అల్లు అరవింద్ కొత్త కారు ఇదే!.. ధర తెలిస్తే షాకవుతారు

తెలుగు సినీ పరిశ్రమలో 'అల్లు అరవింద్' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే అగ్ర నిర్మాతలలో ఒకరుగా ఉంటూ.. ఇండస్ట్రీలో వరుస విజయాలను సొంతం చేసుకున్నాయి. ఇటీవల ఈయన ఓ కొత్త కారు కొన్నారు. మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

అల్లు అరవింద్ (Allu Aravind) కొనుగోలు చేసిన కారు 'బీఎండబ్ల్యూ' (BMW) కంపెనీ చెందిన 'ఐ7' (i7) ఎలక్ట్రిక్ కారు అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో కారును డెలివరీ చేయడం, కారుతో అల్లు అరవింద్ ఫోటోలు దిగటం కూడా చూడవచ్చు. వీడియో చివర్లో అల్లు అరవింద్ కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లడం గమనించవచ్చు.

Allu Aravind Buys New BMW i7

బీఎండబ్ల్యూ ఐ7 ఎలక్ట్రిక్ కారు విషయానికి వస్తే.. ఇది మంచి డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ పొందుతుంది. ఈ ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధర రూ.1.95 కోట్లు (ఎక్స్-షోరూమ్) ఉన్నట్లు సమాచారం. అయితే అల్లు అరవింద్ కొన్న కారు ధర రూ.2.50 కోట్ల కంటే ఎక్కువని తెలుస్తోంది. ఇది xDrive60 అనే ఒకే వేరియంట్లో లభిస్తుంది. కానీ ఆధునిక కాలంలో వాహన వినియోగదారులకు కావలసిన అన్ని ఫీచర్స్ పొందుతుంది.

అల్లు అరవింద్ కొనుగోలు చేసిన ఈ కారును డీలర్షిప్ సిబ్బంది నేరుగా వారి ఇంటికి తీసుకెళ్లి డెలివరీ చేశారు. ఈ కారు డిజైన్ మరియు ఇంటీరియర్ కూడా ఈ వీడియోలో గమనించవచ్చు. ఈ కారు ఫ్రంట్ గ్రిల్ మీద ఐ బ్యాడ్జ్ ఉండటం చూడవచ్చు. స్పిల్ట్ హెడ్‌ల్యాంప్, కొత్త అల్లాయ్ వీల్స్ ఉండటం ఇక్కడ గమనించవచ్చు. వెనుక వైపు ఐ7 బ్యాడ్జ్ ఉంది.

Allu Aravind BMW i7

ఫీచర్స్ విషయానికి వస్తే.. బీఎండబ్ల్యూ ఐ7 ఈవీ 14.9 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, 12.3 ఇంచెస్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు 31.3 ఇంచే సినిమా స్క్రీన్ వంటివి ఇందులో ఉన్నాయి. ఈ స్క్రీన్ పైకి ముడుచుకోవడానికి, కిందికి దింపడానికి చాలా అనుకూలంగా ఉంది. వెనుక డోర్స్ వద్ద కూడా టచ్‌స్క్రీన్‌లు ఉంటాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

బీఎండబ్ల్యూ ఐ7 ఎలక్ట్రిక్ కారు 101.7-కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ పొందుతుంది. ఇది సింగిల్ చార్జితో 591 కిమీ నుంచి 625 కిమీ వరకు రేంజ్ అందిస్తుంది. ఈ కారు టాప్ స్పీడ్ గంటకు 239 కిమీ కావడం గమనార్హం. ఇది 4.7-సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇందులోని మోటార్లు 644 హార్స్ పవర్ మరియు 745 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తాయి.

బీఎండబ్ల్యూ ఐ7 ఈవీ పరిమాణం పరంగా కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది. ఈ సెడాన్ 5391 మిమీ పొడవు, 1950 మిమీ వెడల్పు మరియు 1544 మిమీ ఎత్తు ఉంటుంది. కాబట్టి ఇచ్చి వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఛార్జింగ్ పరంగా ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ కారును కొనుగోలు చేసిన మొదటి టాలీవుడ్ సెలబ్రిటీ అల్లు అరవింద్ అని తెలుస్తోంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Saturday, April 27, 2024, 13:00 [IST]
English summary
Allu aravind buys new bmw i7 electric car details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+