29 వేల కోట్లతో అనంతపురం అమరావతి మధ్య ఎక్స్‌ప్రెస్ వే నిర్మించనున్న కేంద్రం

By Anil

అనంతపురం నుండి అమరావతికి మలుపుల్లేని ఎక్స్‌ప్రెస్ వే కోసం 29,000 కోట్లు ప్రకటించిన కేంద్రం. కేంద్ర నిధులతో అనంతపురం అమరావతి మధ్య 600 కిలోమీటర్ల మేర నాలుగు మరియు ఆరు లేన్ల రహదారి నిర్మించనుంది.

అనంతపురం అమరావతి మధ్య ఎక్స్‌ప్రెస్‌ వే

విభజనకు ముందు తెలుగు రాష్ట్ర రాజధాని హైదరాబాదుకి అనంతపురం నుండి నాలుగు రోడ్ల రహదారి ఉండేది. ఏడవ నెంబర్ జాతీయ రహదారి అనంతపురం మరియు హైదరాబాద్‌లను కలిపేది.

అనంతపురం అమరావతి మధ్య ఎక్స్‌ప్రెస్‌ వే

విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుండి అధిక దూరంలో ఉన్న జిల్లాలలో అనంతపురం ఒకటి. అయితే అనంతపురం నుండి అమరావతికి జాతీయ రహదారి లేకపోవడంతో రాయలసీమతో రాజధాని అనుసంధానం కాస్త కష్టతరంగా మారింది.

అనంతపురం అమరావతి మధ్య ఎక్స్‌ప్రెస్‌ వే

అయితే కేంద్రం ఈ ప్రాజెక్టును దాదాపు ఖరారు చేసింది. ఈ రహదారి మొత్తం నిర్మాణానికి కావాల్సిన నిధులను కేంద్రమే సమకూర్చనుంది.

అనంతపురం అమరావతి మధ్య ఎక్స్‌ప్రెస్‌ వే

ఈ రహదారి ప్రతిపాదనలు మరియు దీనికి సంభందించిన నిధులు గురించిన అంశాన్ని కేంద్రం మంత్రివర్గంలో చర్చించాల్సి ఉంటుంది.

అనంతపురం అమరావతి మధ్య ఎక్స్‌ప్రెస్‌ వే

2017 భారతదేశపు సరుకు రవాణా సమావేశంలో కేంద్రం రవాణా, జాతీయ రహదారులు మరియు షిప్పింగ్ మంత్రి నితిన్ గడ్కరీ గారు ఈ ప్రాజెక్టును ప్రకటించారు.

అనంతపురం అమరావతి మధ్య ఎక్స్‌ప్రెస్‌ వే

రహదారులు మరియు భవనముల ప్రధాన కార్యదర్శి సుమిత గారు ఓ పత్రికకు ఇచ్చిన వివరణలో, ప్రభుత్వం నుండి ఈ ప్రాజెక్టుకు సంభందించి అధికారిక ప్రకటన ఏ సమయంలోనైనా రానుందని ఆమె తెలిపారు.

అనంతపురం అమరావతి మధ్య ఎక్స్‌ప్రెస్‌ వే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు నెట్‌వర్క్ విస్తరణలో ఈ అనంతపురం - అమరావతి ఎక్స్‌ప్రెస్ వే కీలకంగా మారనుంది మరియు నిర్మాణ దశలో ఉన్న రాజధాని నగరాన్ని అనుసంధానం చేస్తూ ఈ ప్రాజెక్టు పనులు అతి త్వరలో ప్రారంభం కానున్నాయి.

అనంతపురం అమరావతి మధ్య ఎక్స్‌ప్రెస్‌ వే

అధికారుల సమాచారం మేరకు, అనంతపురం - అమరావతి మధ్య నిర్మించతలపెట్టనున్న ఎక్స్‌ప్రెస్ వే కోసం కేంద్రమే నిధులు ఇవ్వనుంది. అయితే ఈ రహదారి వెంబడి ఉండే టోల్ బూత్‌ల ద్వారా వచ్చే ఆదాయం కేంద్ర ఖజానాకు వెళ్లనుంది.

అనంతపురం అమరావతి మధ్య ఎక్స్‌ప్రెస్‌ వే

రాష్ట్ర ప్రభుత్వం ఈ రహదారి కోసం 8,562.84 హెక్టార్ల స్థలాన్ని సేకరించాల్సి ఉంటుంది. అనంతపురం - అమరావతి లను కలిపే ఈ ఎక్స్‌ప్రెస్‌ వే అనంతపురం, కర్నూలు, కడప, ప్రకాశం మరియు గుంటూరు జిల్లా మీదుగా వెళ్లనుంది.

అనంతపురం అమరావతి మధ్య ఎక్స్‌ప్రెస్‌ వే

ఐదు జిల్లాల్లో 45 మండళాలు, 186 గ్రామాలను కలుపుతూ మొత్తం 600 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. ఇందులో 394 కిలోమీటర్లను నాలుగు లేన్లతో మరియు 208 కిలోమీటర్లను ఆరు లేన్లతో నిర్మించనున్నారు.

అనంతపురం అమరావతి మధ్య ఎక్స్‌ప్రెస్‌ వే

ఈ మార్గాన్ని కలుపుతూ కర్నూలు మరియు కడపల నుండి రెండు హై వేలను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టును 30 నెలల వ్యవధిలో పూర్తి చేసేందుకు ప్రతిపాదిస్తున్నారు. ప్రతిపాదిత మార్గంలో మలుపులను దాదాపు తగ్గించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

అనంతపురం అమరావతి మధ్య ఎక్స్‌ప్రెస్‌ వే

ప్రస్తుతం ఇప్పటి వరకు రాయలసీమ జిల్లాలను అమరావతి కలిపేందుకు ఓ రహదారి అంటూ ఏదీ లేదు. ప్రస్తుతం అనంతపురం నుండి అమరావతి మధ్య రైలు ప్రయాణం 12 నుండి 14 గంటలుగా ఉంది. ఈ రహదారి పూర్తయితే 5 నుండి 6 గంటల్లో రోడ్డు ద్వారా రాజధాని చేరుకోవచ్చు.

అనంతపురం అమరావతి మధ్య ఎక్స్‌ప్రెస్‌ వే

గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేందుకు వీలుగా ఈ ఎక్స్‌ప్రెస్‌ను నిర్మించనున్నారు. ఇందుకు అడ్డంకిగా ఉన్నటువంటి కొండ మరియు వాలు తలాలను కూడా సమాతరం చేయాలని భావిస్తోంది.

Most Read Articles

English summary
Read In Telugu Amaravati-Anantapur Express Highway
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X