అమితాబ్ బచ్చన్ కారు లోగో విరగ్గొట్టిన మీడియా
మీడియాకు సెలబ్రిటీలను కవర్ చేయటమంటే, బాగా ఆకలితో ఉన్న వారికి పంచభక్ష పరమాన్నాలు దొరికినట్లే. అందులోనూ అమితాబచ్చన్, స్టీఫెన్ స్పీల్‌బర్గ్ వంటి మహా దిగ్గజాలను కవర్ చేయటమంటే, ఇక ఆ తంతు ఎలా ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు. తాజాగా ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో స్టీఫెన్ స్పీల్‌బర్గ్‌ను కలిసేందుకు బిగ్ బి వచ్చారు.
ఆయనతో సంభాషణ ముగిసిన తర్వాత అమితాబ్ బచ్చన్ తన మెర్సిడెస్ బెంజ్ కారులో తిరిగి వెళ్తుండగా, మీడియా అమాంత ఆయన కారుపై పడిపోయింది. ఈ తోపులాటలో బిగ్ బి లగ్జరీ కారుకు ముందు వైపు ఉన్న మెర్సిడెస్ బెంజ్ స్టార్ లోగో విరిగిపోయింది. మీడియా ఇలా అమితాబ్ బచ్చన్ కారు లోగోను విరగ్గొట్టడం ఇదే మొదటిసారి కాదు. అమితాబ్ కారుకు గతంలో ఓసారి ఇలానే జరిగింది.
ఈ విషయాన్ని అమితాబ్ స్వయంగా తన సోషల్ నెట్‌వర్కింగ్ బ్లాగ్‌లో పేర్కొన్నారు. దీనిపై అమితాబ్ ట్విట్టర్‌లో ఇలా పోస్ట్ చేశారు.. "స్టీఫెన్ స్పీల్‌బర్గ్‌తో డిన్నర్ తర్వాత నా కారును భక్షించినందుకు మీడియాకు ధన్యవాదములు.. దయచేసి నా మెర్క్ లోగో (మెర్సిడెస్ బెంజ్ లోగో)ను వెనక్కు తెచ్చివ్వండి.. మీరు దానిని విరగ్గొట్టారు.. ఇప్పటికే రెండుసార్లు..!". ("Thank you media for mobbing my car after dinner for SSpielberg.. Can I have my Merc logo back please.. you broke it.. twice over !").



Click it and Unblock the Notifications








