Union Budget 2024: భారత్‌మాల పరియోజన పథకానికి బడ్జెట్‌లో భారీ కేటాయింపులు.. కీలక విషయాలివే.!!

భారత్‌మాల పరియోజన పథకం కింద మధ్యంతర బడ్జెట్ 2024(Union Budget 2024) లో భారీగా నిధులు కేటాయించారు. దేశంలో రహదారి మౌలిక సదుపాయాలకు(Bharatmala Pariyojana) ఊతమిచ్చేందుకు రోడ్డు రవాణా మంత్రిత్ర శాఖకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రూ. 2.7 లక్షల కోట్లు ప్రకటించారు.

2015 లో భారతమాల పరియోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ ఇది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన పారిశ్రామిక మండలాలు, రాష్ట్రాల కేంద్రాలు మరియు మారుమూల ప్రాంతాలను అనుసంధానం చేస్తుంది. బలమైన, సురక్షితమైన మరియు సమర్థవంతమైన రహదారుల నెట్‌వర్క్‌ను నిర్మించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య లక్ష్యం. తద్వారా దేశంలోని రహదారి మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయి.

Bharatmala-Pariyojana-Union-Budget-2024

కాగా భారత్‌మాల పరియోజనం పథకాన్ని రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) అమలు చేస్తుంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) , నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్(Road Infrastructure Development) డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మరియు మంత్రిత్వ శాఖలోని రోడ్ల విభాగం ఇందుకోసం పనిచేస్తాయి.

ఈ క్రమంలో రోడ్డు మౌలిక సదుపాయాలకు ఊతమిచ్చేందుకు ఈసారి మధ్యంతర బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ. 1.99 లక్షల కోట్లు ఉండగా.. 2023 కేంద్ర బడ్జెట్‌లో 36 శాతం పెంచి రూ. 2.7 లక్షల కోట్లకు పెంచారు. NHAI 2023-24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ కేటాయింపులో 14.7 శాతం ప్రోత్సాహాన్ని అందిస్తూ రూ. ₹1.62 లక్షల కోట్లు కేటాయించారు.

Bharatmala-Pariyojana-Union-Budget-2024

భారత్‌మాల పరియోజన పథకం కింద ఇప్పటివరకు ఆమోదించబడిన రూ. 5.35 లక్షల కోట్లతో 34,800 కి.మీ జాతీయ రహదారి కారిడార్‌ను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కాగా నవంబర్ 2023 నాటికి, మొత్తం 26,418 కి.మీ ప్రాజెక్టులో 15,045 కి.మీను పూర్తి చేయగా.. అక్టోబర్ 2023 వరకు రూ. 4.10 లక్షల కోట్లు ఖర్చు చేసింది.

భారతమాల పరియోజన పథకం ద్వారా దేశవ్యాప్త రహదారి నెట్‌వర్క్‌ను నిర్మించడమే ప్రధాన ఉద్దేశం. దీని ద్వారా ప్రజలకు ప్రయాణ సమయం చాలా వరకు తగ్గడంతో పాటు ఇంధనం కూడా ఆదా అవుతుంది. ఇంకా వేగంగా గూడ్స్‌ రవాణా జరుగుతుండటంతో.. లాజిస్టిక్స్ ఖర్చులు కూడా తక్కువ అవుతాయి.

Bharatmala-Pariyojana-Union-Budget-2024

అంతేకాకుండా సమర్థవంతమైన రోడ్‌ నెట్‌వర్క్‌ ద్వారా ప్రధాన నగరాలను కలపడం ద్వారా దేశ ఆర్థిక వృద్ధి కూడా మెరుగుపడుతుంది. భారత్‌మాల పరియోజన పథకం ద్వారా ముఖ్యంగా భారతదేశ సరుకు రవాణాను అధికంగా ప్రోత్సహించనుంది. ఇందులో భాగంగా ప్రధాన పారిశ్రామిక మండలాలు మరియు ఓడరేవులను కలుపుతూ ఆర్థిక కారిడార్లు నిర్మాణం అయ్యాయి.

ఈ పథకం ద్వారా వ్యవసాయ కేంద్రాలు కూడా బలోపేతం అవుతాయి. అంతర్-కారిడార్లు, కనెక్టింగ్ ఎకనామిక్ కారిడార్‌లు మరియు మారుమూల ప్రాంతాలను కలపడం కోసం ఫీడర్‌ మార్గాలను నిర్మించనున్నారు. ఇంకా హై ట్రాఫిక్‌ కారిడార్‌లను కూడా మెరుగుపరచాలని కేంద్రం భావిస్తోంది. పక్కా ప్రణాళికతో బార్డర్‌ కనెక్టివిటీ బలోపేతం చేయడం ద్వారా పొరుగుదేశాలతో వాణిజ్య సంబంధాలను మెరుగుపరచడం కూడా ఈ ప్రాజెక్టులో ముఖ్య భాగం.

More from DriveSpark

Article Published On: Thursday, February 1, 2024, 19:50 [IST]
English summary
Allocation for road infrastructure under bharatmala pariyojana project union budget 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+