స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లగ్జరీ కార్స్, ఎలా ఉన్నాయో చూసారా..!

దక్షిణ భారతదేశ సినీ రంగంలో బాగా ప్రసిద్ధిచెందిన హీరోలలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. తన నటన మరియు డ్యాన్స్ తో అల్లు అర్జున్ ఎక్కువమంది అభిమానుల మనసు దోచాడు. గంగోత్రి సినిమాతో తెలుగు సినీరంగప్రవేశంచేసిన యితడు ఇటీవల వచ్చిన అల వైకుంఠపురంలో సినిమాతో భారీ విజయాన్ని కైవసం చేసుకుని, ఇప్పుడు పుష్ప సినిమాతో త్వరలో అభిమానుల ముందుకు రానున్నాడు.

ఈ రోజు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు, కావున ఈ సందర్భంగా అల్లు అర్జున్ వాడుతున్న విలాసవంతమైన మరియు లగ్జరీ కార్లను గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..రండి.

స్టైలిష్ స్టార్ బర్త్ డే స్పెషల్.. అల్లు అర్జున్ స్పెషల్ లగ్జరీ కార్స్, ఎలా ఉన్నాయో చూసారా..!

​రేంజ్ రోవర్ వోగ్:

అల్లు అర్జున వాడుతున్న అత్యంత లగ్జరీ కార్లలో రేంజ్ రోవర్ వోగ్ ఒకటి. ఈ కారును చాలా మంది సెలబ్రెటీలు కూడా కలిగి ఉన్నారు. ఇది చాలా మంచి ఫీచర్స్ మరియు పర్ఫామెన్స్ చూపుతుంది కావున ఎక్కువమంది దీనిని ఇష్టపడతారు. దీని ధర ఎక్స్ షోరూమ్ ప్రకారం రూ.2.13 కోట్లు.

స్టైలిష్ స్టార్ బర్త్ డే స్పెషల్.. అల్లు అర్జున్ స్పెషల్ లగ్జరీ కార్స్, ఎలా ఉన్నాయో చూసారా..!

ఈ కారు మంచి ఇంటీరియర్ ఫీచర్స్ మరియు సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉండటమే కాకుండా వాహనదారునికి చాలా అనుకూలంగా కూడా ఉంటుంది. ​రేంజ్ రోవర్ వోగ్ లో 3.0-లీటర్ 6 సిలీండర్ గ్యాసోలిన్ ఇంజిన్ ఉంటుంది. ఇది 334 బిహెచ్‌పి పవర్, 450 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.

MOST READ:యువకుడితో పోరాడిన 82 ఏళ్ల వృద్ధుడు.. కారణం తెలిస్తే శభాష్ అంటారు

స్టైలిష్ స్టార్ బర్త్ డే స్పెషల్.. అల్లు అర్జున్ స్పెషల్ లగ్జరీ కార్స్, ఎలా ఉన్నాయో చూసారా..!

ఈ కారు ఒక లీటరుకు గరిష్ఠంగా 8.7 కిలోమీటర్ల మైలేజి అందిస్తుంది. అంతేకాకుండా డీన్ వేగం గంటకు 210 కిలోమీటర్లు. ఇది కేవలం 5.4 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వరకు వేగవంత అవుతుంది. ఇది ఎలాంటి రోడ్డులో అయినా ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది.

స్టైలిష్ స్టార్ బర్త్ డే స్పెషల్.. అల్లు అర్జున్ స్పెషల్ లగ్జరీ కార్స్, ఎలా ఉన్నాయో చూసారా..!

జాగ్వర్ ఎక్స్‌జేఎల్:

జాగ్వార్ బ్రాండ్ యొక్క ఎక్స్‌జేఎల్ కారుని కూడా అల్లు అర్జున్ కలిగి ఉన్నాడు. దీనిని స్టైలిష్ స్టార్ అక్షరాలా 1.11 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. ఈ కారు మంచి లగ్జరీ ఫీచర్స్ కలిగి ఉంటుంది, మరియు మంచి పనితీరుని అందిస్తుంది.

MOST READ:ఎట్టకేలకు భారత్‌లో అడుగెట్టిన సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్; ధర & వివరాలు

స్టైలిష్ స్టార్ బర్త్ డే స్పెషల్.. అల్లు అర్జున్ స్పెషల్ లగ్జరీ కార్స్, ఎలా ఉన్నాయో చూసారా..!

జాగ్వర్ ఎక్స్‌జేఎల్ కారులో 3.0-లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 301.73 బిహెచ్‌పి పవర్, 689 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ కి జతచేయబడి ఉంటుంది. ఇది ఒక లీటరుకు గరిష్ఠంగా 14.47 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది.

ఈ జాగ్వర్ ఎక్స్‌జేఎల్ యొక్క గరిష్ఠంగా గంటకు 250 కిలోమీటర్లు. ఇది కేవలం 7.3 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వరకు వేగవంతమవుతుంది. ఈ జాగ్వర్ ఎక్స్‌జేఎల్ లో 10 ఇంచెస్ స్క్రీన్, వెనకు ప్రయాణికుల ఫోల్డబుల్ బిజినెస్ టేబుల్స్, ఆర్మరెస్ట్ మౌంటెడ్ బటన్స్, యాంబియంట్ లైటింగ్ వంటివి ఉన్నాయి.

