పెళ్లికి 100 విమానాలను కిరాయికి తీసుకున్న అంబానీ కుటుంబం.. అట్లుంటది మనతోటి!

అంబానీ పెళ్లి ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వివాహంగా జరుగుతుంది. అనంత్‌ అంబానీ పెళ్లితో ముంబై నగరం పండుగ మూడ్‌లోకి వెళ్లిపోయింది. ఈ పెళ్లితో దేశంలోని ప్రముఖులు అంతా ముంబయిలో వాలిపోయారు. క్రికెటర్లు, రాజకీయ, సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. ముంబయిలోని చాలా కంపెనీలు వీరి వివాహాన్ని పురస్కరించుకుని వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ సౌకర్యాన్ని కల్పించాయి. అంబానీ వారి పెళ్లియా మజాకా అనే విధంగా పెళ్లి వేడుకను నిర్వహిస్తున్నారు. వీరి పెళ్లి సందర్భంగా ముంబయి వీధులన్నీ వీఐపీ లగ్జరీ కార్లు తిరుగుతున్నాయి. ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం ప్రముఖ పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధికా మర్చంట్‌తో నిన్న (జూలై 12)న జరిగింది.

గత నెల రోజులుగా గుజరాత్, మహారాష్ట్రలోని ముంబైలో ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరిగాయి. ఇంకా పెళ్లి తర్వాత కూడా ఇతర కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంటుంది. పెళ్లి తర్వాత నెల రోజుల పాటు కార్యచరణ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ వివాహానికి భారత్ నుంచే కాకుండా ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన ప్రముఖులను సైతం ఆహ్వానించారు. ప్రముఖ WWE ప్లేయర్ జాన్ సీనాను సైతం వివాహానికి ఆహ్వానించారు.

Ambani-Family-Hire-100-Planes

అయితే ఇందులో చాలా వరకు పెళ్లికి వచ్చే వారు వివిధ నగరాలు విదేశాల్లో ఉండటంతో ఈ వీఐపీలను తీసుకురావడానికి ప్రత్యేక విమానాలను పంపారు. ఈ వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. ప్రపంచంలోనే అత్యంత కుబేరులు కావడంతో ఏకంగా విమానాలను బుక్‌ చేశారని అంటున్నారు. అయితే దేశంలోని కొందరు అప్పటి రోజుల్లో బంధువుల ఇంటికి పెళ్లికి వాహనాలను పంపే సంప్రదాయానికి భిన్నంగా వీరు విమానానలను పంపారని అభిప్రాయ పడుతున్నారు.

అనంత్ అంబానీ వివాహానికి ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి అతిథులను తీసుకురావడానికి ముఖేష్ అంబానీ సుమారు 100 విమానాలను అద్దెకు తీసుకున్నట్లు సమాచారం. ఈ వివరాలను వెల్లడించినది మరెవరో కాదు ఎయిర్ శాట్ సీఈఓ రాజన్ మిశ్రా. ఈ ప్రకటనతో ఒక్కసారిగా అనంత్‌ అంబానీ పెళ్లి మరోసారి వార్తల్లో నిలిచింది. దాదాపు 100లో మూడు అల్ట్రా లగ్జరీ ఫాల్కన్ 2000లు ఉన్నాయని తెలిసింది.

Ambani-Family-Wedding

ఫాల్కన్ 2000 అనేది ఫ్రెంచ్ కంపెనీ డసాల్ట్ ఏవియేషన్ నిర్మించిన విస్తృత స్థాయి వాణిజ్య విమానం. వాణిజ్య విమానం కావడంతో కేవలం సంపన్నుల రవాణాకు మాత్రమే దీనిని ఉపయోగిస్తారు. అంటే ఫాల్కన్ 2000 విమానంలో ప్రయాణీకులకు చాలా విలాసవంతమైన సౌకర్యాలు ఉంటాయి. అందుకు అనుగుణంగానే ఈ విమానంలో టికెట్ ఛార్జీలు కూడా ఎక్కువగా ఉంటాయి. సుమారు 20 మీటర్ల పొడవు ఉండే ఈ విమానంలో కేవలం 19 సీట్లు మాత్రమే ఉంటాయి.

ముఖేష్ అంబానీ తన కుమారుడి వివాహం కోసం వీటిలో మూడు విమానాలను అద్దెకు తీసుకున్నారు. అద్దెకు తీసుకున్న విమానాలను అతిథులను తీసుకురావడానికి, తీసుకెళ్లడానికి పలుమార్లు ఉపయోగించాలని యోచిస్తున్నారు. ఒక్క ఈ ఎయిర్ ట్రాన్స్ పోర్ట్‌కే వందల కోట్లు ఖర్చు అవుతుంది. ఈ ఏడాది ప్రారంభంలో ముఖేష్ అంబానీ తన మూడు రోజుల నిశ్చితార్థ వేడుకలో అతిథుల కోసం ఇలాంటి విమానాన్ని ఏర్పాటు చేశారు.

Ananth-Ambani-Radhika-Marchant-Wedding

ఆ సమయంలో ముకేశ్ అంబానీ గుజరాత్‌లోని జామ్‌ నగర్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని కొంత భాగాన్ని దాదాపు 10 రోజుల పాటు ఉపయోగించారు. అలాగే అనంత్ అంబానీ పెళ్లి కారణంగా ముంబైలోని పలు ప్రాంతాల్లో రోడ్లను తాత్కాలికంగా దారి మళ్లించారు. కొన్ని రహదారులను తాత్కాలికంగా మూసివేశారు. ముంబైలో జూలై 12 నుంచి 15 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి.

డ్రైవ్స్‌పార్క్ వ్యాఖ్య: ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీకి విమానాలను అద్దెకు తీసుకోవడం పెద్ద విషయం కాదు. తన వద్ద ఉన్న డబ్బుతో సొంతంగా మూడు ఫాల్కన్ 2000 విమానాలను కూడా కొనుగోలు చేయవచ్చు. పెళ్లి తర్వాత ఆ విమానాలన్నింటినీ ఏం చేయాలనే ప్రశ్నతో ముకేశ్ అంబానీ విమానాలను అద్దెకు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఏదీ ఏమైనా ఈ పెళ్లిని ప్రపంచంలోనే గుర్తుండి పోయేలా సెలెబ్రేట్‌ చేస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Saturday, July 13, 2024, 13:38 [IST]
English summary
Ambani family hires 100 areoplanes for the wedding full details in telugu
Read more on: #off beat #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+