190 ఏళ్ల అమృతాంజన్ వంతెనను కూల్చివేసిన మహారాష్ట్ర గవర్నమెంట్, ఎందుకో తెలుసా.. !

ముంబై మరియి పూణే ఎక్స్‌ప్రెస్‌వే సమీపంలో ఉన్న 190 ఏళ్ల అమృతాంజన్ బ్రిజ్డ్ కూల్చి వేశారు. దాదాపు 190 సంవత్సరాలుగా ఉన్న ఈ వంతెన ఇప్పుడు కూల్చి వేయడం జరిగింది. ఈ అమృతాంజన్ వంతెన కూల్చివేయడానికి గల కారణాలను ఇక్కడ పూర్తిగా తెలుసుకుందాం.. !

190 ఏళ్ల అమృతాంజన్ వంతెనను కూల్చివేసిన మహారాష్ట్ర గవర్నమెంట్, ఎందుకో తెలుసా.. !

దాదాపు 190 సంవత్సరాలు వాడుకలో ఉన్న అమృతాంజన్ వంతెనను ఆదివారం సాయంత్రం కూల్చివేసినట్లు మహారాష్ట్ర రాష్ట్ర రహదారి అభివృద్ధి సంస్థ (ఎంఎస్‌ఆర్‌డిసి) ఒక ప్రకటనలో తెలిపింది. బ్రిటిష్ యుగం నాటి ఈ వంతెన కూల్చివేత కోసం పేలుడు పదార్థాలను ఉపయోగించినట్లు కూడా ప్రకటించారు.

190 ఏళ్ల అమృతాంజన్ వంతెనను కూల్చివేసిన మహారాష్ట్ర గవర్నమెంట్, ఎందుకో తెలుసా.. !

ఈ అమృతాంజన్ వంతెన 1830 జనవరిలో నిర్మాణాన్ని ప్రారంభించింది మరియు అదే సంవత్సరం నవంబర్‌లో వినియోగంలోకి వచ్చింది. సాధారణంగా అమృతాంజన్ వంతెన మహారాష్ట్రలోని దక్కన్ (కొండ) మరియు కొంకణ్ (తీర) ప్రాంతాలను అనుసంధానించడానికి ఉద్దేశించబడింది.

190 ఏళ్ల అమృతాంజన్ వంతెనను కూల్చివేసిన మహారాష్ట్ర గవర్నమెంట్, ఎందుకో తెలుసా.. !

ప్రస్తుతం ముంబై నగరం నుండి పూణేకు వెళ్లే మార్గంలో ఖండాలా మరియు లోనావాలా హిల్ స్టేషన్లకు ప్రయాణాన్ని సులభతరం చేసింది ఈ అమృతాంజన్ వంతెన.

190 ఏళ్ల అమృతాంజన్ వంతెనను కూల్చివేసిన మహారాష్ట్ర గవర్నమెంట్, ఎందుకో తెలుసా.. !

మహారాష్ట్ర రాష్ట్ర రహదారి అభివృద్ధి సంస్థ (ఎంఎస్‌ఆర్‌డిసి) యొక్క ఒక సీనియర్ అధికారి మాట్లాడుతూ, ఈ వంతెన కొంత కాలంగా ఉపయోగంలో లేదని, అంతే కాకుండా ఈ వంతెన స్థంబాలు వాహన రద్దీ కారణంగా అడ్డంకిగా మారాయని తెలిపారు. వాహన రాకపోకలకు ఇది చాలా సమస్యగా మారింది.

ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్ వే లో 6 లైన్ల క్యారేజ్‌వేపై తీవ్రమైన ట్రాఫిక్ స్నార్ల్స్ ఉన్నాయి. ఈ విధంగా ఉండటం వల్ల చాలా ఎక్కువ ట్రాఫిక్ అయ్యే సమస్య కూడా ఉంది. కాబట్టి దీనిని ప్రస్తుతం వినియోగంలో లేదు కావున ఈ అమృతాంజన్ వంతెనను ఏప్రిల్ 4 నుంచి 14 మధ్యలో కూల్చి వేయడానికి ఎంఎస్‌ఆర్‌డిసికి రాయ్‌గడ్ జిల్లా కలెక్టర్ అనుమతి ఇచ్చారు.

190 ఏళ్ల అమృతాంజన్ వంతెనను కూల్చివేసిన మహారాష్ట్ర గవర్నమెంట్, ఎందుకో తెలుసా.. !

ప్రస్తుతం భారత్ లాక్ డౌన్ లో ఉన్న కారణంగా వాహనాల రాకపోకలు ఇప్పుడు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ సమయంలో ఆదివారం సాయంత్రం పేలుడు పాదయ్రాతలను ఉపయోగించి దీనిని పేల్చి వేయడం జరిగింది. ఏది ఏమైనా ఎట్టకేలకు కరోనా లాక్ డౌన్ కూడా ఈ వంతెన కూల్చి వేయడానికి సహకరించింది.

Most Read Articles

English summary
190-year old Amrutanjan Bridge on Mumbai-Pune Expressway demolished. Read in Telugu.
Story first published: Monday, April 6, 2020, 15:34 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X