స్టైలిష్ స్టార్ బర్త్ డే స్పెషల్.. అల్లు అర్జున్ స్పెషల్ లగ్జరీ కార్స్, ఎలా ఉన్నాయో చూసారా..!

హమ్మర్ హెచ్2:

చాలామంది రాజకీయ నాయకులు, సెలబ్రెటీలు కూడా ఈ హమ్మర్ వాహనాలను కలిగి ఉన్నారు. ఎక్కువగా బాలీవుడ్ సెలబ్రెటీలు ఈ వాహనాన్ని కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ కూడా హమ్మర్ బ్రాండ్ కొనుగోలు చేసాడు.

MOST READ:కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ కొన్న పంజాబీ సింగర్, ఎవరో తెలుసా?

స్టైలిష్ స్టార్ బర్త్ డే స్పెషల్.. అల్లు అర్జున్ స్పెషల్ లగ్జరీ కార్స్, ఎలా ఉన్నాయో చూసారా..!

అల్లు అర్జున్ కొనుగోలు చేసిన హమ్మర్ హెచ్ 2 ధర రూ. 75 లక్షలు. హమ్మర్ హెచ్ 2 కారు 393 బిహెచ్‌పి పవర్, 563 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది కేవలం 9.2 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వరకు వేగవంతం అవుతుంది. హమ్మర్ హెచ్ 2 యొక్క గరిష్ఠ వేగం గంటకు 190 కిలోమీటర్లు. ఇది ఎటువంటి రోడ్డులో అయినా ప్రయాణించడానికి అనుకూలంగా తయారుచేయబడింది.

స్టైలిష్ స్టార్ బర్త్ డే స్పెషల్.. అల్లు అర్జున్ స్పెషల్ లగ్జరీ కార్స్, ఎలా ఉన్నాయో చూసారా..!

మెర్సిడెజ్ బెంజ్ జీఎల్ఈ 350డీ:

అల్లు అర్జున్ ప్రముఖ లగ్జరీ కార్ కంపెనీ అయిన బెంజ్ యొక్క జీఎల్ఈ 350 డీ కారుని కూడా కొనుగోలు చేశారు. ఈ ​మెర్సిడెజ్ బెంజ్ జీఎల్ఈ 350డీ లగ్జరీ కారు ధర రూ.7 7.82 లక్షలు. ఈ వాహనం అల్లు అర్జున్ కి చాలా ఇష్టమైన వాహనం. ఎక్కువగా అల్లు అర్జున్ ఈ వాహనాన్ని ఉపయోగిస్తుంటారు.

MOST READ:ఒంటరిగా కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు మాస్క్ అవసరమా? లేదా?.. హైకోర్టు క్లారిటీ

స్టైలిష్ స్టార్ బర్త్ డే స్పెషల్.. అల్లు అర్జున్ స్పెషల్ లగ్జరీ కార్స్, ఎలా ఉన్నాయో చూసారా..!

బెంజ్ జీఎల్ఈ 350డీ 3.0 లీటర్ వీ టైప్ ఇంజిన్ ను కలిగి ఉంటుంది. ఇది 254.97 బిహెచ్‌పి పవర్, 620 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ యూనిట్ కి జతచేయబడి ఉంటుంది. ఈ కారు యొక్క మైలేజ్ లీటరుకు గరిష్ఠంగా 11.57 కిలోమీటర్ల వరకు అందిస్తుంది. ఈ సెడాన్ యొక్క గరిష్ఠ వేగం గంటకు 225 కిలోమీటర్లు.

స్టైలిష్ స్టార్ బర్త్ డే స్పెషల్.. అల్లు అర్జున్ స్పెషల్ లగ్జరీ కార్స్, ఎలా ఉన్నాయో చూసారా..!

బీఎండబ్ల్యూ ఎక్స్6ఎమ్:

అల్లుఅర్జున్ మరో లగ్జరీ కార్ బీఎండబ్ల్యూ బ్రాండ్ అయిన ఎక్స్6ఎమ్. దీని ధర రూ. 92.2 లక్షలు. ఇందులో దాదాపు అన్ని లగ్జరీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఏడబ్ల్యూడీ సిస్టం హై గ్రౌండ్ క్లియరెన్స్, వైడ్ వీల్స్ వంటివి కూడా ఉన్నాయి.

స్టైలిష్ స్టార్ బర్త్ డే స్పెషల్.. అల్లు అర్జున్ స్పెషల్ లగ్జరీ కార్స్, ఎలా ఉన్నాయో చూసారా..!

​బీఎండబ్ల్యూ ఎక్స్6ఎమ్ లో 3.0 -లీటర్ ట్విన్ టర్బో గ్యాసోలిన్ బర్నర్ కలిగి ఉంది. ఇది 306 బిహెచ్‌పి పవర్, 400 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ యూనిట్ కి జతచేయబడి ఉంటుంది.

