ఆటోమొబైల్స్ గురించి కొన్ని ఆసక్తికర వాస్తవాలు (వరల్డ్‌వైడ్)
మునపటి కథనంలో మనం భారతదేశంలోని కొన్ని ఆటోమొబైల్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ కథనంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కొన్ని ఆసక్తికర ఆటోమొబైల్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం రండి..!
ప్రపంచంలో కెల్లా మొట్ట మొదటి మోడ్రన్ కారు, మొట్టమొదటి కార్ యాక్సిడెంట్, కార్ యాక్సిడెంట్ వలన సంభవించిన మొట్టమొదటి మరణం, ప్రపంచంలో కెల్లా అతి తక్కువ ఎత్తు కలిగిన కారు, అడాల్ఫ్ హిట్లర్ కారు కోసం ఓ కంపెనీని అప్పు అడిగిన విషయం... ఇలా అనేక ఆసక్తికరమైన అంశాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!
మరి ఆలస్యమెందుకు వెంటనే ఈ క్రింది ఫొటో ఫీచర్‌ను తిరగేయండి..!

అతి పురాతన వాహనం
ఈ ఫోటోలో కనిపిస్తున్న వాహనం పేరు కౌంట్ డి డియోన్. ఆధునిక నిర్వచనం ప్రకారం, దీనిని కారు అనలేము కానీ, ఇప్పటికీ రన్నింగ్ కండిషన్‌లో ఉన్న అతిపురాతన వాహనం ఇది. దీనిని 1884లో ఫ్రాన్స్‌లో నిర్మించారు. 2011లో నిర్వహించిన వేలంలో ఇది 4.6 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది.

తొలి యాక్సిడెంట్
మోటార్ కారు వలన సంభవించిన తొలి యాక్సిడెంట్ 1896లో నమోదైంది. సుర్రేలోని క్రోయ్‌డన్‌కు చెందిన బ్రిడ్జెట్ డ్రిస్కోల్ (44 ఏళ్లు) రోడ్డును దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే, ఆమె ఈ ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడింది.

తొలి మరణం
మోటార్ యాక్సిడెంట్ వలన సంభవించిన తొలి మరణం 1899లో నమోదైంది. న్యూయార్క్ సిటీలో సెప్టెంబర్ 14, 1899న హెన్రీ హేల్ బ్లిస్ కారు నడుపుతూ ప్రమాదానికి గురైన మరణించారు.

బ్రీత్ అనలైజ్ తప్పనిసరి
ఫ్రాన్స్‌లో ప్రతి కార్ డ్రైవర్ కూడా తన వెంట్ బ్రీత్ అనలైజర్ (శ్వాస పరీక్ష చేసే పరికరం)ను తీసుకువెళ్లటం తప్పనిసరి.

సగటున 100 కోట్ల కార్లు
ఏ సమయంలో నైనా ప్రపంచ వ్యాప్తంగా సగటున 100 కోట్ల కార్లు (వర్కింగ్ కండిషన్‌లో ఉండేవి) ఉంటాయి. ఇది ప్రపంచ జనాభాలో 1/7వ వంతు.

అతితక్కువ ఎత్తు కలిగిన కారు
ఈ ఫొటోలో కనిపిస్తున్న కారు పేరు ఫ్లాట్‌మొబైల్. ఇది ప్రపంచంలో కెల్లా అతి తక్కువ ఎత్తు కలిగిన (లోయెస్ట్) కారు. దీని ఎత్తు 19 ఇంచ్‌లు మాత్రమే. బకింగ్‌హామ్‌షైర్‌కు చెందిన పెర్రీ వాట్కిన్స్ ఈ కారును తయారు చేశాడు.

చంద్రుడిని చేరుకోవటానికి 6 నెలలు
ఒకవేళ భూ గ్రహం నుంచి చంద్ర గ్రహానికి రోడ్డు మార్గం ఉండి, ఆ రోడ్డుపై సగటున గంటకు 60 మైళ్ల వేగంతో నిరంతరాయం ప్రయాణిస్తుంటే, చంద్ర గ్రహాన్ని చేరుకోవటానికి పూర్తిగా 6 నెలల సమయం పడుతుందట.

