అభిమాని నుంచి అమితాబ్‌కు ట్రిక్కీ పర్సనల్ ట్రాన్స్‌పోర్టర్ గిఫ్ట్
యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా పేరు తెచ్చుకొని ఇప్పటికీ బాలీవుడ్‌లో ఓ వెలుగు వెలుగుతున్న బిగ్ స్టార్ బిగ్ బికి ఓ అభిమాని అరుదైన కానుక ఇచ్చాడు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ 'కౌన్ బనేగా కరోడ్‌పతి' అనే గేమ్ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ గేమ్ షోలో పాల్గొనడానికి వచ్చిన ఓ అభ్యర్థి అమితాబ్ బచ్చన్‌కు ఓ 'ట్రిక్కీ' వాహనాన్ని బహుమతిగా ఇచ్చాడు.
ఇంతకీ ట్రిక్కీ అంటే ఏంటనుకుంటున్నారా..? ట్రిక్కీ అనేది పర్సనల్ ట్రాన్స్‌పోర్టర్లను తయారు చేసే కంపెనీ. ట్రిక్కీ ఇండియా చిన్న పిల్లలు మొదలుకొని పెద్ద వారి వరకూ వివిధ రకాల పర్సనల్ ట్రాన్స్‌పోర్టర్లను అందిస్తోంది. ఇందులో మ్యాన్యువల్ వెర్షన్స్ అలాగే బ్యాటరీ ద్వారా పనిచేసే ఆటోమేటిక్ వెర్షన్స్ అందుబాటులో ఉన్నాయి. అమితాబ్‌కు ఆ అభిమాని కానుకగా ఇచ్చింది బ్యాటరీతో పనిచేసే ట్రిక్కీ.
ఆల్ట్రా లైట్ పర్సనల్ ట్రాన్స్‌పోర్టర్‌గా పిలిచే ఈ ట్రిక్కీలో మూడు చక్రాలు ఉంటాయి. బ్యాటరీతో నడిచే ట్రిక్కీలో ముందు చక్రంలో ఎలక్ట్రిక్ మోటార్‌ను అమర్చబడి ఉండి, హ్యాండిల్‌కు అమర్చిన 36 వోల్ట్ బ్యాటరీ సాయంతో ఇది నడుస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 25 కి.మీ. ఈ బ్యాటరీని ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 30-45 కి.మీ. దూరం ప్రయాణించవచ్చు. దీని వేగాన్ని నియంత్రించేందుకు గాను వెనుక వైపు చక్రాలకు రెండు డిస్క్ బ్రేక్స్ కూడా ఉంటాయి.
పార్కింగ్ చేసినప్పుడు ఇది కదలకుండా ఉండేందుకు ఇందులో పార్కింగ్ బ్రేక్స్ కూడా ఉన్నాయి. ట్రిక్కీలో ఉన్న బ్యాటరీని సెల్‌ఫోన్ బ్యాటరీ మాదిరిగా మార్చుకోవచ్చు. వీటికి ఆప్షనల్ బ్యాటరీలు అందుబాటులో ఉంటాయి. ఒక బ్యాటరీ ఛార్జ్ ఖాలీ అయిపోతే మరొక బ్యాటరీని రీప్లేస్ చేసుకోవచ్చు. ముందు చక్రంలో 180 వాట్ ఎలక్ట్రిక్ మోటార్ అమర్చబడి ఉంటుంది. దీనిని స్లో మోడ్ (18 కెఎమ్‌పిహెచ్0, హై మోడ్ (25 కెఎమ్‌పిహెచ్) అనే రెండు మోడ్‌లలో రైడ్ చేయవచ్చు.
ట్రిక్కీ మ్యాన్యువల్, ట్రిక్కీ ఎలక్ట్రిక్, ట్రిక్కీ స్కి అనే మూడు రకాల విభాగాల్లో కంపెనీ ఈ పర్సనల్ ట్రాన్స్‌పోర్టర్లను అందిస్తోంది. ముంచు ప్రాంతాల్లో స్కేటింగ్ చేసే వారి కోసం ట్రిక్కీ స్కి అనే పర్సనల్ ట్రాన్స్‌పోర్టర్‌ను కంపెనీ అందిస్తోంది. మన మార్కెట్లో ట్రిక్కీ ధరలు రూ.6,500 నుంచి మొదలుకొని రూ.1.35,000 వరకూ ఉన్నాయి. వీటికి ఆన్‌లైన్ ద్వారా కంపెనీ అధికారిక వెబ్‌సైట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. మరింత సమాచారం కోసం ట్రిక్కీ ఇండియా డాట్ కామ్ (www.trikkeindia.com)ను సందర్శించండి.


Click it and Unblock the Notifications









