ఆనంద్ మహీంద్రాను వరించిన 'పద్మభూషణ్': పూర్తి వివరాలు

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మరియు నమ్మికైన వాహన తయారీ సంస్థల్లో ఒకటి మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) కంపెనీ. ఈ కంపెనీ ఒకప్పటినుంచి కూడా తిరుగులేకుండా తన ఉనికిని నిలబెట్టుకోవడంలో విజయం సాధించింది.

ఈ కంపెనీ యొక్క వృద్ధికి అహర్నిశలు పాటుపడుతూ, సోషల్ మీడియాలో ఎప్పుడూ చాలా ఉత్సాహంగా ఉండే 'ఆనంద్ మహీంద్రా' మహీంద్రా కంపెనీ యొక్క చైర్మన్ అని అందరికి తెలిసిన విషయమే, అయితే ఇప్పుడు 'ఆనంద్ మహీంద్రా'ను దేశంలో అత్యుత్తమ పురస్కారమైన పద్మభూషణ్‌ వరించింది. నిజంగా ఇది చాలా గొప్ప విషయం. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

ఆనంద్ మహీంద్రాను వరించిన పద్మభూషణ్: పూర్తి వివరాలు

మహీంద్రా కంపెనీ యొక్క చైర్మన్ అయిన 'ఆనంద్ మహీంద్రా' దేశంలో మూడవ అత్యున్నత పురస్కారమయిన 'పద్మభూషణ్‌'ను అందుకున్నారు. వాహన, ఏరోస్పేస్ మరియు ఐటీ రంగాలలో చేసిన కృషికి గాను ఆనంద్ మహీంద్రాకు ఈ పురస్కారం లభించింది. ఈ పురస్కారాన్ని రాష్ట్రపతి 'రామ్ నాధ్ కోవింద్' చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నారు. ఇది నిజంగా ఆటో మొబైల్ రంగానికే వన్నె తెచ్చే విషయం.

ఆనంద్ మహీంద్రాను వరించిన పద్మభూషణ్: పూర్తి వివరాలు

ఆనంద్ మహీంద్రా గత 25 సంవత్సరాలుగా ఆటో పరిశ్రమలో చాలా చురుకుగా ఉన్నారు. ఆరు పదుల వయసు దాటినప్పటికీ కూడా అతడు భారతదేశంలో మాత్రమే కాకుండా, విదేశాలలో మహీంద్రా కంపెనీ యొక్క వ్యాపారాన్ని పెంచుతూనే ఉన్నాడు. కేవలం వ్యాపార కార్యకలాపాలు మాత్రమే కాకుండా సమాజం యొక్క అభ్యున్నతికి కృషి చేసి తనకంటూ కూడా ఒక గుర్తింపును పొందాడు.

ఆనంద్ మహీంద్రాను వరించిన పద్మభూషణ్: పూర్తి వివరాలు

భారతీయ ఆటో పరిశ్రమలో అనేక సంవత్సరాలుగా ఆనంద్ మహీంద్రా తన పట్టును ఏర్పరుచుకున్నారు. ఈ కారణంగానే భారతీయ పారిశ్రామికవేత్తలలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అంతే కాకుండా మహీంద్రా గ్రూప్ యొక్క కార్పొరేట్ పాలనను కూడా సజావుగా నడపడంలో కూడా యితడు విజయం సాధించారు.

ఆనంద్ మహీంద్రాను వరించిన పద్మభూషణ్: పూర్తి వివరాలు

ఈ కారణంగా మహీంద్రా గ్రూప్ వ్యాపారంలో స్థిరమైన వృద్ధి ఏర్పాటు చేసుకుంది. అంతే కాకూండా తమ వ్యాపారాన్ని ప్రపంచ స్థాయిలో వివిధ ప్రాంతాలకు విస్తరించి, దేశ కీర్తిని నలుదిశలా వ్యాపించారు. దీనితో పాటు, ఆనంద్ మహీంద్రా ప్రపంచ స్థాయిలో స్థిరత్వం కోసం నిరంతరం కృషి చేస్తోంది. ఇది రాబోయే తరానికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది.

