బర్త్‌డే రోజు రూ. 3.5 కోట్ల విలువైన రేంజ్‌ రోవర్‌ కారులో అమితాబ్‌ బచ్చన్‌.. ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే

బాలీవుడ్‌ స్టార్‌, బిగ్‌ బీ అమితాబ్(Amitabh Bachchan) బచ్చన్‌ 81వ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా అమితాబ్‌కు సోషల్‌ మీడియాలో సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అంతే కాకుండా అభిమానులు పలు ప్రాంతాల నుంచి తరలి వచ్చి ముంబైలోని ఆయన నివాసం వద్ద డ్యాన్స్‌లు చేసి సంబరాలు చేసుకున్నారు.

బాలీవుడ్‌ సినీ పరిశ్రమలో అడుగుపెట్టినప్పటి నుంచి తన ఐదు దశాబ్దాల సినీ కెరీర్‌లో 200కు పైగా చిత్రాల్లో నటించారు. ఎన్నో ఆవార్డులను సొంతం చేసుకున్నారు. పద్మశ్రీ (1984), పద్మ భూషణ్ (2001), పద్మ విభూషణ్ (2015) మరియు దాదాసాహెబ్ ఫాల్కే(2019) లాంటి ప్రతిష్ఠాత్మకమైన అవార్డులను భారత ప్రభుత్వం నుంచి అందుకున్నారు.

Amitabh-Bachchan-In-Range-Rover-LWB

అయితే ముంబయి నగరంలో ఎక్కువగా బిగ్‌బీ పాత రేంజ్ రోవర్ కారును ఉపయోగించేవారు. ఈ క్రమంలో అమితాబ్ బచ్చన్ తన పుట్టినరోజు సందర్భంగా సరికొత్త రేంజ్ రోవర్‌లో ప్రయాణించినట్లు సమాచారం. లాంగ్ వీల్‌బేస్ వేరియంట్ అయిన ఈ రేంజ్‌ రోవర్‌ ధర ముంబయిలో రూ. 3.5 కోట్లు ఉంటుంది. ఈ లగ్జరీ కారులో కళ్లు చెదిరే ఫీచర్లు ఉండటంతో దీనికి అంత ధర ఉంది.

ఈ రేంజ్ రోవర్(Range Rover) LWB (Long Wheel Base) ఆటోబయోగ్రఫీ 4395 cc పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 5500 rpm వద్ద 523 bhp గరిష్ట శక్తిని, 1800 rpm వద్ద 750 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ లగ్జరీ కారు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది.

Amitabh-Bachchan-In-Range-Rover-LWB

ఇంకా ఆకర్షణీయమైన కలర్స్‌ ఆప్షన్‌లో రేంజ్‌ రోవర్‌ను కొనుగోలు చేయవచ్చు. 7-సీటర్ సాంటోరిని బ్లాక్, ఫుజి వైట్, సిలికాన్ సిల్వర్, కార్పాతియన్ గ్రే, పోర్టోఫినో బ్లూ, ఈగర్ గ్రే, హకుబా సిల్వర్, ఛారెంటే గ్రే వంటి 11 విభిన్న రంగు ఎంపికలలో అందుబాటులో ఉంది. ఇంకా క్యాబిన్ లోపలి భాగంలో చాలా ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉండటం ప్రత్యేకత.

రేంజ్‌ రోవర్‌ LWB మాత్రమే కాదు అమితాబ్ బచ్చన్ నివాసంలో గ్యారేజీలో చాలా లగ్జరీ కార్లు ఉన్నాయి. ఆయన వద్ద ఉన్న లగ్జరీ Mercedes-Benz V-క్లాస్ MPV ప్రారంభ ధర రూ. 71.05 లక్షలు. ఇది 6, 7 సీట్ల ఎంపికలలో అందుబాటులో ఉంటుంది. 2.1-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో నడిచే ఈ కారు 163 PS పవర్ మరియు 380 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 7G-ట్రానిక్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ని కలిగి ఉంది.

Amitabh-Bachchan-In-Range-Rover-LWB

కాగా గతంలో నిర్మాత, దర్శకుడు విధు వినోద్ చోప్రా అమితాబ్ బచ్చన్‌కు రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ కారు ధర రూ.8.99 కోట్లుగా ఉంది. అయితే కొన్నాళ్ల తర్వాత ఈ కారును బెంగళూరులోని ఓ వ్యాపారికి అమితాబ్‌ విక్రయించారు. అలాగే, బిగ్ బి టయోటా ల్యాండ్ క్రూయిజర్‌తో సహా అనేక విలాసవంతమైన కార్లను కలిగి ఉన్నారు.

కాగా అమితాబ్ బచ్చన్ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆయనకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్‌(ట్విట్టర్‌) లో చిరంజీవి ట్వీట్ చేశారు. సైరా నరసింహా రెడ్డి సినిమాలో తామిద్దరూ కలిసి దిగిన ఫొటోలను పంచుకుంటూ ట్వీట్లో గురూజీ మీకు 81వ జన్మదిన శుభాకాంక్షలు అని తెలిపారు.

More from DriveSpark

Article Published On: Wednesday, October 11, 2023, 19:02 [IST]
English summary
Amitabh bachchan celebrates his birthday with his new range rover lwb in mumbai
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+