ప్రపంచంలోనే అత్యంత పొడవైన కారు; స్విమ్మింగ్ పూల్, హెలిప్యాడ్, మినీ గోల్ఫ్ కోర్స్ వంటి మరెన్నో సౌకర్యాలు..

సాధారణంగా కారులో లభించే ఫీచర్లు ఏమిటి? చల్లటి లేదా వేడి వాతావరణం కోసం ఏసి, చిత్రాలను వీక్షించడానికి మరియు సంగీతం వినడానికి ఎంటర్‌‌టైన్‌మెంట్ సిస్టమ్, సౌకర్యవంతమైన సీట్లు మొదలైనవి ఉంటాయి. నిజానికి ఇలాంటి ఫీచర్లు అన్నీ కూడా ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చినవే, పురాతన కార్లలో ఇలాంటి అధునాతన సౌకర్యాలు ఉండేవి కావు. అయితే, ఈ కథనంలో మనం చెప్పుకోబోయే పురాతన కారు మాత్రం చాలా ప్రత్యేకమైనది. ఎందుకో తెలుసుకుందాం రండి.

ప్రపంచంలోనే అత్యంత పొడవైన కారు; స్విమ్మింగ్ పూల్, హెలిప్యాడ్, మినీ గోల్ఫ్ కోర్స్ వంటి మరెన్నో సౌకర్యాలు..

ఈ ఫొటోలలో కనిపిస్తున్న కారును 1986లో యునైటెడ్ స్టేట్స్‌లో తయారు చేశారు. అప్పట్లో ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన కారుగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు కూడా దక్కించుకుంది. ఈ కారులో చిన్నసైజు స్విమ్మింగ్ పూల్, హెలిప్యాడ్ మరియు మినీ గోల్ఫ్ కోర్స్ వంటి ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి. నిజానికి, ఇలాంటి సౌకర్యాలు ప్రస్తుతం లభిస్తున్న కార్లలో కూడా అందుబాటులో లేవు.

ప్రపంచంలోనే అత్యంత పొడవైన కారు; స్విమ్మింగ్ పూల్, హెలిప్యాడ్, మినీ గోల్ఫ్ కోర్స్ వంటి మరెన్నో సౌకర్యాలు..

పొడవైన లిమోసిన్‌గా దాదాపు 100 అడుగుల పొడవున్న ఈ కారు 'ది అమెరికన్ డ్రీమ్' (The American Dream) గా ప్రసిద్ధి చెందింది. అలాగే, కొంతమంది ఈ పొడవైన కారును లెమోకిన్ అని కూడా పిలుస్తారు. ఈ కారులో పైన పేర్కొన్న సౌకర్యాలతో పాటుగా రిఫ్రిజిరేటర్, టెలివిజన్, ఫోన్ మరియు బెడ్స్ వంటి అనేక సౌకర్యాలను కలిగి ఉండేది. నిజానికి, ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లలో లభించే ఫీచర్ల కంటే సౌకర్యవంతమైన ఫీచర్లు ఈ అమెరికన్ డ్రీమ్ కారులో లభించేవి.

ప్రపంచంలోనే అత్యంత పొడవైన కారు; స్విమ్మింగ్ పూల్, హెలిప్యాడ్, మినీ గోల్ఫ్ కోర్స్ వంటి మరెన్నో సౌకర్యాలు..

ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఈ అమెరికన్ డ్రీమ్ కారును రూపొందించి జే ఆర్బర్గ్ మరియు ఈ కారు ఏదో ఒక కార్ బ్రాండ్ కి చెందినది మాత్రం కాదు. జే ఆర్బర్గ్ అప్పట్లో హాలీవుడ్ చిత్రాల కోసం వాహనాలను రూపొందించడంలో ప్రత్యేకత పొందిన వ్యక్తిగా పేరుగాంచారు. అతను ఈ అమెరికన్ డ్రీమ్ మాత్రమే కాకుండా, తన ఉపయోగం కోసం మరికొన్ని ప్రత్యేకమైన కార్లను కూడా రూపొందించాడు.

ప్రపంచంలోనే అత్యంత పొడవైన కారు; స్విమ్మింగ్ పూల్, హెలిప్యాడ్, మినీ గోల్ఫ్ కోర్స్ వంటి మరెన్నో సౌకర్యాలు..

జే ఆర్బర్గ్ 1980 కాలంలో అమెరికన్ డ్రీమ్‌ కారుని సృష్టించాడు. ఈ అమెరికన్ డ్రీమ్ కారులో మొత్తం 70 మంది కూర్చోవచ్చు. అమెరికన్ డ్రీమ్ కారును 1976 తయారు చేయబడిన కాడిలాక్ ఎల్డోరాడో లిమోసిన్ ఆధారంగా చేసుకొని రూపొందించారు. సుమారు 1980 లలో నిర్మించడం ప్రారంభించిన ఈ ప్రపంచంలో కెల్లా పొడవైన కారును రూపొందించడానికి ఎన్ని సంవత్సరాల సమయం పట్టిందో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. జే ఆర్బర్గ్ దాదాపు 12 సంవత్సరాలు కష్టపడి ఈ కారును తయారు చేశాడు.

ప్రపంచంలోనే అత్యంత పొడవైన కారు; స్విమ్మింగ్ పూల్, హెలిప్యాడ్, మినీ గోల్ఫ్ కోర్స్ వంటి మరెన్నో సౌకర్యాలు..

