అదృష్టమంటే అంబానీ కుక్కదే.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు
ముకేశ్ అంబానీ, నీతా అంబానీ రెండో కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వైభవంగా జరిగింది. ఈ వేడుకలకు ప్రపంచంలోని అనేక దేశాల పారిశ్రామిక వేత్తలు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ పెళ్లి కోసం కూడా సుమారు ఐదు వేలకోట్ల కంటే ఎక్కువ ఖర్చు పెట్టినట్లు కొన్ని ప్రముఖ పత్రికలు వెల్లడించాయి. అంబానీ ఫ్యామిలీ గురించి, వారి జీవన విధానం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే వేలకోట్ల యాంటిలియా భవనం.. ఖరీదైన కార్లు, నిత్యావసర వస్తువులు.. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద జాబితానే ఉంది. ఆఖరికి వీరి కుక్క కోసం కూడా ఖరీదైన బెంజ్ కారు ఉపయోగిస్తారని సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం..
అంబానీ ఫ్యామిలీ పెంపుడు కుక్క పేరు 'హ్యాపీ'. దీనికోసం అంబానీ కుటుంబం మెర్సిడెస్ బెంజ్ జీ400డీ లగ్జరీ కారును ఉపయోగిస్తుంది. ఈ కారుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కార్లను అంబానీ ఫ్యామిలీ వారి సెక్యూరిటీలో కూడా ఉపయోగిస్తున్నారు. జీ400డీ మాత్రమే కాకుండా జీ63 ఏఎంజీ కారును కూడా వారు ఉపయోగిస్తున్నారు. అయితే ఈ రెండూ కూడా భిన్నంగా ఉంటాయి.

అనంత్ అంబానీ పెళ్ళిలో కూడా ఈ హ్యాపీ సందడి చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట్లో వైరల్ అయ్యాయి. హ్యాపీ గతంలో ఈ మెర్సిడెస్ బెంజ్ జీ400డీ కారులో కాకుండా టయోటా ఫార్చ్యూనర్ మరియు టయోటా వెల్‌ఫైర్ వంటి వాటిలో కూడా ప్రయాణించింది. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇవన్నీ చూస్తుంటే హ్యాపీ చాలా లక్కీ అనే చెప్పాలి.
నిజానికి బెంజ్ కారు ఖరీదైనదే.. కానీ ఫార్చ్యూనర్ మరియు వెల్‌ఫైర్ రెండూ దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఖరీదైన వాహనాలే అని మర్చిపోకూడదు. టయోటా ఫార్చ్యూనర్ ధర దాదాపు రూ. 50 లక్షలు.. కాగా వెల్‌ఫైర్ ధర సుమారు రూ. 1.5 కోట్లు వరకు ఉంటుంది. కాగా ఫోటోలలో కనిపిస్తున్న మెర్సిడెస్ బెంజ్ జీ400డీ కారు ఖరీదు కూడా సుమారు రూ. 2.55 కోట్లు (ఎక్స్ షోరూమ్).

ఇక మెర్సిడెస్ బెంజ్ జీ400డీ విషయానికి వస్తే.. ఇది జీ 350డీ కారుకు ప్రత్యామ్నాయం అని తెలుస్తోంది. కాజీ ఈ ఏడాది ప్రారంభంలోనే 400డీ మార్కెట్లో అడుగుపెట్టింది. ఇది 3.0 లీటర్ సిక్స్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 330 పీఎస్ పవర్ మరియు 700 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 9 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది.
మెర్సిడెస్ బెంజ్ జీ400డీ కారు రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఇది సాధారణ మోడల్స్ కంటే కూడా కొంత కఠినమైన డిజైన్ పొందుతుంది. అద్భుతమైన డిజైన్ కలిగిన ఈ కారు స్లైడింగ్ సన్‌రూఫ్, బర్మెస్టర్ సౌండ్ సిస్టమ్, 64 కలర్ యాంబియంట్ లైటింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, లెదర్ అపోల్స్ట్రే మొదలైనవాటిని పొందుతుంది. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
ఇక ముకేశ్ అంబానీ ఫ్యామిలీ ఉపయోగించే కార్ల విషయానికి వస్తే.. వీరి గ్యారేజిలో ఖరీదైన రోల్స్ రాయిస్ కార్లు, బెంట్లీ కార్లు, లంబోర్ఘిని, ఫెరారీ మొదలైన కార్లను కలిగి ఉన్నారు. అంబానీ ఫ్యామిలీ మొత్తం తొమ్మిది రోల్స్ రాయిస్ కార్లను ఉపయోగిస్తున్నట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే.. అన్యదేశ్య కార్ల మీద వీరికి ఎంత మక్కువ ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