ఈ కారు యొక్క మైలేజ్ విషయానికి వస్తే ఇది లీటరుకు గరిష్ఠంగా 10.88 కిలోమీటర్ల మైలేజి అందిస్తుంది. ఇది కేవలం 3.8 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతమవుతుంది. దీని గరిష్ఠంగా గంటకు 240 కిలోమీటర్లు.

స్టైలిష్ స్టార్ బర్త్ డే స్పెషల్.. అల్లు అర్జున్ స్పెషల్ లగ్జరీ కార్స్, ఎలా ఉన్నాయో చూసారా..!

వోల్వో ఎక్స్ సీ90 టీ8 ఎక్సలెన్స్:

వోల్వో బ్రాండ్ యొక్క కొత్త మోడల్ వోల్వో ఎక్స్ సీ90 టీ8 ఎక్సలెన్స్ కారుని కూడా అల్లు అర్జున్ కలిగి ఉన్నాడు. దీనిని రూ.1.31 కోట్లకు కొనుగోలు చేశాడు. ఈ కారులో 2.0-లీటర్ ట్విన్ సూపర్ టర్బో ఛార్జెడ్ గ్యాసోలిన్ ఇంజిన్ ఉంటుంది. ఇది 400 బిహెచ్‌పి పవర్, 640 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

​వోల్వో ఎక్స్ సీ90 టీ8 ఎక్సలెన్స్ కారులో మంచి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో ఉన్న సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 8 ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ బ్రేకింగ్ డిస్ట్రిబ్యూషన్ తో కూడిన యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టం, ఛైల్డ్ సేఫ్టీ లాక్స్, యాంటీ థెఫ్ట్ అలారం, రేర్ సీటు బెల్టులు, సీట్ బెల్ట్ అలర్ట్స్ వంటివి ఉన్నాయి.

స్టైలిష్ స్టార్ బర్త్ డే స్పెషల్.. అల్లు అర్జున్ స్పెషల్ లగ్జరీ కార్స్, ఎలా ఉన్నాయో చూసారా..!

​బెంట్లీ కాంటినెంటల్ జిటి:

అల్లు అర్జున్ ఇటీవల కాలంలో అత్యంత ఖరీదైన కాంటినెంటల్ జిటి కారుని కొనుగోలు చేశారు. దీని విలువ 3 కోట్ల రూపాయలకంటే ఎక్కువగా ఉంటుంది. ఈ లగ్జరీ కారులో ప్రయాణిస్తూ అల్లు అర్జున్ ఫ్యామిలీ కనిపించింది.

స్టైలిష్ స్టార్ బర్త్ డే స్పెషల్.. అల్లు అర్జున్ స్పెషల్ లగ్జరీ కార్స్, ఎలా ఉన్నాయో చూసారా..!

ఈ బెంట్లీ కారు వి 8 కన్వర్టిబుల్. ఇది ట్విన్-టర్బోచార్జ్ చేయబడిన 4.0-లీటర్ వి 8 ద్వారా శక్తిని పొందుతుంది. ఇంజిన్ 500 పిఎస్ గరిష్ట శక్తిని మరియు 660 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తిని ఉత్పత్తి చేస్తుంది. కాంటినెంటల్ జిటి 2.4 టన్నుల బరువు ఉంటుంది. కాబట్టి, దీనికి ఎక్కువ పవర్ మరియు టార్క్ అవసరం. ఇంజిన్ 8-స్పీడ్ ట్రాన్స్మిషన్ తో జతచేయబడుతుంది, ఇది నాలుగు చక్రాలకు శక్తిని పంపుతుంది.

స్టైలిష్ స్టార్ బర్త్ డే స్పెషల్.. అల్లు అర్జున్ స్పెషల్ లగ్జరీ కార్స్, ఎలా ఉన్నాయో చూసారా..!

​వ్యానిటీ వ్యాన్:

అల్లు అర్జున విలాసవంతమైన కార్లను మాత్రమే కాదు ఒక లగ్జరీ కారా వ్యాన్ కూడా కలిగి ఉన్నాడు. ఇది చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే ఇది తన కోసం ప్రత్యేకంగా తయారుచేయించుకున్నాడు. ఇది చూడటానికి ఒక చిన్న ఇంద్ర భవనం లాగా ఉంటుంది.

స్టైలిష్ స్టార్ బర్త్ డే స్పెషల్.. అల్లు అర్జున్ స్పెషల్ లగ్జరీ కార్స్, ఎలా ఉన్నాయో చూసారా..!

అల్లు అర్జున్ యొక్క కారా వ్యాన్ ధర రూ.7 కోట్లు. ఈ కారు బ్లాక్ కలర్ లో చాలా అద్భుతంగా ఉంది. అధునాతన హంగులు, ఫీచర్లతో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో టీవీ చూసేందుకు వీలుగా బెడ్, సోఫా వంటి వాటితో పాటు టాయిలెట్, షవర్ లాంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి.

Most Read Articles

English summary
Stylish Star Allu Arjun Car Collection. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X