దుమ్ము పట్టిన కార్లపై ఆశ్చర్యకరమైన ఆర్ట్ వర్క్
గతంలో మనం దుమ్ము పట్టిన కారు వెనుక అద్దాలపై స్కాట్ వాడే చిత్రీకరించిన ఆర్ట్ వర్క్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ కథనంలో అలాంటి ఓ కళాకారుడి గురించే తెలుసుకుందాం. ఇతని పేరు రాఫెల్ వీసోవ్. ఇతను స్కాట్ వాడే కన్నా భిన్నంగా చిత్రాలను గీస్తాడు.
స్కాట్ వాడే చిత్రాలకు నకలును తన కళలో ఉపయోగిస్తాడు. అంటే చిత్రాలను పోలిన చిత్రాలను గీస్తాడన్నమాట. అయితే, రాఫెల్ వీసోవ్ మాత్రం ఇందుకు భిన్నంగా తన స్వంత కళా నైపుణ్యాన్ని ఉపయోగిస్తాడు. అజెర్‌బైజన్‌లోని బాకు ప్రాంతానికి చెందిన రాఫెల్ దుమ్మ పట్టిన కార్లపై చేతి వేళ్లతోనే ఆర్ట్ వేస్తాడు.
మరి రాఫెల్ వీసోవ్ సృష్టించిన కొన్ని అద్భుతమైన ఆర్ట్ వర్క్‌లను ఈ కథనంలో చూద్దాం రండి.

స్కాట్ వాడే మాదిరిగా రాఫెల్ వీసోవ్ తన ఆర్ట్ వర్క్ కోసం బ్రష్‌లను ఉపయోగించడు, కేవలం తన చేతివేళ్లతోనే ఈ ఆర్ట్ వర్క్ చేస్తాడు.

ఈ ఆర్ట్ వర్క్ చేతివేళ్లతో వేసినప్పటికీ, ఇది అద్భుతమైన ఫినిషింగ్‌ను కలిగి ఉంటుంది. దూరం నుంచి చూస్తే, ఇది కారుపై వేసిన కొత్త బాడీ గ్రాఫిక్స్‌గా అనిపిస్తుంది.

ఈ ఫొటోలో వీసోవ్ ఓ సిటీ స్కైలైన్‌ను సృష్టించడాన్ని చూడొచ్చు.

ఈ ఆర్ట్ అందంగా రాత్రివేళల్లో సిటీని తలపించేలా, బిల్డింగ్‌లకు ప్రతిబింబాలను చూపించే విధంగా ఉంటుంది.

అయితే, రాఫెల్ వీసోవ్ గ్రే అండ్ గ్రేడియంట్ షేడ్‌లను ఎలా సృష్టించాడో మాత్రం తెలియట్లేదు.

స్కాట్ వాడే, రాఫెల్ వీసోవ్ సృష్టించిన ఈ రెండు కళాఖండాలలో ఒక్క విషయం మాత్రం కామన్‌గా ఉంటుంది, అదేంటంటే ఈ ఆర్ట్ ఎక్కువ కాలం ఉండదు.



Click it and Unblock the Notifications