ఆనంద్ మహీంద్రాను వరించిన పద్మభూషణ్: పూర్తి వివరాలు

1955 మే 01 న జన్మించిన ఆనంద్ గోపాల్ మహీంద్రా (ఆనంద్ మహీంద్రా) MBA పూర్తి చేసారు. ఆనంద్ మహీంద్రా వ్యాపార రంగంలో ప్రవేశించిన అనతి కాలంలోనే ఫార్చ్యూన్ మ్యాగజైన్ 'ప్రపంచంలోని 50 మంది గొప్ప నాయకుల'లో ఆయన పేరును చేర్చింది. అంతే కాకుండా 2011 ఆసియాలోని 25 అత్యంత శక్తివంతమైన వ్యాపారవేత్తల జాబితాలో కూడా ఆనంద్ మహీంద్రా ఒకరుగా నిలిచారు. 2013 లో 'ఆంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్'గా కూడా గుర్తింపు పొందాడు.

ఆనంద్ మహీంద్రాను వరించిన పద్మభూషణ్: పూర్తి వివరాలు

మహీంద్రా కంపెనీ ఇప్పుడు ఏరోస్పేస్, అగ్రిబిజినెస్, ఆటోమోటివ్, నిర్మాణ పరికరాలు, రక్షణ, వ్యవసాయ పరికరాలు, ఫైనాన్స్ మరియు బీమా, పారిశ్రామిక పరికరాలు, సమాచార సాంకేతికత, ​​లాజిస్టిక్స్, రియల్ ఎస్టేట్ మరియు రిటైల్‌ వంటి రంగాలలో తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

ప్రముఖ వ్యాపారవేత్తగా మాత్రమే తెలిసిన ఆనంద్ మహీంద్రాకు కార్లంటే కూడా చాలా ఇష్టం అని చాలామందికి తెలియకపోవచ్చు. కానీ ఆనంద్ మహీంద్రాకు కార్లంటే కూడా చాలా ఇష్టం. ఈ కారణంగానే అతడు అనేక కార్లను కలిగి ఉన్నారు. ఈ కార్లను గురించి కూడా కొంత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ఆనంద్ మహీంద్రాను వరించిన పద్మభూషణ్: పూర్తి వివరాలు

మహీంద్రా బొలేరో ఇన్వాడెర్:

బొలేరో ఇన్వాడెర్ అనేది అత్యంత ప్రజాదరణ పొందిన బొలేరో ఆధారంగా ఉన్న ఒక ఎస్‌యూవీ. ఇది షార్ట్-వీల్ బేస్, 3-డోరు వెర్షన్, ఇది ఎంయూవి యొక్క స్పోర్టివ్ ఆధారంగా ప్రారంభించబడింది. ఆనంద్ మహీంద్రా తన చిన్న వయస్సు లోనే ఒక బొలేరో ఇన్వాడెర్ స్వంతం చేసుకున్నాడు.

ఈ కారు లైఫ్ స్టైల్ ఎస్‌యూవీ కొనుగోలుదారులను ఉద్దేశించబడింది కనుక, ఇది సాఫ్ట్ రూఫ్ తో వచ్చింది. అంతే కాకుండా, ఈ వాహనం యొక్క వెనుక సీట్లు కూడా సైడ్ ఫేసింగ్, ట్రెండ్ లో ఉన్నాయి. బొలేరో ఇన్వాడెర్ 2.5-లీటర్ డీజల్ ఇంజన్ కలిగి ఉంది. ఈ కారు ఇప్పుడు రోడ్లపై చాలా అరుదుగా కనిపిస్తుంది.

