరాన్ని అమర్చాలి. ఇది కాలుష్య నివారణ చేయడానికి AdBlue (నీటి ఆధారిత యూరియా ద్రావణం)ని ఉపయోగిస్తుంది. Mercedes-Benz వంటి OEMలు ఇప్పటికే తమ వాహనాల్లో ఈ సాంకేతికతను పొందుపరిచాయి. అయితే చాలా మంది వాహన తయారీదారులకు, ధరల పెంపును అంగీకరించేలా కస్టమర్‌లను ఒప్పించడం సవాలుగా ఉండనుంది.

ధరల ప్రభావం..
BS6 2.0 ఇంజన్‌తో కూడిన డీజిల్ కార్ల ధరలు పెట్రోల్ వేరియంట్ కంటే అధికంగా ఉంటున్నాయి. దీంతో వీటిని కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. కొత్త ధరలతో డీజీల్ కార్లు మరింత ప్రియం కానున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోళ్లు దేశంలో జోరుందుకోవడానికి ఇదొక కారణంగా చెప్పవచ్చు. తక్కువ ధరలో ఎక్కువ రేంజ్ కార్లను కంపెనీలు తీసుకువస్తున్నాయి.
కొత్త నిబంధనలతో వాహన తయారీదారులు ఇప్పటికే 2 శాతం నుంచి 5 శాతం వరకు ధరల పెంపును ప్రకటించాయి. ఏది ఏమైనప్పటికీ, రిటైల్ అమ్మకాలపై ఇది అతి తక్కువ ప్రభావాన్ని చూపుతుందని పరిశ్రమ అంచనా వేస్తోంది. ఏప్రిల్ 1 తర్వాత ఒక్కసారి అమ్మకాలను బట్టి ఏ విధంగా ధరలు ప్రభావం చూపుతాయో వేచి చూడాలని నిపుణులు అంటున్నారు.


Click it and Unblock the Notifications








