ఇకపై ఎలక్ట్రిక్‌ వాహనాల ద్వారా అమెజాన్‌ డెలివరీ సర్వీసులు.. ఒకేసారి 6000 EVలను ప్రవేశపెట్టిన దిగ్గజ సంస్థ

దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం ఊపందుకుంటోంది. ఈ క్రమంలో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్(Amazon) కీలక నిర్ణయం తీసుకుంటూ ముందడుగు వేసింది. ఇకపై త్వరలోనే అమెజాన్ ద్వారా తీసుకునే డెలివరీలన్నీ ఎలక్ట్రిక్‌ వాహనాల ద్వారా జరగనున్నాయి. దేశవ్యాప్తంగా 400 నగరాల్లో 6000 త్రీ వీలర్లను ప్రవేశపెట్టింది.

కాగా ఇప్పటికే చాలా దేశాల్లో ఎలక్ట్రిక్‌ వాహనాల ద్వారా ఈ ప్రయత్నాలు జరిగాయి. ఈ ప్రాజెక్ట్‌ విజయవంతం కావడంతో కస్టమర్లకు ఈవీల ద్వారా ప్రొడక్ట్స్‌ డెలివరీలు చేస్తున్నారు. భారత్‌లో అమెజాన్.. మహీంద్రా యొక్క జోర్‌ గ్రాండ్‌ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ల(Zor Grand Electric 3 Wheeler)ను ఈ ఫ్లీట్ ప్రాజెక్ట్‌కి తీసుకువచ్చింది.

Amazon-Electric-Three-Wheelers

2025 నాటికి భారత్‌లో అమెజాన్‌ డెలివరీ పార్ట్‌నర్స్‌(Amazon Last Mile Fleet) 10,000 ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా సేవలందించనున్నట్లు సమాచారం. కర్బన రహిత రవాణా వ్యవస్థ అనే లక్ష్యంతో పనిచేయాలన్నదే అమెజాన్ ప్రణాళిక.. భవిష్యత్తులో ఇది త్రీ వీలర్‌ ఎలక్ట్రిక్‌ వాహనాల నుంచి ఫోర్‌ వీలర్‌ ఎలక్ట్రిక్‌ వాహనాలకు కూడా మారే అవకాశం ఉంది.

కాగా మహీంద్రా ఎలక్ట్రిక్ 2017లో ఇ-ఆల్ఫా మినీతో తన ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ ఉత్సాహంతో ట్రియో, ట్రియో యారీ, ట్రియో సోర్, ఇ-ఆల్ఫా కార్గోలను విజయవంతంగా ప్రారంభించి.. దేశంలో త్రీ వీలర్‌ మార్కెట్లో దూసుకుపోతోంది. ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా ఈ కామర్స్‌ రంగంలో మరింత ఆదాయం ఆర్జించవచ్చని మహీంద్రా పేర్కొంది.

Amazon-Electric-Three-Wheelers

కాగా మహీంద్రా ఎలక్ట్రిక్ త్రీ వీలర్లు.. ఇప్పటివరకు 133 మిలియన్ కిలోమీటర్లు ప్రయాణించి, 27,566 మెట్రిక్ టన్నుల CO2 ఉద్గారాలను ఆదా చేసిందని మహీంద్రా సంస్థ వెల్లడించింది. 27,566 మెట్రిక్ టన్నుల CO2ను నివారించేందుకు 6.1 లక్షలకు పైగా చెట్లను నాటాలి.

గ్రీన్ వెహికల్ ఎక్స్‌పో మూడవ ఎడిషన్‌లో గ్రీన్ అచీవర్ 2022 ప్రత్యేక గుర్తింపు అవార్డును ఇ-ఆల్ఫా అందుకుంది. మహీంద్రా ఎలక్ట్రిక్ తన ఫ్లీట్ విస్తరణ కోసం ఢిల్లీకి చెందిన టెర్రాగో లాజిస్టిక్స్‌తో ఈ ఏడాది ఏప్రిల్‌లో జత కట్టింది. లాస్ట్‌ మైల్ డెలివరీ సేవల్లో ఫ్లీట్ విస్తరణ కోసం టెర్రాగోకు మరిన్ని EVలను మహీంద్రా ఎలక్ట్రిక్‌ సరఫరా చేయనుంది.

F&B, వినియోగ వస్తువులు, ఇండస్ట్రియల్‌ అవసరాల నిమిత్తం ఉపయోగించే ప్రొడక్ట్స్‌, పేపర్‌, ప్యాకేజింగ్ పరిశ్రమలకు ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా మల్టీ-మోడల్ రవాణా చేసేందుకు.. గోదాంల నుంచి చివరి మైలు డెలివరీలో ఎండ్-టు-ఎండ్ లాజిస్టిక్స్ పరిష్కారాలను మహీంద్రా ఎలక్ట్రిక్‌ త్రీ వీలర్లు అందిస్తాయి.

త్రీ-వీలర్లలో వాలెట్-ఫ్రెండ్లీ ప్యాసింజర్-క్యారీ మొబిలిటీకి పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా మహీంద్రా ఎలక్ట్రిక్ FY20లో 13,589 యూనిట్లను విక్రయించింది. కాగా మహీంద్రా ఎలక్ట్రిక్ యొక్క మొట్టమొదటి త్రీ-వీలర్ ఇ-ఆల్ఫా మినీని, 2017, సెప్టెంబర్ 8 న రూ. 112,000 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) వద్ద ప్రారంభించారు. 4 + 1 సీటింగ్ కెపాసిటీతో ఇ-ఆటో లాస్ట్ మైల్ కనెక్టివిటీ మరియు ఇంట్రా-సిటీ పీపుల్ మూవ్‌మెంట్ అప్లికేషన్‌లను లక్ష్యంగా చేసుకుని సేవలందిస్తోంది.

కాగా ట్రియో సోర్‌ త్రీ వీలర్‌ను 29 అక్టోబర్ 2020న ప్రారంభించారు. దీని ధర రూ. 2,73,000 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ). ట్రియో శ్రేణి 150,000 కి.మీ కంటే ఎక్కువ జీవితకాలంతో పనిచేసేలా అధునాతన లిథియం-అయాన్ బ్యాటరీ సాంకేతికతను ఉపయోగించారు. కొత్త ట్రియో గరిష్ఠంగా 8kW శక్తిని, 42 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, November 14, 2023, 8:01 [IST]
English summary
Amazon launched 6000 electric three wheelers across 400 cities in india full details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+