నీరజ్ చోప్రాకు ఆనంద్ మహీంద్రా అదిరిపోయే గిఫ్ట్.. బాహుబలి అంటూ ట్వీట్

ఒలంపిక్ గేమ్స్ టోక్యోలో హోరాహోరీగా జరుగుతున్నాయి. ఇందులో ప్రపంచంలోని చాలాదేశాల ఆటగాళ్లు అద్భుతమైన ప్రతిభను కనపరుస్తున్నారు. ఇందులో భారతీయ ఆటగాళ్లు కూడా ఉన్నారు. భారతదేశం తరపున పాల్గొన్న ఆటగాళ్లలో మీరాబాయి చాను సిల్వర్ మెడల్ సాధించి శుభారంభం చేసింది. తరువాత పివి సింధు కూడా బ్రాంజ్ మెడల్ సాధించి తనదైన గుర్తింపు సొంతం చేసుకుంది.

నీరజ్ చోప్రాకు ఆనంద్ మహీంద్రా అదిరిపోయే గిఫ్ట్.. బాహుబలి అంటూ ట్వీట్

ఇదిలా ఉండగా ఇప్పుడు భారతదేశం మొత్తం గర్వించేలా బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నాడు భారత జావెలిన్‌ త్రో ప్లేయర్‌ నీరజ్‌ చోప్రా. చోప్రా బంగారు పతకాన్ని సొంత చేసుకుని చరిత్రను తిరగరాశారు. క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో అద్భుత ప్రదర్శనను కనబరిచిన నీరజ్‌ ఫైనల్‌లోనూ సత్తా చాటి భారత్‌కు తొలి బంగారు పతకాన్ని సాధించి పెట్టాడు. ఎలాంటి అంచనాలు లేకుండా ఫైనల్‌కు చేరుకున్న నీరజ్‌ అద్భుతం సృష్టించాడు. దీంతో అథ్లెటిక్స్‌లో పతకం కోసం ఎదురు చూస్తున్న భారత్‌ 100 ఏళ్ల కల నేడు సాకారమైంది.

నీరజ్ చోప్రాకు ఆనంద్ మహీంద్రా అదిరిపోయే గిఫ్ట్.. బాహుబలి అంటూ ట్వీట్

బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రాపై దేశ వ్యాప్తంగా అభినందనలు ఉవ్వెత్తున వెల్లువెత్తుతున్నాయి. అంతే కాకుండా అతనికి ఊహించని బహుమతుల వర్షం కూడా కురుస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు కోట్ల రూపాయల నగదు బహుమతిని ఆనిచనున్నాయి. ఇదిలా ఉండగా ప్రముఖ పారిశ్రామిక వేత్త మరియు మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ 700 ని గిఫ్ట్ గా ఇవ్వనున్నట్లు ప్రకటించాడు.

నీరజ్ చోప్రాకు ఆనంద్ మహీంద్రా అదిరిపోయే గిఫ్ట్.. బాహుబలి అంటూ ట్వీట్

ఆనంద్ మహీంద్రా ఈ కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ 700 ని గిఫ్ట్ గా ఇవ్వనున్నట్లు తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేశాడు. ఆనంద్ మహీంద్రా ఇంతకు ముందు క్రికెట్ ప్లేయర్లకు మహీంద్రా థార్ ఇచ్చిన సంగతి అందరికి తెలిసిందే. తానూ ఇలాంటి అద్భుతమైన గిఫ్ట్స్ ఇచ్చి ఆటగాళ్లను ప్రోత్సహిస్తుంటాడు.

నీరజ్ చోప్రాకు ఆనంద్ మహీంద్రా అదిరిపోయే గిఫ్ట్.. బాహుబలి అంటూ ట్వీట్

ఆనంద్ మహీంద్రా ట్విట్టర్లో నీరజ్ చోప్రాను ఉద్దేశించి, బాహుబలి మేమంతా నీ సైన్యంలోనే ఉన్నాం అంటూ చేతిలో ఈటెను పట్టుకుని గుర్రంపై వస్తున్న హీరో ప్రభాస్‌ ఫొటోతోపాటు, నీరజ్‌ చోప్రా ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశారు. రితేశ్‌ జైన్‌ అనే వ్యక్తి నీరజ్ చోప్రాకు ఎక్స్‌యూవీ 700 వాహనాన్ని అందించాలని కోరాడు. దీంతో అతని ట్వీట్‌కు రిప్లై ఇచ్చిన ఆనంద్ మహీంద్రా, నీరజ్‌ కోసం ఓ ఎక్స్‌యూవీ 700 మోడల్‌ వాహనాన్ని రెడీగా ఉంచాలంటూ తమ సంస్థలోని ఉద్యోగులను ఆదేశించాడు.

