కారులో కీలెస్ ఎంట్రీ సిస్టమ్ గురించి మీరు తెలుకోవాల్సిన కొన్ని కీలక విషయాలు!

నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో బ్రహ్మానందం బ్రేక్‌డౌన్ అయిన తన కారును లాక్ చేసేందుకు తలుపులకు ఉపయోగించే గొళ్లెం, తాళం చెవులను ఉపయోగించడం మీకందిరికీ గుర్తుండే ఉంటుంది. నిజానికి, ఒకప్పటి కాలంలో కార్లను లాక్ చేయాలంటే, ఇలాంటి పరిస్థితే ఉండేది. అయితే, కాలక్రమేనా టెక్నాలజీలో వచ్చిన మార్పులతో కార్లను లాక్ చేయడం మరియు అన్‌లాక్ చేయడంలో చాలా సులువుగా మారింది. మనం ఇప్పుడు మ్యాన్యువల్ డోర్ లాక్‌ల నుండి స్మార్ట్‌ఫోన్ సాయంతో వేరే దేశం నుండి కూడా కారును లాక్ మరియు అన్‌లాక్ చేసే స్థితికి ఎదిగాం.

కారులో కీలెస్ ఎంట్రీ సిస్టమ్ గురించి మీరు తెలుకోవాల్సిన కొన్ని కీలక విషయాలు!

అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పాటుగానే కార్లలో టెక్ ఫీచర్లు కూడా మారుతూ వచ్చాయి. అలాంటి ఫీచర్లలో ఇప్పుడు కామన్ గా వినిపించేది మరియు కనిపించేంది "కీలెస్ ఎంట్రీ" (Keyless Entry). దాని అర్థం దాని పేరులోనే ఉంది. అంటే, కారు డోరు హ్యాండిల్‌లో తాళం చెవి ఉంచి తిప్పాల్సిన అవసరం లేకుండానే కారులోకి ప్రవేశించడం మరియు నిష్క్రమించడం అన్నమాట. ఇలా రిమోట్ సాయంతో కారును లాక్ అన్ లాక్ చేసే ఫీచర్‌నే కీలెస్ ఎంట్రీ అంటారు.

కారులో కీలెస్ ఎంట్రీ సిస్టమ్ గురించి మీరు తెలుకోవాల్సిన కొన్ని కీలక విషయాలు!

ఈ కీలెస్ ఎంట్రీలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి కారును రిమోట్‌గా లాక్ లేదా అన్‌లాక్ చేయడానికి ఉపయోగించే కీలెఎస్ ఎంట్రీ సిస్టమ్. ఇందులో కారు తాళం చెవికి ఓ రిమోట్ కంట్రోల్ ఉంటుంది. దాని సాయంతో కారును లాక్/అన్‌లాక్ చేయవచ్చు. అయితే, కారును స్టార్ట్ చేయాలంటే మాత్రం తప్పనిసరిగా తాళం చెవిని ఇగ్నిషన్‌లో ఉంచి తిప్పాల్సి ఉంటుంది. ఇందులో ఉన్న మరొక అడ్వాంటేజ్ ఏంటంటే, ఎప్పుడైనా కీ రిమోట్‌లో బ్యాటరీ అయిపోతే, దాని తాళం చెవి సాయంతో కారు డోర్లను అన్‌లాక్ చేయవచ్చు. అంటే, కారు డోరుకి మరియు ఇగ్నిష్‌కు రెండింటికీ ఒకటే తాళం సరిపోతుందన్నమాట.

కారులో కీలెస్ ఎంట్రీ సిస్టమ్ గురించి మీరు తెలుకోవాల్సిన కొన్ని కీలక విషయాలు!

ఇక రెండవ రకం కీలెస్ ఎంట్రీ విషయానికి వస్తే, ఇది చూడటానికి జస్ట్ ఒక చిన్నసైజు రిమోట్ కంట్రోల్ మాదిరిగానే కనిపిస్తుంది. ఇందులో భౌతికంగా కనిపించే కీ (తాళం చెవి) ఉండదు, కానీ అది రిమోట్ లోపలే ఓ చిన్నపాటి లాక్ మెకానిజంతో అమర్చబడి ఉంటుంది. ఇలాంటి అడ్వాన్స్డ్ తాళం చెవుల సాయంతో కారును లాక్ లేదా అన్‌లాక్ చేయడం చాలా సులువు. ఇది జస్ట్ మీ జేబులో ఉంటే సరిపోతుంది. మీరు కారు దగ్గరకు వెళ్లగానే కారు ఆటోమేటిక్‌గా అన్‌లాక్ అవుతుంది. అలాగే, కారు నుండి దూరం వెళ్లగానే ఆటోమేటిక్‌గా అన్‌లాక్ అవుతుంది.

కారులో కీలెస్ ఎంట్రీ సిస్టమ్ గురించి మీరు తెలుకోవాల్సిన కొన్ని కీలక విషయాలు!

అంతేకాకుండా, ఇగ్నిషన్‌లో ఎలాంటి భౌతిక కీని ఇన్‌సెర్ట్ చేయాల్సిన అవసరం లేకుండానే పుష్ బటన్ సాయంతో కారును స్టార్ట్ కూడా చేయవచ్చు. అయితే, ఇందుకు తప్పనిసరిగా మీ జేబులో కానీ లేదా కారు లోపల కానీ కీఫాబ్ (రిమోట్ కీ) తప్పనిసరిగా ఉండాలి. ఇలాంటి కార్లలో డ్రైవర్ సైడ్ డోరుపై ఓ చిన్న బటన్ కూడా ఉంటుంది. ఇది ఎందుకు ఉపయోగిస్తారో మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. అయినా సరే మరోసారి దాని గురించి సవిరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

కారులో కీలెస్ ఎంట్రీ సిస్టమ్ గురించి మీరు తెలుకోవాల్సిన కొన్ని కీలక విషయాలు!

