15 ఏళ్ల నుండి బోయింగ్ 727 విమానాన్ని నివాసం చేసుకున్న అమెరికన్: ఫోటోలు మరియు వివరాలు
కారు, వ్యాను, బస్సు మరియు ట్రక్కు వంటి ఎన్నో వాహనాలను ఇళ్లుగా మర్చుకున్న ఎన్నో కథనాలను మనం చూసుంటాం. కాని అమెరికాకు చెందిన బ్రూస్ క్యాంపబెల్ అనే వ్యక్తి మాత్రం బోయింగ్ 727 అనే విమానాన్ని పూర్తి స్థాయిలో తన ఇంటిగా మార్చేసుకున్నాడు.
ఇంటిగా మారిపోయిన విమానంలోని వసతులు, మరియు ఇతర సమాచారం ఫోటోల రూపంలో క్రింది కథనంలో కలదు.

బ్రూస్ క్యాంపబెల్ అనే వ్యక్తి సుమారుగా 15 ఏళ్ల పాటు బోయింగ్‌కు చెందిన 727 విమానాన్ని తన పూర్తి స్థాయి నివాసంగా నిర్పాటు చేసుకున్నాడు.

పోర్ట్‌ల్యాండ్ అడవుల్లో సుమారుగా పది ఎకరాల విస్తీర్ణంలో ప్రస్తుతం ఉన్న ఈ బోయింగ్ 727 విమానాన్ని 1999 లో ఇళ్లుగా మార్చుకున్నాడు.

అంతే కాకుండా ఎయిర్‌ప్లేన్‌హోమ్.కామ్ అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించి, ప్రపంచ వ్యాప్తంగా విమానాలను ఇళ్లుగా మార్చుకుని నివసించాలి అనుకునే వారికి స్వయానా ఇలాంటి నివాసాలను ఏర్పాటు చేయడం మొదలు పెట్టాడు.

బోయింగ్ సంస్థ 1960 లో కేవలం 250 మాత్రమే 727 విమానాలను తయారు చేయాలని భావించింది. అయితే బోయింగ్ 727 విమానాల ఉత్పత్తిని నిలిపివేసే సమయానికి సుమారుగా 1,832 విమానాలను తయారు చేసింది.

విమానం యొక్క క్యాబిన్‌లను నివాసయోగ్యాలుగా మార్చే బ్రూస్ క్యాంపబెల్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, వ్యక్తిగత మరియు కుటుంబ తరహా అవసరాలకు ఉపయోగపడేలా మధ్య స్థాయి సైజులో ఉన్న విమాన క్యాబిన్‌లను మాత్రమే ఇళ్లుగా మార్చేందుకు వినియోగిస్తున్నట్లు తెలిపాడు. అంతే కాకుండా సాధారణ రోడ్లలో వీటిని ఒక చోట నుండి మరో చోటకు తరలించడానికి కూడా ఇబ్బందిగా ఉంటుందని తెలిపాడు.

ఇళ్లుగా పునర్నిర్మాణం చేపట్టిన ఈ బోయింగ్ 727 విమానంలో సాధారణంగా ఇంటిలో ఉండే అన్ని సదుపాయాలను కల్పించాడు.

వంట గది, పడక గది, వస్త్రాలను ఉతకడం మరియు ఇస్ట్రీ చేసే ప్రదేశం మరియు స్నానాల గది వంటి అన్నింటిని ఇందులోని నిర్మించాడు.

గాల్లో ఎగురుతూ కొన్ని వందల మంది సీట్ల కూర్చోబెట్టుకుని వివిధ ప్రదేశాలకు ఎగిరెళ్లే విమానాలను ఇంటిగా మార్చుకుని అందులో జీవించడం ఎంతో ఆనందంగా ఉంటుందని తెలిపాడు.

ఇలాంటి విమాన ఇళ్లను నిర్మించే బ్రూస్ క్యాంపబెల్ జపాన్‌లోని మియాజకి ప్రాంతంలో సుమారుగా 660 మంది ప్రయాణికులు ప్రయాణించే సామర్థ్యం ఉన్న విమానాన్ని ఇంటిగా మార్చనున్నాడు.

ఇంత వరకు ఇళ్లుగా నిర్మిస్తు వచ్చిన విమానాలలో యునైటెడ్ ఎయిర్‌లైన్స్, బ్రిటీష్ ఎయిర్‌వేస్ మరియు డెల్టా ఎయిర్‌లైన్స్‌లకు చెందిన 747 విమానాలను వినియోగించాడు.

అద్దె భారం తగ్గించుకోవడానికి పాత వ్యానును ఇల్లుగా మార్చుకున్నాడు
15 లక్షల విలువ చేసే విమాన ప్రయాణాన్ని రూ. 7,000 లతో చేశాడు


Click it and Unblock the Notifications








