Allu Arjun Arrest కారులోంచి అభిమానులకు అభివాదం చేయడం అల్లు అర్జున్ చేసిన తప్పిదమా?.. ఈ వీడియో చెక్ చేశారా!
గ్లోబల్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)ని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రోజు మధ్యాహ్నం ఆయన నివాసంలో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పుష్ప2 విడుదల సమయంలో సంధ్య థియేటర్ వద్ద ప్రీమియం షోకి అల్లు అర్జున్ హాజరవుతున్న సమయంలో జరిగిన తొక్కిసలాటలో అభిమాని రేఖ ప్రాణాలు కోల్పోయింది. రేఖ భర్త భాస్కర్ తన భార్య మృతికి అల్లుఅర్జున్ కారణం అంటూ చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇదివరకే ఆయనకు నోటీసులు పంపిన పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు.
అల్లు అర్జున్‌తో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యంపై హత్యానేరం కింద చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 105 (ఉద్దేశపూర్వక హత్య), 118 (1) (ఉద్దేశపూర్వకంగా గాయపరచడం) R /W3 (5) BNS చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. మృతురాలి భర్త భాస్కర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించనట్లు సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాంశ్ యాదవ్ ఇదివరకే తెలిపారు.

ఈరోజు ఉదయం నుంచే అల్లుఅర్జున్ ఇంటివద్ద హడావిడి నెలకొంది. ఒకానొక సమయంలో పోలీసులతో అల్లు అర్జున్ అసహనం వ్యక్తం చేసినట్లు కూడా తెలుస్తోంది. ఇదే సమయంలో ఆయన పోలీసులకు సహకరిస్తామని కూడా కోరారు. ఇదివరకే రేఖ కుటుంబానికి అల్లు అర్జున్ టీమ్ రూ.25 లక్షల సహాయం ప్రకటించింది. అంతే కాకుండా జరిగిన ప్రాణ నష్టానికి సైతం క్షమాపణలు చెప్పారు.
ఇదే కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించి ఓ వ్యక్తి మరణానికి కారణమయ్యారంటూ సంధ్య థియేటర్ యజమానిని సైతం ఇదివరకే పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి తనపై నమోదైన కేసును కొట్టివేయాలని అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. పుష్ప2 ది రూల్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ఈవెంట్ తర్వాత అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేశారు.

కాన్వాయ్ కారణమా?: బెనిఫిట్ షోకి అల్లు అర్జున్ వస్తున్నారని తెలిసి జనాలు, అభిమానులు భారీ సంఖ్యలో సంధ్య థియేటర్‌కి చేరుకున్నారు. ఇదే సమయంలో అల్లు అర్జున్ కారులో ఉండి అభివాదం చేస్తూ వెళ్తున్న విజువల్స్ కనిపించాయి. అతడి సెక్యూరిటీ కాన్వాయ్‌ని బయటే నిలిపివేశారు. ఈ సమయంలో అల్లు అర్జున్ మాత్రం తన కారులోంచి అభిమానులకు అభివాదం చేస్తూ థియేటర్‌లోకి ఎంటర్ అయ్యారు.
ఇదే సమయంలో కారు కోసం గేట్లు తీయడం, ఆ వెంటనే జనాలు ఒక్కసారిగా లోపలికి చొచ్చుకుపోయిట్లు తెలుస్తోంది. అప్పుడే తొక్కిసలాటలో రేఖ చనిపోయినట్లు తెలుస్తోంది. సాధారణంగా సెక్యూరిటీతో లోపలికి వెళ్తే ఈ ప్రమాదం జరిగేది కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. అప్పటికే భారీగా చేరుకున్న జనాలు అల్లు అర్జున్ కారుని ఫాలో అవుతూ వందల సంఖ్యలో థియేటర్‌లోకి చేరుకున్న దృశ్యాలు సైతం ఇంటర్‌నెట్‌లో వైరల్ అయ్యాయి.
గతంలో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన: ఏప్రిల్ 2022లో అల్లు అర్జున్ ప్రయాణిస్తున్న రేంజ్ రోవర్ ఎస్‌యూవీ బ్లాక్ ఫిల్మ్‌తో ఉన్న కారులో ఉండగా పోలీసులు రూ. 700 ఫైన్ వేశారు. నేరాలను నిలువరించేందుకు సుప్రీం కోర్ట్ బ్లాక్ ఫిల్మ్ (Tinted Glass), సన్ ఫిల్మ్ (Sun Films)ని బ్యాన్ చేసింది.
ప్రస్తుతం ఈ ఐకాన్ స్టార్ వద్ద ప్రైవేట్ జెట్, ఫాల్కాన్ వ్యానిటీ వ్యాన్ (Falcon Vanity Van), రేంజ్ రోవర్ వోగ్, మెర్సిడెస్ GLE 350d, జాగ్వార్ XJ L, వోల్వో XC90 T8 ఎక్సలెన్స్, బెంట్లీ కాంటినెంటల్, BMW X6 M స్పోర్ట్‌తో సహా మరెన్నో లగ్జరీ కార్లను కలిగి ఉన్నాడు.


Click it and Unblock the Notifications








