టాటా సఫారీ కారును కొనుగోలు చేసిన అమితాబ్‌ బచ్చన్‌.. ఈ వీడియో చూస్తే మీ కళ్లను మీరు నమ్మలేరు.!!

భారత మార్కెట్లో టాటా కార్లు సేఫ్టీ పరంగా ది బెస్ట్‌ కార్లుగా పేరుగాంచాయి. అందుకే టాటా కార్లకు కొనుగోలు చేసేందుకు కస్టమర్లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. కాగా ఇటీవల రతన్‌ టాటా యంగ్‌ మేనేజర్‌ శంతను టాటా సఫారీని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు ఆ లిస్ట్‌లో బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్ కూడా చేరారు.

ఏంటీ అమితాబ్‌ బచ్చన్‌ టాటా సఫారీని కొనుగోలు చేశారా అని ఆశ్చర్యపోతున్నారా.. అవును ఈ వీడియో చూస్తే మీరు కూడా మొదట అలాగే అనుకుంటారు. కానీ అదే నిజమని నమ్మితే పప్పులో కాలేసినట్లే.. భారత్‌లో ప్రయాణికుల భద్రతకు టాటా కార్లు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడంతో చాలా మంది వీటిని కొనుగోలు చేస్తున్నారు. సెలబ్రిటీలు కూడా ఇందుకు మినహాయింపు కాదు..

Tata-Safari-Facelift-Amitabh-Junior

కాగా ఇటీవల బాలీవుడ్ సీనియర్‌ నటుడు అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan Duplicate) జూనియర్‌గా పేరుగాంచిన శశికాంత్ పెడ్వాల్ సరికొత్త సఫారీ ఎస్‌యూవీని కొనుగోలు చేశారు. శశికాంత్ పెడ్వాల్‌ అచ్చంగా అమితాబ్‌ పోలికలతో ఉండటంతో చాలా మంది ఈ వీడియో చూడగానే అమితాబ్‌ బచ్చనే అనుకోవడంలో అస్సలు పొరపాటు లేదు.

శశికాంత్ పెడ్వాల్ అమితాబ్ బచ్చన్ లాగా ఉండటంతో పాటు అతను అనేక టీవీ షోలలో పాల్గొనేవాడు. అంతేకాకుండా సోషల్ మీడియాలో సైతం విపరీతమైన పాపులారిటీ సంపాదించాడు. ఒక్క ఇన్‌స్టాగ్రామ్‌లోనే అతనికి 1.8 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారంటే ఆశ్చర్యం లేదు. ఈ క్రమంలో కొత్త సఫారీ(Tata Safari Facelift) ఎస్‌యూవీ డెలివరీ తీసుకుంటున్న వీడియోను శశికాంత్ తన ఇన్‌స్టా ఖాతాలో షేర్‌ చేశారు.

Tata-Safari-Facelift-Amitabh-Junior

ఇటీవల అప్‌డేట్‌ చేయబడిన కొత్త టాటా సఫారీ ఫేస్‌లిఫ్ట్‌ SUV.. భారత మార్కెట్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. దీని ధర రూ. 16.19 లక్షల నుంచి రూ. 27.34 లక్షల (ఎక్స్-షోరూమ్) ఉంది. టాటా సఫారీ ఫేస్‌లిఫ్ట్‌ సరికొత్త అధునాతన వేరియంట్లలో అందుబాటులో ఉంది.

స్మార్ట్ (O), ప్యూర్ (O), అడ్వెంచర్, అడ్వెంచర్ ప్లస్, అడ్వెంచర్ ప్లస్ డార్క్, అకాంప్లిష్డ్‌తో సహా 10 వేరియంట్‌లు, 7 కలర్‌ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు. అప్‌డేటెడ్‌ టాటా సఫారీ ఫేస్‌లిఫ్ట్ 2-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది గరిష్ఠంగా 170 PS శక్తిని, 350 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మ్యాన్యువల్/6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉండగా.. 16.30 kmpl మైలేజ్‌ని అందిస్తుంది.

Tata-Safari-Facelift-Amitabh-Junior

సరికొత్త టాటా సఫారి ఫేస్‌లిఫ్ట్‌లో టాటా మోటార్స్‌ ఆకర్షణీయమైన ఫీచర్లను ప్రవేశపెట్టింది. 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఆండ్రాయిడ్, యాపిల్ కార్‌ప్లే, యాంబియంట్ లైటింగ్, టచ్ ఆధారిత ఏసీ ప్యానెల్, క్లైమేట్ కంట్రోల్, 10-స్పీకర్ జెబిఎల్ సౌండ్ సిస్టమ్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి.

ఇక సేఫ్టీ ఫీచర్ల విషయానికొస్తే టాటా మోటార్స్‌ అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని ముందుగానే చెప్పుకున్నాం. టాటా సఫారీ ఫేస్‌లిఫ్ట్‌లో 7 ఎయిర్‌బ్యాగ్‌లు, ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్), ABS (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), ESC (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), TPMS (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్), 360-డిగ్రీ కెమెరా, లేన్ డిపార్చర్ వార్నింగ్‌తో సహా అద్భుతమైన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

టాటా సఫారితో పాటు టాటా హారియర్ SUV కూడా ఇటీవల విడుదలైంది. దీనిని రూ. 15.49 లక్షల నుండి రూ. 26.44 లక్షల(ఎక్స్-షోరూమ్) ధరతో కొనుగోలు చేయవచ్చు. 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇందులో 10.25-అంగుళాల లేదా 12.3-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్ సిస్టమ్, LED లైటింగ్, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు అనేక ఆకర్షణీయమైన ఫీచర్లు కలిగి ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, December 6, 2023, 19:16 [IST]
English summary
Amitabh bachchan duplicate shashikant pedwal buys new tata safari facelift suv
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+