భారత గగనతలాన్ని రక్షించేందుకు గాలిలోకి ఎగిరిన 'ప్రచంద్'.. మేడ్ ఇన్ ఇండియా లైట్ కోంబాట్ హెలికాప్టర్

ప్రతిదేశానికి సైన్యం ఎంతో కీలకమైనది. ప్రత్యేకించి ఇటీవలి కాలంలో జరిగిన ఆఫ్ఘనిస్థాన్-తాలిబన్, రష్యా-ఉక్రెయిన్ వంటి యుద్ధ పరిమాణాలు తలెత్తితే, వాటిని ధీటుగా తిప్పికొట్టేందుకు బలమైన సైన్యం చాలా అవసరం. ఈ నేపథ్యంలో, భారతదేశం కూడా తన సైన్యాన్ని ఎప్పటికప్పడు బలోపేతం చేసుకుంటోంది. కొత్త సాయుధాలు, విమానాలు, యుద్ధ నౌకలు, హెలికాప్టర్లు, యుద్ధ సాంకేతికతలను సైన్యంలో చేర్చుకుంటోంది.

భారత గగనతలాన్ని రక్షించేందుకు గాలిలోకి ఎగిరిన 'ప్రచంద్'.. మేడ్ ఇన్ ఇండియా లైట్ కోంబాట్ హెలికాప్టర్

తాజాగా, మన వాయు సేనలోకి పూర్తిగా స్వదేశీయంగా తయారు చేయబడిన మేడ్ ఇన్ ఇండియా లైట్ కోంబాట్ హెలికాప్టర్లను భారత వాయు సైన్యంలోకి చేర్చబడ్డాయి. ప్రచందా అని పిలువబడే ఈ లైట్ కోంబాట్ హెలికాప్టర్లు అక్టోబర్ 3వ తేదీన జోధ్‌పూర్ ఎయిర్‌బేస్‌లో పోస్ట్ చేయబడ్డాయి. ఈ హెలికాప్టర్ల సహాయంతో భారత్ - పాకిస్తాన్ సరిహద్దుల చుట్టూ పూర్తి నిఘా ఉంచడం జరుగుతుంది. అంతేకాకుండా, ఈహెలికాప్టర్లు మన దేశంలోకి ప్రవేశించే ఉగ్రవాదులు మరియు చొరబాటుదారులను అరికట్టడానికి సైనికులకు ఎంతగానో సహాయపడనున్నాయి.

భారత గగనతలాన్ని రక్షించేందుకు గాలిలోకి ఎగిరిన 'ప్రచంద్'.. మేడ్ ఇన్ ఇండియా లైట్ కోంబాట్ హెలికాప్టర్

భారత సైన్యానికి వైమానిక దళం చాలా ముఖ్యమైనది, వైమానిక దళం ఎప్పటికప్పుడు భారత సైన్యం కోసం తగినన్ని విమానాలు మరియు హెలికాప్టర్లను కొనుగోలు చేస్తోంది. అయితే, ఈసారి యుద్ద హెలికాప్టర్లను విదేశాల నుండి కొనుగోలు చేయకుండా, నేరుగా భారతదేశంలోనే తయారు చేశారు. వీటిని బెంగుళూరుకి చెందిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) రూపొందించింది. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ఎయిర్‌బేస్‌లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ హెలికాప్టర్‌లను జాతికి అంకితం చేశారు.

భారత గగనతలాన్ని రక్షించేందుకు గాలిలోకి ఎగిరిన 'ప్రచంద్'.. మేడ్ ఇన్ ఇండియా లైట్ కోంబాట్ హెలికాప్టర్

ప్రచంద్ హెలికాప్టర్ 5000 మీటర్ల ఎత్తు నుండి ల్యాండింగ్ మరియు టేకాఫ్ చేయగలదు. ఈ హెలికాప్టర్ ఆవశ్యకతను 1999 కార్గిల్ యుద్ధ సమయంలోనే భారత సైన్యం గుర్తించింది. విపరీతమైన చలి మరియు విపరీతమైన వేడి రెండింటిలోనూ పనిచేసే సామర్థ్యం గల ఈ విమానాన్ని స్వదేశీయంగా అభివృద్ధి చేయాలని భారత సైన్యం భావించింది. ఆ సమయంలో, భారతదేశం వద్ద ఫ్రాన్స్ యొక్క లెగసీ హెలికాప్టర్లు మరియు భారతదేశంలో తయారు చేయబడిన చేతక్ మరియు చీతా ఎన్ హెలికాప్టర్లు మాత్రమే ఉన్నాయి.

