ఏం ఐడియా గురూ.. ఎలక్ట్రిక్ ఆటోపై సోలార్ ప్యానళ్లు... మూడు రెట్లు పెరిగిన ఆదాయం.. !
నిత్యం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఈ కారణంగా చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తు్న్నారు. అయితే ఆటో డ్రైవర్లు పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుంది. వచ్చే తక్కువ డబ్బులతో ఆటో, కుటుంబాన్ని నడపడం చాలా కష్టంగా ఉంటుంది.
ఈ పరిస్థితులను స్వయంగా అనుభవించిన ఓ ఆటో డ్రైవర్ వినూత్నంగా ఆలోచించాడు. ఫలితంగా మెరుగైన సంపాదన కలిగి ఉన్నట్లు చెప్పాడు. ఒడిశాకు ఆటోడ్రైవర్ శ్రీకాంత్‌పాత్రో గత 15 సంవత్సరాలుగా ఆటో నడుపుతున్నాడు. ఒడిశా రాజధాని భువనేశ్వర్ సమీపంలో నయాగర్ జిల్లాలో నివాసం ఉంటున్నాడు.పెరుగుతున్న డీజిల్ ధరలతో ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపాడు. అప్పట్లో రోజుకు కేవలం 300 రూపాయల నుంచి రూ.400 వరకు మాత్రమే సంపాదన వచ్చేదని చెప్పాడు.

దీంతో తన వద్దనున్న డీజిల్ ఆటోను విక్రయించినట్లు తెలిపాడు. ఏడాదిన్నర క్రితం విద్యుత్‌తో నడిచే ఆటోను కొనుగోలు చేసినట్లు శ్రీకాంత్ పాత్రో తెలిపాడు. ఫలితంగా ఎంతో కొంత డబ్బు ఆదా అవుతుందని భావించినట్లు చెప్పాడు. అయితే విద్యుత్ వాహనం కొనుగోలు వరకు బాగానే ఉన్నా.. ఛార్జింగ్, బ్యాటరీ సమస్యలతో అవస్థలు పడాల్సి వచ్చేదని వెల్లడించాడు. ముఖ్యంగా బ్యాటరీ ఛార్జింగ్, రేంజ్ పెద్ద సమస్యగా ఉండేదన్నారు.
తన సమస్యను గుర్తించిన ఆరో తరగతి చదువుతున్న కుమార్తె ఎలక్ట్రిక్ ఆటోను సోలార్‌గా మార్చేందుకు అవకాశం ఉంటుందని చెప్పిందన్నారు. ఇందుకు సంబంధించి యూట్యూబ్ వీడియోలను చూపించిందని తెలిపాడు. నిజంగా తన కుమార్తెను మెచ్చుకోవాలని, తనలాంటి ఎంతోమందికి పరిష్కారం చూపిందని శ్రీకాంత్ పాత్రో ఆనందం వ్యక్తం చేశాడు.

అనంతరం విద్యుత్ ఆటోను సోలార్ పవర్‌తో నడిచేలా వాహనంలో మార్పులు చేసినట్లు చెప్పారు. ఇప్పుడు ఛార్జింగ్ అయిపోతుందనే బాధ లేదని, ప్రస్తుతం తన ఆటో ఒకసారి ఛార్జింగ్ చేస్తే 140 కి.మీ రేంజ్ వస్తోందని చెప్పారు. దీంతోపాటు విద్యుత్ వాహనం, సోలార్ పవర్‌తో పర్యావరణాన్ని కాపాడుతున్నాననే భావన తనకు ఆనందాన్ని ఇస్తోందని చెప్పారు.
గతంలో కేవలం రూ.300 నుంచి 400 రూపాయలు మాత్రమే సంపాదించానని.. కానీ ప్రస్తుతం విద్యుత్ ఆటో కారణంగా రోజుకు రూ.1300 నుంచి రూ.1500 వరకు సంపాదిస్తున్నట్లు ఆటో డ్రైవర్ శ్రీకాంత్ పాత్రో చెప్పారు. దీంతో తాను, తన కుటుంబం సంతోషంగా ఉందని తెలిపాడు.
చాలా మంది ప్రజలు సహా వాహనదారులు విద్యుత్ వాహనాలను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ ప్రధానంగా ఛార్జింగ్ స్టేషన్లు, మరియు సర్వీస్ సెంటర్లు అందుబాటులో లేకపోవడం వల్ల పెట్రోల్, డీజిల్ వాహనాలనే వినియోగిస్తున్నారు. అధిక సంఖ్యలో విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటుచేస్తే చాలా మంది ప్రజలు విద్యుత్ వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