అమెరికన్ డ్రీమ్ కారు కాన్సెప్ట్ స్టేజ్ నుండి రోడ్డుపైకి రావడానికి 12 ఏళ్ల సమయం పట్టింది. సుమారు 1992 కాలంలో ఈ కారు రోడ్డుపైకి వ్చచింది. ఈ కారుకు ఎన్ని చక్రాలు ఉంటాయో తెలుసా, అక్షరాలా ఇరవై ఆరు. కారు ముందు భాగంలో 8, మధ్య భాగంలో 8 మరియు చివరి భాగంలో 10 చొప్పున మొత్తం 26 చక్రాలు ఉంటాయి. అన్ని చక్రాలు మరియు 100 అడుగులు పొడవున్న ఈ కారును ఎలా టర్న్ చేస్తారా అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. అందుకే లిమోసిన్‌కి రెండు వైపుల నుంచి ఆపరేట్ చేసే సౌకర్యం కల్పించబడింది.

చిన్నసైజు పర్సనల్ హెలికాప్టర్ లను పార్క్ చేయడానికి కారు ముందు మరియు వెనుక బానెట్‌ లను సమాన భాగంగా రూపొందించారు. ఈ అమెరికన్ డ్రీమ్ కారుకు శక్తిని అందించడానికి ఇందులో శక్తివంతమైన రెండు వి8 ఇంజన్‌ లను కారుకి ఇరువైపులా అమర్చారు. ఈ కారును రెండు వైపుల నుండి డ్రైవింగ్ చేయవచ్చు. అంతేకాకుండా, ఈ కారును మధ్యభాగానికి రెండుగా విభజించి ఒకవేళ ఎప్పుడైనా అవసరమైతే రెండు విడి విడి కార్లు మాదిరిగా కూడా నడుపుకొని వెళ్లవచ్చు.

ప్రపంచంలోనే అత్యంత పొడవైన కారు; స్విమ్మింగ్ పూల్, హెలిప్యాడ్, మినీ గోల్ఫ్ కోర్స్ వంటి మరెన్నో సౌకర్యాలు..

ఎందుకంటే, అప్పటి రహదారులపై ఇంతటి పొడవైన వాహనాలు తిరిగే వీలు అన్ని ప్రాంతాల్లో ఉండదు కాబట్టి, ఇందులో కారును రెండుగా విడదీసే సౌకర్యం ఇచ్చారు. నిజానికి ఈ కారును సాధారణ రహదారిపై ఉపయోగించేందుకు తయారు చేయబడలేదు. హాలీవుడ్ సినిమాల కోసమే దీనిని ప్రత్యేకంగా రూపొందించారు. ఈ లిమోసిన్ ఇప్పటికీ అందుబాటులో ఉంది మరియు అనేక సందర్భాల్లో వివిధ ప్రదర్శనలలో ప్రదర్శించబడింది.

ప్రపంచంలోనే అత్యంత పొడవైన కారు; స్విమ్మింగ్ పూల్, హెలిప్యాడ్, మినీ గోల్ఫ్ కోర్స్ వంటి మరెన్నో సౌకర్యాలు..

అదే సమయంలో కొందరు ధనవంతులు సరదాగా యాత్ర కోసం ఈ కారులో గంటకు రూ. 14 వేల చొప్పున అద్దె చెల్లించి, ఉపయోగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది 1990 కాలంలో మొదటిసారిగా వాడుకలోకి వచ్చినప్పుడు, ముఖ్యంగా అమెరికన్ ప్రజలలో త్వరగా ప్రజాదరణ పొందింది. కానీ తర్వాత దీనిని మెయింటెయిన్ చేయడం మరియు అద్దెకు తీసుకోవడం చాలా ఖరీదైన విషయం కావడంతో ఈ కారుపై క్రమంగా ప్రజల ఆదరణ తగ్గింది.

ప్రపంచంలోనే అత్యంత పొడవైన కారు; స్విమ్మింగ్ పూల్, హెలిప్యాడ్, మినీ గోల్ఫ్ కోర్స్ వంటి మరెన్నో సౌకర్యాలు..

అలాగే హాలీవుడ్ సినిమా నిర్మాణ సంస్థలు కూడా ది అమెరికన్ డ్రీమ్‌ కారును ఆదరించడం మానేశాయి. ఇందుకు ప్రధాన కారణం దీని నిర్వహణ ఖర్చు ఎక్కువ కావడమే కాకుండా దాదాపు 100 అడుగుల పొడవు ఉన్న పార్కింగ్ ప్రదేశాన్ని గుర్తించడం చాలా కష్టంగా ఉండేది. సుమారు 12 నుండి 14 సాధారణ కార్లను పార్క్ చేసే స్థంలో ఈ ఒక్క కారును మాత్రమే పార్క్ చేయగలం. ఆదరణ కరువైన అమెరికన్ డ్రీమ్ కారు కాలక్రమేణా శిధిలావస్థకు చేరుకోవడం ప్రారంభించింది.

దాదాపు 30 సంవత్సరాలకు పైగా వయస్సున్న ఈ కారులోని అనేక భాగాలు ఇప్పుడు దెబ్బతినడం ప్రారంభించినట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే, గొప్ప విషయం ఏంటంటే, దాదాపుగా తుప్పుపట్టిన స్థితిలో ఉన్న ఈ సెలబ్రిటీ కారును ఇటీవలే అమెరికాలోని ఓ కార్ మ్యూజియం కొనుగోలు చేసింది. అంతేకాకుండా, కారుకు పూర్వ వైభవాన్ని అందించి, తిరిగి యధాస్థితికి తీసుకొచ్చేందుకు సన్నాహాలు కూడా చేస్తోంది. మరిత ఇంతటి పొడవైన కారులో మీరు సవారీ చేస్తారా?

Source: Pastimers - World's Best & Worst/YouTube

Most Read Articles

English summary
American dream a car with helipad swimming pool
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X