ఆనంద్ మహీంద్రా నుండి థార్‌ను గిఫ్ట్‌గా పొందిన క్రికెటర్ శుబ్‌మన్ గిల్

క్రికెటర్ శుబ్‌మన్ గిల్‌ను కొత్త తరం మహీంద్రా థార్ వరించింది. ఆనంద్ మహీంద్రా చెప్పినట్లుగానే ఓ కొత్త మహీంద్రా థార్ ఎస్‌యూవీని ఈ యువ క్రికెటర్‌కి కానుకగా ఇచ్చాడు. శుబ్‌మన్ మరియు అతని కుటుంబం ఈ ఎస్‌యూవీని డెలివరీ తీసుకుంది.

ఆనంద్ మహీంద్రా నుండి థార్‌ను గిఫ్ట్‌గా పొందిన క్రికెటర్ శుబ్‌మన్ గిల్

ఆస్ట్రేలియాలో ఆడిన ఓ సిరీస్‌లో శుబ్‌మన్ ముఖ్యమైన పాత్ర పోషించాడు మరియు ఆ సమయంలో ఆనంద్ మహీంద్రా థార్ ఎస్‌యూవీ బహుమతి ఇవ్వడం గురించి మాట్లాడాడు. ఇటీవలే ఈ ఎస్‌యూవీ డెలివరీ తీసుకున్న శుబ్‌మన్ థార్ ఫొటోను ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి ఆనంద్ మహీంద్రాకు కృతజ్ఞతలు తెలిపారు.

ఆనంద్ మహీంద్రా నుండి థార్‌ను గిఫ్ట్‌గా పొందిన క్రికెటర్ శుబ్‌మన్ గిల్

ఈ సందర్భంగా, క్రికెటర్ శుబ్‌మన్ గిల్ వ్యాఖ్యానిస్తూ.. భారత జట్టులో ఆడటం గర్వించదగ్గ విషయమని, తాను మైదానంలోకి దిగునప్పుడల్లా ఉత్తమమైన ప్రతిభను చూపడానికే ప్రయత్నిస్తానని ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ఆస్ట్రేలియాపై గెలుపులో ప్రత్యేక పాత్ర పోషించిన 6 మంది యువ ఆటగాళ్లకు మహీంద్రా థార్ ఎస్‌యూవీ కారును బహుమతిగా ఇస్తామని గత జనవరిలో ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.

ఆనంద్ మహీంద్రా నుండి థార్‌ను గిఫ్ట్‌గా పొందిన క్రికెటర్ శుబ్‌మన్ గిల్

శుబ్‌మన్ ట్వీట్‌కి ప్రతిస్పందనగా ఆనంద్ మహీంద్రా వ్యాఖ్యానిస్తూ.. "మీలాంటి క్రీడాకారుడు క్రీజులో ఉన్నప్పుడు, ఆట చాలా ఉత్తమంగా ఉంటుంది. ఆనందించండి!" అని ట్వీట్ చేశారు. ఆనంద్ మహీంద్రా నుండి మహీంద్రా థార్‌ను గిఫ్ట్‌గా పొందిన ఆరుగురు క్రికెటర్లలో శుబ్‌మన్ గిల్ కాకుండా, శ్రద్ధాల్ ఠాకూర్, నవదీప్ సైని, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, టి నటరాజన్‌లు ఉన్నారు.

ఆనంద్ మహీంద్రా నుండి థార్‌ను గిఫ్ట్‌గా పొందిన క్రికెటర్ శుబ్‌మన్ గిల్

శుబ్‌మన్ గిల్ బ్లాక్ కలర్‌లో ఉన్న హార్డ్ టాప్ వెర్షన్ మహీంద్రా థార్‌ను గిప్ట్‌గా పొందారు. ఇందులో థార్ యొక్క ఎల్ఎక్స్ హార్డ్ టాప్ వేరియంట్‌ను అతని కుటుంబం డెలివరీ తీసుకుంది. మహీంద్రా థార్ విషయానికి వస్తే, ఈ ఎస్‌యూవీ కోసం బుకింగ్‌ల సంఖ్య ఇప్పటికే 50,000 యూనిట్లను దాటింది.