భారత గగనతలాన్ని రక్షించేందుకు గాలిలోకి ఎగిరిన 'ప్రచంద్'.. మేడ్ ఇన్ ఇండియా లైట్ కోంబాట్ హెలికాప్టర్

అయితే, అవన్నీ ఒకే ఇంజన్ హెలికాప్టర్లు, ఇవి గరిష్టంగా 3 టన్నుల బరువును ఎత్తగలవు. వీటిని లాజిస్టిక్స్ తీసుకెళ్లేందుకు మాత్రమే ఉపయోగించారు. ప్రస్తుతం భారతదేశం వద్ద Mi-17 మరియు దాని వేరియంట్లలో Mi-17-IV మరియు Mi-17 V5 హెలికాప్టర్లు మాత్రమే ఉన్నాయి. ఇవి గరిష్టంగా 13 టన్నుల బరువును మోయగలవు. అయితే, ఈ హెలికాప్టర్‌లు 2028 సంవత్సరంతో వాటి జీవితకాలాన్ని ముగించనున్నాయి. కాబట్టి భారత వైమానిక దళానికి బాగా అన్ని రకాలుగా ఉపయోగపడే బహుళ-పాత్ర సాయుధ హెలికాప్టర్ చాలా అవసరం. అందుకే 2006 సంవత్సరంలో తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ల ఉత్పత్తికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

భారత గగనతలాన్ని రక్షించేందుకు గాలిలోకి ఎగిరిన 'ప్రచంద్'.. మేడ్ ఇన్ ఇండియా లైట్ కోంబాట్ హెలికాప్టర్

ఆ తర్వాత హెచ్ఏఎల్ యొక్క రోటరీ వింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌ ప్రచంద్ తయారీకి స్వీకారం చుట్టింది. ఇదే కేంద్రంలో అధునాతన తేలికపాటి హెలికాప్టర్ ALH ధృవ మరియు దాని సాయుధ వెర్షన్ ALH రుద్ర హెలికాప్టర్లు కూడా అభివృద్ధి చేయబడ్డాయి. ప్రచంద్ లైట్ కోంబాట్ హెలికాప్టర్ (LCH) 5.8 టన్నుల బరువుతో రెండు ఇంజన్లను కలిగి ఉంటుంది. యుద్ధానికి వసరమైన అన్ని సాయుధాలతో ఈ హెలికాప్టర్లు అమర్చబడి ఉంటాయి. కోంబాట్ సెర్చ్ అండ్ రెస్క్యూ (CSAR), డిస్ట్రక్షన్ ఆఫ్ ఎనిమీ ఎయిర్ డిఫెన్స్ (DEAD) మరియు కౌంటర్ ఇన్‌సర్జెన్సీ (CI) కార్యకలాపాల కోసం ఈ హెలికాప్టర్లను వినియోగిస్తారు.

భారత గగనతలాన్ని రక్షించేందుకు గాలిలోకి ఎగిరిన 'ప్రచంద్'.. మేడ్ ఇన్ ఇండియా లైట్ కోంబాట్ హెలికాప్టర్

ప్రచంద్ లైట్ కోంబాట్ హెలికాప్టర్ లో ఇద్దరు వ్యక్తులు (పైలట్‌ మరియు కో-పైలట్) కూర్చోగలరు. ఇది 51.10 అడుగుల పొడవు, 15.5 అడుగుల ఎత్తు మరియు 5800 కిలోల బరువును కలిగి ఉంటుంది. ఇది 700 కిలోల వరకు ఆయుధాలను మోసుకెళ్లగలదు. ఈ హెలికాప్టర్ గరిష్ట వేగం గంటకు 268 కిలోమీటర్లు. ఫుల్ ట్యాంక్ ఇంధనంతో సుమారు 550 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు లేదా గాలిలో 3 గంటలు 10 నిమిషాల పాటు ఎగరగలదు. ఇది తగినంత మొత్తంలో ఆయుధాలు మరియు అవసరమైన వస్తువులను నేల పైనుండి 16,400 అడుగుల ఎత్తుకు కూడా తీసుకెళ్లగలదు.