తలకిందులుగా ప్రయాణం
ఎఫ్1 కారులో గంటకు 200 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నప్పుడు అధిక మొత్తంలో డౌన్‌ఫోర్స్ విడుదలయ్యి, గురుత్వాకర్షణను కోల్పోతుంది. ఈ వేగంతో వెళ్లేటప్పుడు ఎఫ్1 కారులో టన్నల్ పైభాగంలో (రూఫ్‌పై) డ్రైవ్ చేయవచ్చట.

కాయిన్ ఆపరేటెడ్ పార్కింగ్ మీటర్
ప్రపంచంలో కెల్లా మొట్టమొదటి కాయిన్ ఆపరేటెడ్ పార్కింగ్ మీటర్‌ను 1935లో ఓక్లాహామా సిటీలో ఏర్పాటు చేశారు.

అప్పు అడిగిన అడాల్ఫ్ హిట్లర్
కరడుకట్టిన నియంతగా ప్రపంచ చరిత్రలో నిలిచిపోయిన అడాల్ఫ్ హిట్లర్, జైలులో ఉన్నప్పుడు కార్ లోన్ కోసం ఓ మెర్సిడెస్ బెంజ్ డీలరుకు లేఖ రాశాడు. ప్రముఖ జర్మన్ కార్ బ్రాండ్ ఫోక్స్‌వ్యాగన్‌కు ఆ పేరు పెట్టింది కూడా హిట్లరే.

హారన్ మ్రోగిస్తే భారీ జరిమానా
యూకేలో అనవసరంగా హారన్ మ్రోగిస్తే 30 పౌండ్లు (మన దేశ కరెన్సీలో సుమారు రూ.3000) జరిమానా విధిస్తారు.

ఆల్బానియాలో అన్నీ బెంజ్ కార్లే
ఆల్బానియా 28.22 లక్షల జనాభా కలిగిన ఓ చిన్న యూరోపియన్ దేశం. ఈ దేశంలో 80 శాతం కార్లు మెర్సిడెస్ బెంజ్ బ్రాండ్‌కు చెందినవే.

హీట్ రెసిస్టింగ్ సైలెన్సర్
అనేక ఫార్ములా వన్ కార్లు, కొన్ని హై పెర్ఫామెన్స్ కార్లలో ఉపయోగించే సైలెన్సర్లు హీట్ రెసిస్టింగ్ ఎగ్జాస్ట్ పైప్ కోటింగ్‌తో చేయబడి ఉంటాయి. తొలుతగా వీటిని న్యూక్లియర్ రియాక్టర్లలో వాడేందుకు తయారు చేశారు.

తొలి రేసింగ్ సర్క్యూట్
యూకేలోని సుర్రేలో వెయ్‌బ్రిడ్జ్‌కు సమీపంలో ఏర్పాటు చేసిన బ్రూక్‌ల్యాండ్
సర్క్యూట్ మోటార్ రేసింగ్ తయారు చేసిన ప్రపంచంలో కెల్లా తొలి రేసింగ్ సర్క్యూట్. దీని పొడవు 4.43 కిలోమీటర్లు.

అత్యధిక రోల్స్ రాయిస్‌లు కలిగిన దేశం
హాంగ్‌కాంగ్ ప్రపంచంలో కెల్లా ధనిక దేశాల్లో ఒకటి, అంతేకాదు ఈ దేశంలో అత్యధిక రోల్స్ రాయిస్ కార్లు కూడా ఉన్నాయి.