ఆనంద్ మహీంద్రా నుండి థార్‌ను గిఫ్ట్‌గా పొందిన క్రికెటర్ శుబ్‌మన్ గిల్

ప్రస్తుతం మార్కెట్లో మహీంద్రా థార్ ఏఎక్స్ మరియు ఎల్ఎక్స్ అనే రెండు వేరియంట్లలో మరియు సాఫ్ట్ టాప్, హార్డ్ టాప్ మరియు కన్వర్టిబల్ టాప్ అనే మూడు రకాల రూఫ్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ రెండు వేరియంట్లు పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో మరియు 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తున్నాయి.

ఆనంద్ మహీంద్రా నుండి థార్‌ను గిఫ్ట్‌గా పొందిన క్రికెటర్ శుబ్‌మన్ గిల్

ఈ ఎస్‌యూవీలోని 2.0-లీటర్ ఎమ్-స్టాలియన్ టర్బో-పెట్రోల్ ఇంజన్ 150 బిహెచ్‌పి పవర్‌ను మరియు 300 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అలాగే, 2.2-లీటర్ ఎమ్‌హాక్ డీజిల్ ఇంజన్ 130 బిహెచ్‌పి పవర్‌ను మరియు 320 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అన్ని వేరియంట్లలో షిఫ్ట్-ఆన్-ఫ్లై ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో పాటుగా మెకానికల్ లాకింగ్ డిఫరెన్షియల్స్‌ను స్టాండర్డ్‌గా అందిస్తున్నారు.

ఆనంద్ మహీంద్రా నుండి థార్‌ను గిఫ్ట్‌గా పొందిన క్రికెటర్ శుబ్‌మన్ గిల్

కొత్త తరం మహీంద్రా థార్ ఎస్‌యూవీకి కంపెనీ ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన లభిస్తోంది. ఫలితంగా, ఈ ఎస్‌యూవీ వెయిటింగ్ పీరియడ్ కూడా గరిష్టంగా సు నుండి మారు 10 నెలల వరకూ ఉంటోంది. థార్ యొక్క నిరీక్షణ కాలం (వెయిటింగ్ పీరియడ్) ఎక్కువగా ఉన్నప్పటికీ, కస్టమర్లు మాత్రం ఇదే మోడల్ కావాలని వేచి ఉండేందుకు సిద్ధంగా ఉండటం గమనార్హం.

ఆనంద్ మహీంద్రా నుండి థార్‌ను గిఫ్ట్‌గా పొందిన క్రికెటర్ శుబ్‌మన్ గిల్

ప్రపంచ వ్యాప్తంగా ఆటోమొబైల్ పరిశ్రమను వేధిస్తున్న సెమీ కండక్టర్స్ చిప్స్ కొరత కారణంగా మహీంద్రా థార్ ఉత్పత్తి కూడా ప్రభావితమైంది. ఫలితంగా ఈ మోడల్ వెయిటింగ్ పీరియడ్ కూడా గణనీయంగా పెరిగింది.

ఆనంద్ మహీంద్రా నుండి థార్‌ను గిఫ్ట్‌గా పొందిన క్రికెటర్ శుబ్‌మన్ గిల్

మహీంద్రా థారో కోసం పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా కంపెనీ తమ థార్ ఉత్పత్తి సామర్థ్యాన్ని నెలకు 2,000 యూనిట్ల నుండి 3,000 యూనిట్లకు పెంచాలని యోచిస్తున్నప్పటికీ, ఇతర వాహన పరిశ్రమల మాదిరిగానే మహీంద్రా కూడా స్టీల్ మరియు సెమీకండక్టర్ల కొరతను ఎదుర్కొంటోంది.

Most Read Articles

English summary
Anand Mahindra Gifts New Gen Mahindra Thar SUV To Indian Cricketer Shubman Gill. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X