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న చాలా కార్లలో డ్రైవర్ సైడ్ డోర్ హ్యాండిల్ పై ఓ చిన్న బటన్ ఉంటుంది. ఈ బటన్ మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ బటన్ ఆ కారు యొక్క 'కీలెస్ ఎంట్రీ సిస్టమ్'లో భాగంగా పనిచేస్తుంది. ఈ బటన్ మీ కారు కీ ఫోబ్ రిమోట్‌కి కనెక్ట్ (సింక్) చేయబడి ఉంటుంది. మ్యాన్యువల్ లాక్ కలిగిన కార్ల విషయంలో అయితే, సాధారణంగా మనం కారు దగ్గరకు రాగానే దాని తాళం చెవి కోసం షర్టు లేదా ప్యాంట్ జేబులను తెగ వెతికేస్తూ ఉంటాం. అయితే, ఇలాంటి బటన్ ఉన్న కార్లను తాళం చెవితో తిప్పాల్సిన అవసరం లేకుండా, ఒక్క నొక్కుతోనే లాక్ లేదా అన్‌లాక్ చేయవచ్చు.

కారులో కీలెస్ ఎంట్రీ సిస్టమ్ గురించి మీరు తెలుకోవాల్సిన కొన్ని కీలక విషయాలు!

అయితే, ఈ బటన్ పనిచేయాలంటే సదరు కారుకు చెందిన తాళంచెవి మీ జేబులో ఉండాలి. రిమోట్ కీ మీ దగ్గర ఉంటే, మీరు డోర్ హ్యాండిల్స్‌పై ఉన్న ఎస్‌కెఎస్ (SKS - స్మార్ట్ కీ సిస్టమ్) బటన్‌ను నొక్కి కారు లోపలికి ప్రవేశించవచ్చు. మీరు కారు డోర్ హ్యాండిల్‌పై బటన్‌ను నొక్కినప్పుడు, అందులోని సెన్సార్లు కారుకి సమీపంలో కీ ఫోబ్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటాయి. కీఫాబ్ సమీపంలో ఉందని సెన్సార్లు గుర్తించిన వెంటనే కారు అన్‌లాక్ అవుతుంది. ఇలాంటి సందర్భాల్లో మీ కారుకి మరియు మీ కీఫాబ్‌కి మధ్య దూరం దాదాపు 3 అడుగులు మాత్రమే ఉండాలి. అంతకంటే, ఎక్కువ దూరంలో కీఫాబ్ ఉంటే, ఇది పనిచేయదు.

కారులో కీలెస్ ఎంట్రీ సిస్టమ్ గురించి మీరు తెలుకోవాల్సిన కొన్ని కీలక విషయాలు!

కారుని లాక్ చేయడానికి కూడా ఇదే పద్ధతిని పాటించాలి. మీరు కారు నుండి దూరం వెళ్లాలనుకున్నప్పుడు, మీ జేబులో కారు కీఫాబ్ ని ఉంచుకొని, ఈ బటన్‌ను నొక్కితే సరిపోతుంది. ఆటోమేటిక్‌గా కారు డోర్లు అన్నీ లాక్ అవుతాయి. గుర్తుంచుకోండి.. ఎలాంటి రిమోట్ కీ అయినా లేదా మ్యాన్యువల్ కీ అయినా సరే కారులోని డోర్లు అన్ని పూర్తిగా ఫ్లష్ అయ్యేలా మూసి ఉన్నప్పుడు మాత్రమే కారును లాక్ లేదా అన్‌లాక్ చేయడం సాధ్యమవుతుంది. కారులో ఏదైనా డోరు ఓపెన్ చేయబడి ఉంటే, ఈ ఫీచర్ పనిచేయదు. కాబట్టి, అన్ని డోర్లు ఖచ్చితంగా లాక్ అయి ఉన్నాయా లేదా అని నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంటుంది.

కారులో కీలెస్ ఎంట్రీ సిస్టమ్ గురించి మీరు తెలుకోవాల్సిన కొన్ని కీలక విషయాలు!

కారు డోర్ హ్యాండిల్స్‌పై అందించిన బటన్‌లను 'రిక్వెస్ట్ స్విచ్' లేదా 'రిక్వెస్ట్ సెన్సార్' అని కూడా అంటారు. పాత పద్ధతిలో డోరు హ్యాండిల్‌లోని కీహోల్‌లో కీని ఇన్‌సెర్ట్ చేయడం ద్వారా తలుపులు తెరవడానికి బదులుగా, బటన్లను నొక్కడం ద్వారా తలుపులు తెరవడానికి ఈ సాంకేతికత మిమ్మల్ని అనుమతిస్తుంది. అయితే దీని కోసం మీ కారు కీ ఫోబ్ తప్పనిసరిగా మీకు సమీపంలో లేదా మీ జేబులో ఉండేలా చూసుకోవాలి. కొన్ని ప్రీమియం కార్లలో మనుషల ప్రమేయం లేకుండా రిమోట్ సాయంతో బూట్ డోర్లను ఓపెన్ / క్లోజ్ చేయడంలో కూడా ఈ సాంకేతికతను ఉపయోగిస్తారు.

More from DriveSpark

Article Published On: Sunday, April 10, 2022, 9:00 [IST]
English summary
All you need to know about keyless entry system in cars
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+