ప్రతి పార్ట్ కస్టమర్లకు నచ్చిన విధంగా..
రోల్స్ రాయిస్ లగ్జరీ కారులోని ప్రతి భాగాన్ని కూడా కస్టమర్లకు నచ్చిన విధంగా కంపెనీ కస్టమైజ్ చేసి ఇస్తుంది. అయితే, 2008లో ఓ వ్యక్తి వజ్రాలు పొదిగిన రోల్స్ రాయిస్ ఎంబ్లంతో (స్పిరిట్ ఆఫ్ ఎస్టసీ) కూడిన కారును తయారు చేశాడు. ఈ యాంబ్లం విలువ 2 లక్షల డాలర్లు.

స్టీవ్ జాబ్స్ కార్లకు నెంబర్ ప్లేట్స్ ఉండవు ఎందుకు?
యాపిల్ సంస్థను ప్రపంచానికి పరిచయం చేసిన స్టీవ్ జాబ్స్ ఉపయోగించే దాదాపు అన్ని కార్లకు నెంబర్ ప్లేట్స్ ఉండేవి కావు. కాలిఫోర్నియాలోని చట్టం ప్రకారం, కొత్త కార్లను 6 నెలల వరకు నెంబర్ ప్లేట్ లేకుండా తిప్పుకోవచ్చు. ఈ లూప్ హోల్‌ను వాడుకొని స్టీవ్ జాబ్స్ తన కార్లను ఆరు నెలల పాటు నెంబర్ ప్లేట్ లేకుండా తిప్పుతుండేవారట.

బ్రిటీష్ ట్రాఫిక్ పోలీస్, టెడ్డీ బేర్స్
బ్రిటీష్ ట్రాఫిక్ పోలీసులు తమ వెంట టెడ్డీ బేర్స్‌ను తీసుకువెళ్లటం కామన్. ప్రమాదాలకు గురైన చిన్నారులను ఓదార్చేందుకు పోలీసులు ఈ టెడ్డీ బేర్‌లను వారికి ఇస్తారు.

టొయోటా
ప్రపంచంలో కెల్లా అతిపెద్ద కార్ల తయారీ అయిన టొయోటా, రోజుకు 13,000 కార్లను ఉత్పత్తి చేస్తుంది.

తొలి ట్రాఫిక్ లైట్
మొట్టమొదటి ఎలక్ట్రిక్ ట్రాఫిక్ సిగ్నల్‌ను ఇంగ్లాండ్‌లోని వోల్వెర్‌హాంప్టన్‌లో 1927లో ఇన్‌స్టాల్ చేశారు.

గాలి పేర్లు
ఫోక్స్‌వ్యాగన్ బ్రాండ్‌కు అనేక పాపులర్ కార్లను గాలుల నుంచి స్ఫూర్పి పొంది పెట్టారు ఉదాహరణకు జర్మన్ ట్రేడ్ విండ్స్ నుంచి పస్సాట్ అనే పేరును, గల్ఫ్ స్ట్రీమ్ నుంచి గోల్ఫ్ అనే పేరును, పోలా విండ్స్ నుంచి పోలో అనే పేరును, జెట్ స్ట్రీమ్ నుంచి జెట్టా అనే పేర్లను పెట్టారు.

సింగింగ్ డ్రైవర్స్
ఓ అధ్యయనం ప్రకారం, 90 శాతం మంది డ్రైవర్లు వాహనం నడుపుతున్నప్పుడు పాటపాడుతారట.

ముసలోళ్లకి తప్పనిసరి
జపాన్‌లో 75 ఏళ్లు దాటిన వృద్ధ డ్రైవర్లందరూ తమ కారు వెనుక అద్దంపై 'కొరీషా' (వృద్ధులని తెలిపే మార్క్) అనే మార్కును వేసుకోవటం తప్పనిసరి. ఇతరులను అప్రమత్తం చేసేందుకు ఇలా చేస్తారు.

నిప్పులు చిమ్మే కారు
దక్షిణాఫ్రికాలో కార్ జాకర్ల నుంచి తప్పించుకునేందుకు, వారి దాడిని ఎదుర్కునేందుకు బిఎమ్‌డబ్ల్యూ కార్లను ఫ్లేమ్ థ్రోవర్స్‌తో బిగించుకోవచ్చు.


Click it and Unblock the Notifications