నీరజ్ చోప్రాకు ఆనంద్ మహీంద్రా అదిరిపోయే గిఫ్ట్.. బాహుబలి అంటూ ట్వీట్

మహీంద్రా ఎక్స్‌యూవీ 700 విషయానికి వస్తే, ఇది కంపెనీ యొక్క డబ్ల్యూ601 మోనోకోక్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించనున్నారు. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఇది పూర్తిగా కొత్త ప్లాట్‌ఫామ్ మరియు ఇది ప్రస్తుత ఎక్స్‌యూవీ500 కన్నా పొడవుగా మరియు వెడల్పుగా ఉంటుంది. కొత్త థార్ మాదిరిగానే ఇది కూడా పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో రానుంది.

నీరజ్ చోప్రాకు ఆనంద్ మహీంద్రా అదిరిపోయే గిఫ్ట్.. బాహుబలి అంటూ ట్వీట్

కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ700లో 2.2-లీటర్ ఎమ్-హాక్ డీజిల్ ఇంజన్ మరియు 2.0-లీటర్ ఎమ్-స్టాలియన్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఇంజన్లను ఉపయోగించవచ్చని సమాచారం. మహీంద్రా థార్‌లో కూడా ఇవే ఇంజన్లను ఉపయోగిస్తున్నారు. అయితే, ఎక్స్‌యూవీ700 డిజైన్ మరియు లోడ్ వెయిట్ ప్రకారం, ఈ ఇంజన్లను రీట్యూన్ చేసే అవకాం ఉంది.

నీరజ్ చోప్రాకు ఆనంద్ మహీంద్రా అదిరిపోయే గిఫ్ట్.. బాహుబలి అంటూ ట్వీట్

ఈ ఎస్‌యూవీలోని హై-ఎండ్ వేరియంట్లలో కంపెనీ ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌ (4x4)ను అందించవచ్చని సమాచారం. ఈ ఎస్‌యూవీలో లెవల్ - 1 అటానమస్ డ్రైవింగ్ టెక్నాలజీ ఉంటుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ టెక్నాలజీ సాయంతో డ్రైవర్ అవసరం లేకుండానే కారును కంట్రోల్ చేయవచ్చు మరియు ఆటోమేటిక్‌గా పార్క్ చేయవచ్చు.

నీరజ్ చోప్రాకు ఆనంద్ మహీంద్రా అదిరిపోయే గిఫ్ట్.. బాహుబలి అంటూ ట్వీట్

మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీని కంపెనీ ఈ ఏడాది అక్టోబర్ 2021 నాటికి భారత మార్కెట్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. టెస్టింగ్ సమయంలో ఈ వాహనంలో ఈ వాహనంలో కనిపించే అన్ని ఇంటీరియర్ ఫీచర్లను ప్రొడక్షన్ వెర్షన్‌లో కూడా కొనసాగించే అవకాశం ఉంది. సరికొత్త ఫ్రంట్ డిజైన్‌తో రానున్న ఈ మోడల్ మంచి రోడ్ ప్రజెన్స్‌ను కలిగి ఉంటుందని సమాచారం.

నీరజ్ చోప్రాకు ఆనంద్ మహీంద్రా అదిరిపోయే గిఫ్ట్.. బాహుబలి అంటూ ట్వీట్

ఈ ఎస్‌యూవీ లోపలి ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఇందులోని డాష్‌బోర్డ్‌లో డ్యూయల్ ఎల్‌సిడి స్క్రీన్ సెటప్ ఉంటుందని తెలుస్తోంది. ఇందులో ఒక టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ కోసం ఉపయోగించనుండగా మరొక స్క్రీన్‌ను డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం ఉపయోగించనున్నారు. ఇవి మాత్రమే కాకుండా ఇందులో అధునాతన టెక్నాలజీ కలిగి ఉన్న డ్రైవర్ డ్రౌజీనెస్ డిటెక్షన్, స్మార్ట్ డోర్ హ్యాండిల్స్ మరియు స్పీడ్ సెన్సిటివ్ సేఫ్టీ ఫీచర్‌ కూడా ఉన్నాయి.

Most Read Articles

English summary
Anand mahindra gifts new xuv700 suv to olympics gold medalist neeraj chopra
Story first published: Monday, August 9, 2021, 9:36 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X