అమర రాజా కంపెనీ కొత్త చైర్మన్‌గా గల్లా జయదేవ్

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అమర రాజా గ్రూప్ అఫ్ కంపెనీ భారతదేశానికి చెందిన బహుళజాతి సంస్థ. అమర రాజా కంపెనీ యొక్క ప్రధాన కార్యాలయం తిరుపతి సమీపంలో ఉన్న కరకంబాడిలో ఉంది. అమరరాజా గ్రూప్ ఆటోమోటివ్ బ్యాటరీ బ్రాండ్ అమరోన్ తయారీలో మంచి గుర్తింపు పొందింది. ఇది ఎక్సైడ్ ఇండస్ట్రీస్ తరువాత భారతదేశంలో రెండవ అతిపెద్ద అమ్మకపు ఆటోమోటివ్ బ్యాటరీ బ్రాండ్.

అమర రాజా కంపెనీ కొత్త చైర్మన్‌గా గల్లా జయదేవ్

అయితే ఇటీవల అమర రాజా కంపెనీకి సంబంధించిన ఒక వార్త వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే ఎంతో కాలంగా కంపెనీ యొక్క అభివృద్ధికి పాటుపడిన కంపెనీ వ్యవస్థాపకుడు మరియు చైర్మన్ గల్లా రామచంద్ర తన చైర్మన్ పదవికి స్వస్తి పలికాడు. ఈ స్థానంలో గల్లా రామచంద్ర కుమారుడు మరియు ఎంపి గల్లా జయదేవ్ అమర రాజా కంపెనీకి కొత్త చైర్మన్ గా రానున్నారు.

అమర రాజా కంపెనీ కొత్త చైర్మన్‌గా గల్లా జయదేవ్

గల్లా జయదేవ్‌ కొత్త చైర్మన్‌గా ఆగస్టు నుంచి బాధ్యతలు చేపట్టనున్నారు. అప్పటివరకు గల్లా రామచంద్ర ఆ పదవిలో కొనసాగుతారు. ఆగస్టులో జరిగే వార్షిక సర్వ సభ్య సమావేశం తరువాత జయదేవ్ చైర్మన్‌ హోదాలో కొనసాగనున్నారు.

అమర రాజా కంపెనీ కొత్త చైర్మన్‌గా గల్లా జయదేవ్

అమర రాజా కంపెనీకి దాదాపు 36 సంవత్సరాల పాటు సారథ్యం వహించి, అగ్రగామిగా తీర్చిదిద్దగలగడం తనకు చాలా సంతృప్తి కలిగిందని రామచంద్రనాయుడు పేర్కొన్నారు. రామచంద్రనాయుడుతో పాటు ఇప్పటివరకు కంపెనీ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఉన్న రమాదేవి గౌరినేని బోర్డుకు రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను బోర్డు ఆమోదించింది.

అమర రాజా కంపెనీ కొత్త చైర్మన్‌గా గల్లా జయదేవ్

గల్లా జయదేవ్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించడంతో పాటు, ఎస్‌ విజయానంద్‌ను ప్రెసిడెంట్‌ గా నియమించారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా హర్షవర్ధన గౌరినేని, విక్రమాదిత్య గౌరినేనిని నియమిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. వీరు ఆగస్టు నుంచి ఈ పదవుల్లో కొనసాగుతారు.

అమర రాజా కంపెనీ కొత్త చైర్మన్‌గా గల్లా జయదేవ్

అమర రాజా కంపెనీ ఉత్పత్తి చేసిన బ్యాటరీలు మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్, హ్యుందాయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్, ఫోర్డ్ ఇండియా లిమిటెడ్, టాటా మోటార్స్ లిమిటెడ్, మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్, హోండా కార్స్ ఇండియా లిమిటెడ్, రెనాల్ట్ నిస్సాన్, హోండా మోటార్ సైకిల్స్ & స్కూటర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, రాయల్ ఎన్ఫీల్డ్, బజాజ్ ఆటో లిమిటెడ్ వంటి వాటికి అందిస్తోంది.

అమర రాజా కంపెనీ కొత్త చైర్మన్‌గా గల్లా జయదేవ్

కేవలం ఇది మాత్రమే కాకూండా కంపెనీ పారిశ్రామిక, ఆటోమోటివ్ బ్యాటరీలను ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 32 దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు కంపెనీ అధికారికంగా తెలిపింది. ఎన్నో దేశాలలోని చాలా కంపెనీలకు మన దేశం నుంచి అది కూడా తెలుగు రాష్ట్రము నుంచి ఎగుమతవుతుండటం నిజంగా గర్వకారణం.

Most Read Articles

English summary
Ramachandra Galla Steps Down As Amara Raja Chairman. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X