హ్యార్లీ డేవిడ్‌సన్ బైక్‌పై అల్లు అర్జున్ ఇద్దరమ్మాయిలతో..
మన స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ 'ఇద్దరమ్మాయిలతో' నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసినదే. అల్లు అర్జున్ మొదటిసారిగా ఇద్దరు హీరోయిన్‌లతో కలసి పనిచేసిన చిత్రమిది. అందుకే ఈ చిత్రంపై ఇటు యువతలో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చిత్రంలో అల్లు అర్జున్, అమలా పాల్, కేథరిన్‌లు ప్రధాన పాత్రదారులు.
ఓ మంచి రొమాంటి లవ్ స్టోరీని పూరి జగన్నాథ్ ఈ చిత్రం ద్వారా పరిచయం చేయనున్నాడు. ఈ సినిమా చూసేందుకు అభిమానులు థియేటర్ల ముందు ఉదయం నుంచే పడికాపులు కాస్తున్నారు. స్టయిల్ స్టార్‌కి స్టార్ డైరెక్టర్ తోడైతే ఇంకేముంది చెప్పండి 'టాప్ లేచిపోద్ది' కదూ..! ఇద్దరమ్మాయిలతో చిత్రం కూడా అలానే ఉంటుంది. కథానాయికల అందాల వలకబోత ఈ చిత్రానికి మరొక ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు.
ఇద్దరమ్మాయిలతో చిత్రం రివ్యూ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
సరే అదంతా అటుంచింతే, ఈ చిత్రంలో మన స్టయిలిష్ స్టార్ తన స్టయిల్‌కి తగినట్లుగానే అమెరికన్ బ్రాండెడ్ మోటార్‌సైకిల్‌ను ఎంచుకున్నాడు. అమెరికన్ లగ్జరీ మోటార్‌సైకిల్ హ్యార్లీ డేవిడ్‌సన్ అందిస్తున్న 'నాట్ రాడ్ స్పెషల్' (Night Rod Special) బైక్‌పై అల్లు అర్జున్ కనిపిస్తాడు. స్టయిలిష్ లుక్, ప్రీమియం రైడ్ క్వాలిటీ, ఎగ్జాస్ట్ బీటింగ్, అల్టిమేట్ హ్యాండ్లింగ్‌లు ఈ బైక్ ప్రత్యేకత.
భారత మార్కెట్లో ఈ బైక్ ధర రూ.21.75 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). బైక్‌లో 1247సీసీ, లిక్విడ్ కూల్డ్, వి-ట్విన్ ఇంజన్‌ను ఉపయోగించారు. దీనికి ఐదు గేర్లు ఉంటాయి. ఇందులో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్) మరియు స్మార్ట్ సెక్యూరిటీ సిస్టమ్ ఫీచర్లు విశిష్టమైనవి. మరి అల్లు అర్జున్ నడిపిన ఈ స్టయిలిష్ బైక్ అందాలను మనం కూడా చూసేద్దామా..!

హ్యార్లీ డేవిడ్‌సన్ బైక్‌పై అల్లు అర్జున్ ఇద్దరమ్మాయిలతో..

హ్యార్లీ డేవిడ్‌సన్ బైక్‌పై అల్లు అర్జున్ ఇద్దరమ్మాయిలతో..

హ్యార్లీ డేవిడ్‌సన్ బైక్‌పై అల్లు అర్జున్ ఇద్దరమ్మాయిలతో..

హ్యార్లీ డేవిడ్‌సన్ బైక్‌పై అల్లు అర్జున్ ఇద్దరమ్మాయిలతో..

హ్యార్లీ డేవిడ్‌సన్ బైక్‌పై అల్లు అర్జున్ ఇద్దరమ్మాయిలతో..

హ్యార్లీ డేవిడ్‌సన్ బైక్‌పై అల్లు అర్జున్ ఇద్దరమ్మాయిలతో..

హ్యార్లీ డేవిడ్‌సన్ నైట్ రాడ్ స్పెషల్

హ్యార్లీ డేవిడ్‌సన్ నైట్ రాడ్ స్పెషల్

హ్యార్లీ డేవిడ్‌సన్ నైట్ రాడ్ స్పెషల్

హ్యార్లీ డేవిడ్‌సన్ నైట్ రాడ్ స్పెషల్

హ్యార్లీ డేవిడ్‌సన్ నైట్ రాడ్ స్పెషల్

హ్యార్లీ డేవిడ్‌సన్ నైట్ రాడ్ స్పెషల్

హ్యార్లీ డేవిడ్‌సన్ నైట్ రాడ్ స్పెషల్

హ్యార్లీ డేవిడ్‌సన్ నైట్ రాడ్ స్పెషల్

ఇద్దరమ్మాయిలతో స్టిల్స్

ఇద్దరమ్మాయిలతో స్టిల్స్

Click it and Unblock the Notifications