ఆనంద్ మహీంద్రాను వరించిన పద్మభూషణ్: పూర్తి వివరాలు

మహీంద్రా టియువి300:

ఆనంద్ మహీంద్రా తన వ్యక్తిగత ఉపయోగానికి 2015 లో తన గ్యారేజీకి కస్టమైజ్ చేయబడ్డ టియూవి300 ను సొంతం చేసుకున్నాడు. ఇందులో ఉన్న బాక్సీ డిజైన్ కారణంగా టియూవి300 చాలా సాలిడ్ గా కనిపిస్తుంది.

ఆనంద్ మహీంద్రాను వరించిన పద్మభూషణ్: పూర్తి వివరాలు

ఆనంద్ మహీంద్రా సొంతం చేసుకున్న ఈ వెర్షన్ లో వీల్ ఆర్చర్ వంటి భాగాలను జోడించే అధికారిక ' ఆర్మీ ' యాక్సెసరీ ప్యాక్, బోనెట్ పై ఉండే హుల్, రూఫ్ మౌంటెడ్ యాక్సిలరీ ల్యాంప్ లు, బ్లాక్ కలర్ లో చుట్టూ మరియు సైడ్ స్టెప్స్ తో ప్లాస్టిక్ క్లాడింగ్ జోడించబడింది. దీనిపై ఉన్న వార్ గ్రీన్ కలర్ వలన వాహనం ఒక యుద్ధ వాహనం వలె కనిపించేలా చేస్తుంది.

ఆనంద్ మహీంద్రాను వరించిన పద్మభూషణ్: పూర్తి వివరాలు

మహీంద్రా టియువి300 ప్లస్:

ఆనంద్ మహీంద్రా ఓ కొత్త టియూవి300 తెచ్చుకుని ట్విట్టర్ లో ప్రకటించారు. అతను ఆ వాహనానికి "గ్రే ఘోస్ట్" అని పేరు పెట్టాడు మరియు అతను ఆ కారును సొంతం చేసుకోవడానికి చాలా కాలం వేచి ఉన్నట్లు చెప్పాడు. ఆనంద్ మహీంద్రాకు చెందిన టియూవి300 ప్లస్ ప్రత్యేక స్టీల్-గ్రే కలర్ ను కలిగి ఉంది.

ఆనంద్ మహీంద్రాను వరించిన పద్మభూషణ్: పూర్తి వివరాలు

మహీంద్రా స్కార్పియో:

మహీంద్రా యొక్క మహీంద్రా స్కార్పియో అత్యంత ప్రజాదరణ పొందిన వాటిలో ఒకటి. ఆనంద్ మహీంద్రా కూడా చాలా కాలం పాటు ఇండియన్ స్కార్పియోను ఉపయోగించారు. మహీంద్రా స్కార్పియో దాని దృఢమైన శరీరం మరియు సామర్థ్యంగల 4X4 వ్యవస్థకు పెట్టింది పేరు. కావున ఆనంద్ మహీంద్రా పాత వెర్షన్ స్కార్పియో ను కలిగి ఉన్నాడు.

ఆనంద్ మహీంద్రాను వరించిన పద్మభూషణ్: పూర్తి వివరాలు

మహీంద్రా ఆల్టురాస్ జి4:

మహీంద్రా ఆల్టురాస్ జి4 ని కూడా కలిగి ఉన్నారు. ఈ ప్రీమియమ్ ఆల్టురాస్ జి4 అనేది మహీంద్రా బ్రాండ్ నుండి అత్యంత ఖరీదైన వాహనం. ఆల్టురాస్ జి4 డెలివరీ పొందిన తర్వాత ఆనంద్ మహీంద్రా తన కొత్త కారుకు పేరు పెట్టడానికి సహాయం కోసం ట్విట్టర్ ను కోరాడు. పేరు సూచన పోటీలో విజేత కోసం ఒక నమూనాను కూడా ప్రకటించాడు. అతను తరువాత ఆల్టురాస్ జి4 ను 'బాజ్' గా పేరు పెట్టాడు. అంటే ఈ పేరుకి అర్థం 'డేగ' అని.

Most Read Articles

English summary
Anand mahindra gets padma bhushan details
Story first published: Tuesday, November 9, 2021, 10:06 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X