అటల్ సేతుపై 'ఆనంద్ మహీంద్రా' - ఆ సీన్ చూడలేకపోయా అంటూ ట్వీట్.. వీడియో వైరల్
Anand Mahindra Driving Experience on Atal Setu: ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన చాలా విషయాలను షేర్ చేస్తూ ఉంటారన్న సంగతి అందరికి తెలుసు. ఇందులో భాగంగానే ఈయన ఇటీవల ఓ ఆసక్తికరమైన వీడియో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కలు కొడుతోంది. ప్రేక్షకులను అంతగా ఆకట్టుకున్న ఆ వీడియో ఏంటి? ఆనంద్ మహీంద్రా ఏం పోస్ట్ చేశారు అనే మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం.
ఆనంద్ మహీంద్రా ఇటీవల ముంబైలోని అటల్ సేతు బ్రిడ్జ్ మీద డ్రైవింగ్ అనుభూతి తన ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా షేర్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో షేర్ చేస్తూ.. నీటిపైన పడవలో వెళ్తున్నట్లు ఉందని, ఇది ఇంజినీర్ యొక్క అద్భుత సృష్టి అని ఎంతగానో కొనియాడారు.
అటల్ సేతుపైన ప్రయాణించిన మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సాయంత్రం సమయంలో సుందరమైన దృశ్యాలను చూడలేకపోయినట్లు, మరోసారి తప్పకుండా ఆ అనుభూతిని పొందుతానని వెల్లడించారు. పగటి పూట ఆ బ్రిడ్జి మీద ప్రయాణించడం వల్ల ఆ అద్భుత దృశ్యాలను మిస్ అయిపోయారు.
అటల్ సేతు (Atal Setu)
ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ (MTHL)గా పిలువబడే అటల్ సేతు (Atal Setu) వంతెన 2024 జనవరి 12న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. సుమారు రూ. 17.84 కోట్లతో నిర్మించబడిన ఈ బ్రిడ్జ్ పొడవు ఏకంగా 22 కిలోమీటర్లు. ఇందులో 16.50 కిమీ బ్రిడ్జి నిర్మాణం సముద్రం మీద, మిగిలిన 5.50 కిమీ బ్రిడ్జి భూమి మీద నిర్మించారు. ప్రారంభం రోజునే ఈ వంతెనను మోదీ జాతికి అంకితమిచ్చారు.

2 గంటల సమయం 20 నిమిషాలకు
సెవ్రి మరియు నవా సెవా ప్రాంతాలను కలిపే ఈ వంతెన మధ్య ప్రయాణం కేవలం 20 నిముషాలు మాత్రమే. అదే ఈ బ్రిడ్జి నిర్మాణం జరగక ముంచు సెవ్రి నుంచి నవా సెవా చేరుకోవడానికి పట్టే సమయం రెండు గంటకు. ఈ ఒక్క బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావడంతో 100 నిమిషాల ప్రయాణం తగ్గింది. ఇది ముంబై మరియు పూణే ఎక్స్‌ప్రెస్‌వేకి అనుసంధానించబడి ఉంటుంది.
ఆరు లేన్ల అటల్ సేతు వంతెన ముంబై అభివృద్ధికి మరో మార్గమైంది. ఈ బ్రిడ్జి ప్రారంభం మరియు చివర్లలో కార్లు, లైట్ వెయిట్ మోటార్ వెహికల్స్, మినీ బస్సులు మొదలైనవన్నీ కేవలం 40 కిమీ / గంట వేగంతో ప్రయాణించాలి. బ్రిడ్జి మధ్య భాగంలో 100 కిమీ/గం వేగంతో వెళ్లొచ్చని సమాచారం. సమయాన్ని ఎంతో ఆదా చేసే ఈ వంతెన ఆధునిక టెక్నాలజీ నిర్మితం. కాబట్టి ఇది భూకంపాల భారీ నుంచి కూడా తట్టుకుని నిలబడగలదని చెబుతున్నారు.

రోజుకు 70000 కంటే ఎక్కువ వాహనాలు
అటల్ సేతుపైన ప్రమాదాలను నివారించడానికి బైకులు, ఆటో రిక్షాలు వంటివి పూర్తిగా నిషిద్ధం. అంతే కాకుండా ఈ వంతెన మీదుగా రోజుకి 70000 కంటే ఎక్కువ వాహనాల రాకపోకలు జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సముద్రం మీద నిర్మితమైన ఈ వంతెన వల్ల సముద్ర జీవులకు ఎటువంటి హాని కలగకుండా ఉండేందుకు అవసరమైన టెక్నాలజీ కూడా ఇందులో ఉపయోగించడం ఇక్కడ తెలుసుకోవాల్సిన ప్రధాన విషయం. కాబట్టి ఈ బ్రిడ్జ్ వల్ల పర్యావరణానికి కూడా ఎటువంటి హాని లేదని నిర్దారించారు.
అటల్ సీటుపై టోల్ వసూలు వివరాలు
అటల్ సేతు మీద ఒకసారి కార్లు ప్రయాణించాలంటే రూ. 250, మినీబస్సులకు రూ. 400, 2 యాక్సిల్ ట్రక్కులకు రూ. 830, 3 యాక్సిల్ ట్రక్కులకు రూ. 905, 4 యాక్సల్ మరియు 6 యాక్సిల్ వాహనాలకు రూ. 1300 మరియు ఓవర్ సైజ్ లేదా భారీ వాహనాలకు రూ. 1580 టోల్ ఫీజును ఫిక్స్ చేశారు. ఒకే వాహనం వెళ్లి మళ్ళీ రిటర్న్ రావడానికి ఒకే సారి టోల్ చెల్లించవచ్చు. వెళ్లి, రావడానికి చెల్లించే టోల్ ఫీజు కొంత తక్కువగా ఉంటుంది. రోజు ప్రయాణించేవారు డైలీ పాస్ లేదా నెల వారీ పాస్ వంటివి తీసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