భారత గగనతలాన్ని రక్షించేందుకు గాలిలోకి ఎగిరిన 'ప్రచంద్'.. మేడ్ ఇన్ ఇండియా లైట్ కోంబాట్ హెలికాప్టర్

అంతేకాకుండా, ప్రచంద్ లైట్ కోంబాట్ హెలికాప్టర్‌లో 20 మిమీ ఫిరంగి (క్యానన్) కూడా ఉంటుంది. ఇది నాలుగు హార్డ్ పాయింట్లను కలిగి ఉంటుంది. అంటే రాకెట్లు, క్షిపణులు మరియు బాంబులను విసరడానికి అవసరమైన క్యానన్ స్లాట్స్ అని చెప్పొచ్చు. ఇంకా ఇందులో పైలట్ మరియు కో-పైలట్ గన్నర్ కోసం టెన్డం కాక్‌పిట్ కాన్ఫిగరేషన్, అనేక స్టెల్త్ ఫీచర్లు, ఆర్మర్ ప్రొటెక్షన్, నైట్ ఎటాక్ సామర్ధ్యం మరియు మెరుగైన మనుగడ కోసం క్రాష్ యోగ్యమైన ల్యాండింగ్ గేర్‌లను కూడా కలిగి ఉంటుంది.

భారత గగనతలాన్ని రక్షించేందుకు గాలిలోకి ఎగిరిన 'ప్రచంద్'.. మేడ్ ఇన్ ఇండియా లైట్ కోంబాట్ హెలికాప్టర్

ప్రచంద్ కోసం 2006లో పని ప్రారంభమైనప్పటి నుండి 4 వేర్వేరు నమూనాలు వివిధ సమయాల్లో అభివృద్ధి చేయబడ్డాయి మరియు పరీక్షించబడ్డాయి. మొదటి ప్రయోగం 2010 లో నిర్వహించబడింది. ఆ తర్వాత రెండో సాంకేతిక పరీక్షను 2012లో విపరీతమైన చలిలో అత్యంత ఎత్తులో నిర్వహించారు. మూడవ మరియు నాల్గవ ప్రయోగాలను వరుసగా 2014 మరియు 2015లో నిర్వహించారు. ఈ హెలికాప్టర్ అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ పనిచేయగలదు.

భారత గగనతలాన్ని రక్షించేందుకు గాలిలోకి ఎగిరిన 'ప్రచంద్'.. మేడ్ ఇన్ ఇండియా లైట్ కోంబాట్ హెలికాప్టర్

ఈ హెలికాప్టర్ పరీక్షా లమయంలో ఎలక్ట్రో ఆప్టికల్ సిస్టమ్, హెల్మెట్ మౌంటెడ్ డిస్‌ప్లే సిస్టమ్, సాలిడ్ స్టేట్ డేటా రికార్డర్, వీడియో రికార్డర్, వెపన్ సిస్టమ్స్, రాకెట్ లాంచర్, ఎయిర్-టు-ఎయిర్ మిస్సైల్ సిస్టమ్‌లను పరీక్షించారు. ఇందుకోసం 1600 గంటలపాటు హెలికాప్టర్‌ను నడిపారు. ఆ తర్వాత ఆర్మీ, ప్రభుత్వం ఆమోదం పొందిన తర్వాత 15 హెలికాప్టర్లను తయారు చేశారు. అందులో 10 భారత వైమానిక దళానికి మరియు 5 భారత సైన్యానికి ఇవ్వబడ్డాయి. ఇందుకోసం రూ.3,887 కోట్ల నిధులను కేటాయించారు.

Most Read Articles

English summary
All you need to know about prachand light combat helicopter
Story first published: [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X