అంబులెన్స్‌ డ్రైవర్‌పై దాడి.. కారుని ఓవర్‌టేక్‌ చేశారని యువకులు ఎటాక్‌.. 5 ఏళ్ల చిన్నారిని తరలిస్తుండగా ఘటన

బెంగళూరులో ఓ అంబులెన్స్‌ డ్రైవర్‌ని ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. ఆ యువకులు రోడ్డు పక్కన అంబులెన్స్‌ని ఆపేసిన డ్రైవర్‌పై దాడి చేసిన వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. తమ టయోటా ఇన్నోవా MPVని ఓవర్ టేక్ చేయడంతో డ్రైవర్‌తో గొడవ పడినట్లు తెలిసింది. అయితే ఆ అంబులెన్స్‌లో 5 నెలల చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. ఆపదలో ఉన్న చిన్నారి ప్రాణాన్ని లెక్కచేయకుండా వారిపై దాడి చేసిన ఘటన అక్కడి వారిని కలచివేసింది. ఆ యువకులు చేసిన పనికి పలువురు చేతితో జవాబు చెప్పారు.

బెంగళూరులో అత్యవసర చికిత్స కోసం ఓ ఐదేళ్ల చిన్నారిని చికిత్స అందించేందుకు అంబులెన్స్‌లో ఆక్సిజన్‌ సహాయంతో తరలిస్తున్నారు. ఆపదలో చిన్నారిని తరలిస్తుండగా అనుకోని సంఘటనతో వారు ఉలిక్కి పడ్డారు. తమ కారుని ఓవర్‌టేక్‌ చేశాడని ముగ్గురు యువకులు అంబులెన్స్‌ని ‌అడ్డగించి డ్రైవర్‌ని చితకబాదారు. ఒక్కసారిగా అక్కడ ఏం జరుగుతుందో తెలియక అందరూ ఆశ్చర్యపోయారు. తర్వాత విషయం తెలుసుకుని ఆ యువకులకు బుద్ధిచెప్పారు.

Attack-on-Ambulance-Driver

అంబులెన్స్ డ్రైవర్‌తో ముగ్గురు వ్యక్తులు రోడ్డుపైకి వచ్చిన వీడియోను డ్రంక్ జర్నలిస్ట్ తన ఎక్స్ (ట్విట్టర్‌)లో షేర్ చేశారు. ఈ చిన్న క్లిప్‌ ప్రకారం ముగ్గురు వ్యక్తులు అంబులెన్స్‌ని వెంబడించడం గమనించవచ్చు. అంబులెన్స్ డ్రైవర్ పోలీస్ చెక్‌పోస్ట్‌ వద్దకు వచ్చి ఆగగానే ముగ్గురిలో ఒకరు డ్రైవర్‌పై దాడిచేయడం వీడియోలో రికార్డు అయ్యింది. ఆ తర్వాత కొద్దిసేపటికే మరో ఇద్దరు స్నేహితులు గొడవకు దిగుతుండగా అక్కడి జనాలు వచ్చి చేరారు.

దాడి జరుగుతున్న ప్రదేశంలో అక్కడే విధుల్లో ఉన్న ఓ పోలీసు ఆఫీసర్‌ డ్రైవర్‌ని కొట్టకుండా అడ్డుకోవడానికి ప్రయత్నం చేశాడు. డ్రైవర్ పూర్తిగా భయాందోళనకు గురైనట్లు వీడియోలో కనిపిస్తోంది. అత్యవసర చికిత్స కోసం చిన్నారిని తీసుకువెళ్లాలని చెప్పడంతో అక్కడి వారి మనసు చలించి పోయింది. వెంటనే ఆ ముగ్గురిని నిలువరించే ప్రయత్నం వారు చేశారు. ఆ తర్వాత అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు వీరి పైశాచికత్వాన్ని అణచేందుకు వారిపై చేయి చేసుకున్నారు.

Ambulance-Driver-Attacked-By-Youth

తమ పాప ఎమర్జెన్సీలో ఉందని.. అంబులెన్స్‌కి దారి ఇచ్చి మమ్మల్నీ విడిచిపెట్టాలని వారు వేడుకున్నారు. అయితే వారు ఎంతగా కోరినా ఆ యువకులు ఆగలేదు. పోలీసు అధికారుల జోక్యం తర్వాత వారు అంబులెన్స్‌ వెళ్లేందుకు అనుమతించారు. ఆ తర్వాత ఈ ముగ్గురు యువకులను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. చట్టరీత్యా వారిపై చర్యలు తీసుకుంటామని

దేశ వ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు రోజురోజుకు చోటు చేసుకుంటున్నాయి. గత కొద్ది నెలల్లోనే ఇలాంటి ఘటనలు వందల సంఖ్యలో వెలుగులోకి వచ్చాయి. ఎమర్జెన్సీ వాహనాలను ఆపివేయడంతో పాటు సాధారణ వాహనాలను సైతం రోడ్లపై వెంబడించి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. బెంగళూరులో వారం రోజుల క్రితం హ్యుందాయ్ ఐ20 డ్రైవర్ ను ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ పై వచ్చిన ఓ వ్యక్తి అడ్డుకున్నాడు.

ఇక మరో ఘటనలో స్కూటర్ రైడర్ హ్యుందాయ్ ఐ10 డ్రైవర్, కుటుంబ సభ్యులతో గొడవకు దిగాడు. ఈ స్కూటర్ రైడర్ కూడా ఈ వ్యక్తిని రోడ్డుపై వెంబడించాడు. తరువాత అతను తన హెల్మెట్‌తో కారును ఢీకొట్టాడు. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ప్రస్తుతం దేశంలో ఇలాంటి సంఘటనలు పెరగడంపై ఆందోళన పెరుగుతోంది. ముఖ్యంగా యువకులు మత్తులో ఉండి రోడ్లపైకి వస్తుండటంతో ఈ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, June 12, 2024, 15:45 [IST]
English summary
Ambulance driver attacked by youth in bangalore for overtaking their car
Read more on: #off beat #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+