కోట్లు విలువ చేసే 'రోల్స్ రాయిస్ కల్లినన్' కలిగిన భారతీయ కుబేరులు.. ఇక్కడ చూడండి

ప్రపంచంలో అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లు అనగానే తప్పకుండా అందరికి 'రోల్స్ రాయిస్' గుర్తుకు వస్తుంది. ఇది ముమ్మాటికి నిజం. వీటి ధరలు కోట్ల రూపాయలలో ఉంటాయి.

కోట్ల రూపాయల విలువ ఉన్నప్పటికీ చాలామంది ధనవంతులు వీటిని కొనుగోలు చేశారు. అయితే ఇందులో కూడా 'రోల్స్ రాయిస్ యొక్క కల్లినన్ కార్లను కలిగిన వ్యక్తులు ప్రముఖులు ఎవరు, విశేషాలు ఏమిటనేది ఇక్కడ చూద్దాం.

భారతీయ కుబేరుల రోల్స్ రాయిస్ కల్లినన్ కార్లు

బ్రిటీష్ కార్ల తయారీ సంస్థ అయిన రోల్స్ రాయిస్ 2018 లో తన కల్లినన్ లగ్జరీ కార్లను ప్రవేశపెట్టింది. ఈ లగ్జరు కారు యొక్క బేస్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 6.95 కోట్లు. కాగా ఇందులో కస్టమైజ్ వంటి మార్పులు చేసుకుంటే ఈ ధరలు మరింత పెరుగుతాయి. అయినప్పటికీ మార్కెట్లో అడుగుపెట్టినప్పటి నుంచి కూడా ఈ కార్లు మంచి సంఖ్యలో అమ్ముడవుతూ ఉన్నాయి.

ముఖేష్ అంబానీ

అపర కుబేరుడు మరియు ప్రముఖ పారిశ్రామిక వేత్త 'ముఖేష్ అంబానీ' ఖరీదైన కార్లను కలిగి ఉన్న వారి జాబితాలో చెప్పుకోదగ్గ వ్యక్తి. అంబానీ వద్ద ఏకంగా మూడు 'రోల్స్ రాయిస్ కల్లినన్' ఎస్‌యువిలు ఉన్నాయి. ఇవి కాకుండా ఇతర రోల్స్ రాయిస్ కార్లు కూడా వీరి గ్యారేజిలో ఉన్నట్లు గతంలో తెలుసుకున్నాం. అయితే మొదటి 'రోల్స్ రాయిస్ కల్లినన్' ఎస్‌యువిని వీరు 2019 లో కొనుగోలు చేసినట్లు సమాచారం.

ముఖేష్ అంబానీ ఫ్యామిలీ రెండవ కల్లినన్ ఎస్‌యువిని 2021 లో, మూడవ కారుని 2022 లో కొనుగోలు చేశారు. అయితే మొదటి కారు వైట్ కలర్, రెండవ కారు పెట్రా గోల్డ్ కలర్‌లో ఉన్నాయి. కాగా ఇటీవల కొన్న మూడవ కారు ఈ మూడింటిలో అత్యంత ఖరీదైన కారుగా తెలిసింది. ఇది టుస్కాన్ సన్ కలర్ షేడ్ ఉంది. ఈ పెయింట్‌కి మాత్రం కోటి రూపాయలు ఖర్చు అయినట్లు సమాచారం.

అజయ్ దేవ్‌గణ్:

ప్రముఖ సినీ నటుడు 'అజయ్ దేవ్‌గణ్' కూడా రోల్స్ రాయిస్ కల్లినన్ కలిగిన వ్యక్తుల జాబితాలో ఒకరుగా ఉన్నారు. ఈయన 2019 లో తన న్యూ రోల్స్ రాయిస్ కల్లినన్ కొనుగోలు చేశారు. ఈ కారు చూడటానికి ముదురు రంగులో ఉన్నట్లు తెలుస్తోంది. అజయ్ దేవ్‌గణ్ ఎక్కువగా ఈ కారును ఉపయోగించడానికి ఆసక్తి చూపుతారు. కావున చాలా సార్లు ఈ కారులో ప్రయాణిస్తూ కనిపించారు.

అజయ్ దేవ్‌గణ్ యొక్క రోల్స్ రాయిస్ కల్లినన్ 6.75 లీటర్ వ్ 0 పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. కావున ఇది 571 పిఎస్ పవర్ మరియు 850 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ కి జతచేయబడి ఉంటుంది. కావున ఇది మంచి పనితీరుని అందిస్తుంది. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా కూడా చాలా లగ్జరీ అనుభూతిని కలిగిస్తుంది.

భూషణ్ కుమార్:

భారతీయ సినీ ప్రొడ్యూసర్, మ్యూజిక్ డైరెక్టర్ మరియు T-సిరీస్ సూపర్ క్యాసెట్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ 'భూషణ్ కుమార్' రోల్స్ రాయిస్ కల్లినన్ కలిగిన ప్రముఖుల జాబితాలో ఒకరు. ఈయన 'వైన్ రెడ్ కలర్' కల్లినన్ కారుని కలిగి ఉన్నారు. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. దీనితో పాటు ఫెరారీ 458 ఇటాలియా, బెంట్లీ ఫ్లయింగ్ స్పర్ వంటివి కూడా ఈయన వద్ద ఉన్నాయి.

యూసఫ్ అలీ:

భారతదేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తల్లో ఒకరైన 'లులు గ్రూప్ ఇంటర్నేషనల్' ఓనర్ 'ఎమ్ఏ యూసఫ్ అలీ' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు, ఎందుకంటే భారతదేశంలోని అత్యంత సంపన్నుల జాబితాలో ఈయన కూడా ఒకరు. యూసఫ్ అలీ గ్యారేజిలో మినీ కూపర్ కంట్రీమ్యాన్, రోల్స్ రాయిస్ ఘోస్ట్, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్, బెంట్లీ బెంటాయగా మరియు లెక్సస్ ఎల్ఎక్స్750 మొదలైనవి లగ్జరీ కార్లు ఉన్నాయి.

ఈ కార్లతో పాటు అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ కల్లినన్ కూడా వీరి వద్ద ఉంది. భారతదేశంలో కల్లినన్ కొనుగోలు చేయడానికంటే ముందు, దుబాయ్ లో రెడ్ కలర్ కల్లినన్ కారుని కొనుగోలు చేశారు. కాబట్టి యూసఫ్ అలీ దుబాయ్ లో ఉన్నప్పుడు ఈ కారుని ఉపయోగిస్తారు. కాగా ఇటీవల అలీ 'మెర్సిడెస్ బెంజ్ మేబాచ్ జిఎల్‌ఎస్ 600' లగ్జరీ కారుని కూడా కొనుగోలు చేశారు.

More from DriveSpark

Article Published On: Thursday, November 24, 2022, 11:45 [IST]
English summary
Ambani to ajay devgan list of celebrity owners of rolls royce cullinan in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+