ఏమి టాలెంట్ గురూ.. అచ్చం రివర్స్ గేర్‌లో రన్ అవుతున్నట్లుగా స్కూటర్ మార్పు.. ఆకట్టుకుంటున్న వీడియో
ఇటీవల చాలా మంది తమ వాహనాలను వారి అభిరుచికి అనుగుణంగా మోడిఫై చేయించుకోవడం ట్రెండింగ్‌గా మారింది. ఇతరుల వాహనాలతో పోలిస్తే భిన్నంగా, ఆకర్షణీయంగా కనిపించాలనే ఉద్దేశంతో పలు మార్పులు చేస్తున్నారు. ఇటీవల ఇండొనేషియాకు చెందిన ఓ వ్యక్తి వెరైటీ పద్ధతిలో స్కూటర్ నడుపుతున్న వీడియో వైరల్‌గా మారింది.
ఇటీవల ఓ వ్యక్తి తన స్కూటర్‌లో చేసిన మార్పులు చేర్పులు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. వెహికల్స్‌కి మోడిఫికేషన్స్ చేయించడంలోనూ కొన్ని నిబంధనలు పాటించాలి. ఇండోనేషియాకు చెందిన అరాఫ్ అబ్దురహ్మాన్, ఒక వింత స్కూటర్ నడుపుతున్న వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. ఎందుకంటే ఆ స్కూటర్‌ను వెనుక వైపు 'ఉల్టా' రైడ్ చేయవచ్చు. అదే నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

అయితే భారీ శబ్ధాలు వచ్చే సైలెన్సర్లు, విచిత్రమైన సౌండ్స్ చేసే హారన్లు అమర్చితే ట్రాఫిక్ పోలీసుల నుంచి జరిమానాలు ఎదుర్కోక తప్పదు. ఈ నేపథ్యంలో వాహనాల పనితీరు, హార్డ్‌వేర్ గురించి పూర్తిగా తెలిసినవారు సరికొత్త వాహనాలను రూపొందించడం కొత్త కాదు. బైక్ సీట్లను మోడిఫై చేయడం లేదా కొత్తగా అప్‌గ్రేడ్స్ యాడ్ చేయడం వంటివి సోషల్ మీడియాలో చాలానే చూసుంటాం.
కానీ అరాఫ్ అబ్దురహ్మాన్ ఇందుకు పూర్తి భిన్నంగా ఆలోచించి.. తన సృజనాత్మకతను వెలికి తీశారు. ఏకంగా స్కూటర్ రూపునే మార్చేసి ఔరా అనిపించారు. సీటు మార్చడం లాంటి సాధారణ మార్పులు కాకుండా తన స్కూటర్ రూపాన్నే మార్చేశాడు. ఈ వింత స్కూటర్‌ని చూసి అందరూ ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు.

అయితే ఈ మోడిఫైడ్ స్కూటర్ ప్రత్యేక లక్షణం హ్యాండిల్ పొజిషనింగ్. సాధారణంగా స్కూటర్ ప్రయాణించే దిశలో కాకుండా దాని అపోజిక్ సైడ్‌లో హ్యాండిల్‌ను అమర్చారుడ. బండి ముందు చక్రం, స్కూటర్ సీటు కింద ఉంది. అదే సీటు కింద ఏర్పాటు చేసిన హ్యాండిల్‌తో స్కూటర్‌ను అరాఫ్ కంట్రోల్ చేస్తున్నారు.
స్కూటర్‌ను డ్రైవ్ చేస్తుంటే అచ్చం రివర్స్ గేర్‌లో రన్ అవుతున్నట్లు కనిపిస్తుంది. కాగా స్కూటర్ నడుపుతున్న వ్యక్తి వాహనం ప్రయాణిస్తున్న దిశలోనే కూర్చుని ఉంటాడు. వీడియోను చూస్తే.. స్కూటర్ రైడింగ్ నిబంధనలను సవాలు చేసేలా ఉంటుంది. అరాఫ్ సీటు, హ్యాండిల్ మధ్య ఉన్న ఖాళీ ప్రదేశంలో కూర్చుని రోడ్డుపై రయ్‌మంటూ దూసుకుపోతున్నారు. దీంతో దీన్ని అందరూ ఉల్టా స్కూటర్‌గా పిలుస్తున్నారు.
ఈ క్రమంలో రద్దీ ఉన్న రోడ్లపై ఈ ప్రత్యేక స్కూటర్‌పై అరాఫ్ ప్రయాణించారు. దీంతో ఈ దృశ్యం అందరి కంటా పడింది. అటుగా వెళ్తున్న ప్రయాణికులందరూ తమ సెల్‌ఫోన్‌లలో ఆ దృశ్యాన్ని రికార్డ్ చేశారు. ఈ వీడియోను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యాయి.
ఈ వీడియోపై నెటిజన్లు పెద్ద ఎత్తున్న కామెంట్ల రూపంలో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఇది అద్భుతమైన మోడిఫికేషన్ అని ప్రశంసించగా.. మరికొందరు ఇలా ప్రయాణించడం ప్రమాదకరమని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కాగా కొంతమంది వీక్షకులు ఈ వీడియోను ఎంటర్‌టైనింగ్‌గా భావించారు.
ఈ ఐడియా ఎలా వచ్చిందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే రద్దీగా ఉండే రోడ్లపై ఇటువంటి విన్యాసాలను పునరావృతం చేయకుండా ఉండాలని కోరారు. ఇతర వాహనదారులకు ఆటంకాలు కలిగించకుండా ఉండేందుకు బాధ్యతాయుతమైన, సురక్షితమైన డ్రైవింగ్ పద్ధతులు అవసరమని మరి కొందరు పేర్కొన్నారు.
ఏదేమైనా ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. గతంలో తాము చేసిన ప్రయత్నాలను వారు చెప్పే వరకూ బయటి ప్రపంచానికి తెలియకపోగా సోషల్ మీడియా ప్రభావంతో ఈ కాలంలో తొందరగా బయటకు వస్తున్నాయి. దీంతో ఆటోమొబైల్ రంగంలో సైతం ఇన్నోవేటర్లు, టాలెంటెడ్ ఇంజినీర్లకు కొదవ లేదని స్పష్టమవుతోంది.


Click it and Unblock the Notifications








