హోండా అకార్డ్ ఉపయోగిస్తున్న అమెజాన్ ఫౌండర్ ‘జెఫ్ బెజోస్’; వివరాలు

ఇటీవల కాలంలో సాధారణ వ్యక్తులే లగ్జరీ కార్లు ఉపయోగిస్తుంటే బిలినియర్లు ఎలాంటి కార్లు వినియోగిస్తారో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ప్రపంచంలోని చాలా మంది బిలినియర్లు ఉపయోగించే కార్లను గురించి ఇప్పటికే తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రపంచంలోని టాప్ 10 బిలినియర్స్ లో ఒకరైన జెఫ్ బెజోస్ గురించి, అతడు వాడే కార్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

హోండా అకార్డ్ ఉపయోగిస్తున్న అమెజాన్ ఫౌండర్ ‘జెఫ్ బెజోస్’; వివరాలు

ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరైన జెఫ్ బెజోస్ 207 బిలియన్ డాలర్లను కలిగి ఉన్నారు. అపర కుబేరుడుగా ప్రసిద్ధి చెందిన బెజోస్ ఇప్పటికి తన పాత కారును వినియోగిస్తున్నారు. ఇది వినడానికి కొంత ఆశ్చ్చర్యంగా ఇది నిజం.

హోండా అకార్డ్ ఉపయోగిస్తున్న అమెజాన్ ఫౌండర్ ‘జెఫ్ బెజోస్’; వివరాలు

జెఫ్ బెజోస్ కి 1994 వివాహం జరిగిన తరువాత తాను చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి, అమెజాన్ అనే సంస్థను ప్రారంభించడానికి శ్రీకారం చుట్టారు. అప్పటికి ఆయన వయసు 30 సంవత్సరాలు. ఆ సమయంలో అమెజాన్ యొక్క కార్యకలాపాలు చాలా సులభంగా ఉండేవి.

హోండా అకార్డ్ ఉపయోగిస్తున్న అమెజాన్ ఫౌండర్ ‘జెఫ్ బెజోస్’; వివరాలు

అమెజాన్ సంస్థ ప్రారంభమైన మొదట్లో కేవలం పుస్తకాలు మాత్రమే విక్రయించబడేవి. అంతే కాదు ఆ సమయంలో ఈ సంస్థలో కేవలం 10 మంది మాత్రమే పనిచేసేవారు. జెఫ్ బెజోస్ తన 1987 చేవ్రొలెట్ బ్లేజర్ కారులో పుస్తకాలను తీసుకెళ్లేవారు. పుస్తకాలను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి రవాణా చేయడానికి మంచి కారును కలిగి ఉండటం మంచిదని ఆ సమయంలో బెజోస్ కోరిక.

హోండా అకార్డ్ ఉపయోగిస్తున్న అమెజాన్ ఫౌండర్ ‘జెఫ్ బెజోస్’; వివరాలు

జెఫ్ బెజోస్ యొక్క ఆస్తి మూడు సంవత్సరాల తరువాత, అంటే 1997 కల్లా ఏకంగా 12 బిలియన్ డాలర్లు. ఈ వేగవంతమైన వృద్ధి సమయంలోనే అమెజాన్ వ్యవస్థాపకుడు 1987 చేవ్రొలెట్ బ్లేజర్ కాను నుంచి హోండా అకార్డ్‌కు మారారు.

హోండా అకార్డ్ ఉపయోగిస్తున్న అమెజాన్ ఫౌండర్ ‘జెఫ్ బెజోస్’; వివరాలు

రిపోర్టర్ సైమన్ 1999 లో యునైటెడ్ స్టేట్స్లో ప్రసిద్ధ టెలివిజన్ షో అయిన బాబ్ సైమన్ యొక్క 60 మినిట్స్ లో కనిపించిన జెఫ్ బెజోస్ ను హోండా కారు గురించి అడిగారు. దీనికి బెజోస్ నవ్వి, ఇది మంచి కారు అని చెప్పాడు. కారు మాత్రమే కాదు, అమెజాన్ ప్రధాన కార్యాలయం నుండి సీఈఓ సీటు వరకు అన్ని వస్తువులు చాలా సరళంగా ఉంటాయి.

హోండా అకార్డ్ ఉపయోగిస్తున్న అమెజాన్ ఫౌండర్ ‘జెఫ్ బెజోస్’; వివరాలు

జెఫ్ బెజోస్ అంత పెద్ద బిలినియర్ అయినప్పటికీ చాలా సింపుల్ గా ఉండటానికి ఇష్టపడతాడు. ముఖ్యమైన విషయాలకు మాత్రమే డబ్బు ఖర్చు చేయాలని ఆయన అంటారు. అనవసరమైన విషయాలకు ఎక్కువ డబ్బు ఖర్చు చేయవద్దని చెబుతాడు.

హోండా అకార్డ్ ఉపయోగిస్తున్న అమెజాన్ ఫౌండర్ ‘జెఫ్ బెజోస్’; వివరాలు

బెజోస్ యొక్క ముఖ్య లక్ష్యం అతని వ్యాపారాన్ని వృద్ధి చేయడమే. ప్రపంచంలో అమెజాన్ కంపెనీ ఇంతగా అభివృద్ధి చెందటానికి ప్రధాన కారణం జెఫ్ బెజోస్ యొక్క మనస్తత్వం. ప్రపంచంలోని అపర కుబేరుడుగా ప్రసిద్ధి చెందినప్పటికి కూడా చాలా సాధారణంగా గడిపేస్తుండటం నిజంగా ఆశ్చ్యర్యం కదా.

Most Read Articles

English summary
Amazon Founder Jeff Bezos Drove Honda Accord When He Was Billonaire Know The Reasons. Read in Telugu.
Story first published: Monday, July 19, 2021, 11:32 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X