మీ వెహికల్స్ సౌండ్ పొల్యూషన్ చేస్తున్నాయా.. అయితే టేక్‌కేర్.. లేకుంటే?

కాలుష్యం అంటే కేవలం గాలి కాలుష్యం, నీటి కాలుష్యం మాత్రమే కాదు మితి మీరిన శబ్దం కూడా కాలుష్యాన్ని కలిగిస్తుంది. వాహనాల వల్ల ఈ శబ్ద కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. దీనికి ప్రధాన కారణం మాడిఫై చేయబడిన సైలెన్సర్లు. వాహనప్రియులు తమకు నచ్చిన వాహనాలను మాడిఫై చేసుకునే తరుణంలో అధిక శబ్దాన్ని కలిగించే సైలెన్సర్లను కూడా అమర్చుకుంటారు. ఇవి శబ్ద కాలుష్యానికి ప్రధాన హేతువుగా మారుతోంది.

మీ వెహికల్స్ సౌండ్ పొల్యూషన్ చేస్తున్నాయా.. అయితే టేక్‌కేర్.. లేకుంటే

అయితే ఇటువంటి శబ్ద కాలుష్యానికి కారణమయ్యే ద్విచక్ర వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని అలహాబాద్ హైకోర్టు ఇటీవల లక్నో బెంచ్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుకు సంబంధించి మరియు తీసుకున్న చర్యలకు సంబంధించి అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

మీ వెహికల్స్ సౌండ్ పొల్యూషన్ చేస్తున్నాయా.. అయితే టేక్‌కేర్.. లేకుంటే

తదుపరి విచారణ తేదీన అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు అధికారులను ఆదేశించింది. మాడిఫైడ్ సైలెన్సర్‌లను ఉపయోగించడం ద్వారా నిర్దేశించిన దానికంటే ఎక్కువ శబ్దం చేసే బైక్‌లపై కఠినమైన చర్యలు తీసుకోవడం ఇప్పుడు తప్పనిసరి అయ్యింది.

మీ వెహికల్స్ సౌండ్ పొల్యూషన్ చేస్తున్నాయా.. అయితే టేక్‌కేర్.. లేకుంటే

జస్టిస్ అబ్దుల్ మొయిన్‌తో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వులను జారీ చేసింది. మాడిఫైడ్ సైలెన్సర్‌లు ఎక్కువ శబ్దం చేస్తాయి. ఇది వాహనం చాలా దూరంలో ఉన్నప్పటికీ శబ్దం వినిపిస్తుంది. కానీ ఇది పిల్లలు, వృద్ధులు మరియు శారీరక అనారోగ్యంతో బాధపడేవారిపై తీవ్ర ప్రభావం చూపుతుందని కొన్ని నివేదికల ద్వారా తెలిసింది.

మీ వెహికల్స్ సౌండ్ పొల్యూషన్ చేస్తున్నాయా.. అయితే టేక్‌కేర్.. లేకుంటే

సాధారణంగా స్కూటర్లు మరియు బైక్‌లు 75 నుండి 80 డెసిబెల్‌ల వద్ద శబ్దం చేసేవిధంగా సెట్ చేయబడతాయి. దీనికి అనుకూలంగానే కంపెనీలు కూడా వాహనాలను తయారుచేస్తాయి. అయితే వాహనాలలో మాడిఫైడ్ సైలెన్సర్‌లను ఉపయోగిస్తే అప్పుడు వచ్చే శబ్దం 80 డెసిబెల్‌ల కంటే ఎక్కువగా ఉంటుంది.

మీ వెహికల్స్ సౌండ్ పొల్యూషన్ చేస్తున్నాయా.. అయితే టేక్‌కేర్.. లేకుంటే

అధికారులు ఈ సమస్యకు తక్షణ పరిష్కారం కనుగొనాలని కోర్టు తెలిపింది. ఈ సమస్య నిజంగా పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారతదేశంలో చాలా మంది ద్విచక్ర వాహనాలపై శబ్ద కాలుష్యాన్ని కలిగించే మార్పు చేసిన సైలెన్సర్‌లను ఉపయోగిస్తున్నారు.

మీ వెహికల్స్ సౌండ్ పొల్యూషన్ చేస్తున్నాయా.. అయితే టేక్‌కేర్.. లేకుంటే

ట్రాఫిక్ పోలీసులు మరియు రవాణా శాఖ అధికారులు మాడిఫైడ్ సైలెన్సర్‌లతో వాహనాలను నడుపుతూన్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు. గతంలో కూడా ఇలాంటి ఎక్కువ సౌండ్ చేసే వాహనాలకున్న సైలెన్సర్‌లను రోడ్ రోలర్ సహాయంతో తొక్కించిన వార్తలు కూడా వెలుగులోకి వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ నెట్‌వర్క్‌లలో వైరల్ కూడా అయ్యాయి.

మీ వెహికల్స్ సౌండ్ పొల్యూషన్ చేస్తున్నాయా.. అయితే టేక్‌కేర్.. లేకుంటే

ఇవన్నీ జరిగిన తరువాత కూడా ఇప్పటికీ చాలా మంది రైడర్స్ ఇదే పద్దతిని అవలంబిస్తున్నారు. ఈ కారణంగానే ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ ఆదేశానుసారం అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారని భావిస్తున్నారు. ఇకమీదటైనా ఈ సమస్య పరిష్కరించబడే అవకాశం ఉండవచ్చని అనిపిస్తోంది.

NOTE:ఇక్కడ ఉపయోగించిన ఫోటోలు కేవలం రిఫరెన్స్ కోసం మాత్రమే.

Most Read Articles

English summary
Allahabad High Court Orders To Take Action Against Noisy Two Wheelers. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X