మహీంద్రా థార్‌ను రూ.700కే కొనుగోలు చేయాలని ప్లాన్.. ఆనంద్ మహీంద్రా ఏం చేశారో తెలుసా?
ప్రస్తుతం సోషల్ మీడియా యుగంలో ఎన్నో వింతలు విశేషాలను సులభంగా తెలుసుకోగలుగుతున్నాం. ఇంటర్నెట్‌లో వైరల్ అయిన వీడియోలు కొంత మందిని ఓవర్‌నైట్ స్టార్స్‌ను చేస్తుండగా... మరికొందరికి ఎప్పటికీ గుర్తిండిపోయే అనుభూతులను పంచుతున్నాయి. తాజాగా మహీంద్రా సంస్థ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) షేర్ చేసిన వీడియో వైరల్ అవుతుండగా.. ఆనంద్ మహీంద్రాపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
అసలు ఏం జరిగిందంటే.. కొన్ని రోజుల క్రితం ఓ బాలుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నోయిడాకు చెందిన బాలుడు చీకు తన వద్దనున్న రూ.700 తో మహీంద్రా థార్ వాహనాన్ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ఆ వీడియోలో ఉంది.

ఈ వీడియో అప్పట్లో వైరల్ అయింది. అలా మహీంద్రా సంస్థ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రాకు చేరింది. దీనిపై స్పందించిన ఆయన ఈ బాలుడు తనను ఆకట్టుకున్నా.. కానీ రూ.700 మహీంద్రా థార్ వాహనాన్ని కొనుగోలు చేయలేడని చెప్తూ ఆ వీడియోను షేర్ చేశారు.
తాజాగా మరో వీడియోను ఆనంద్ మహీంద్రా మరోసారి షేర్చేశారు. నాడు వైరల్ అయిన బాలుడిని పూణేలోని చకాన్‌లో ఉన్న మహీంద్రా కార్ల తయారీ ప్లాంట్‌కు ఆహ్వానించారు. ఈ ప్లాంట్‌లో బాలుడు చేసిన హంగామాకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. దీంతోపాటు 'చీకూ చకాన్ ప్లాంట్‌ను సందర్శించాడు. ఇక నుంచైనా రూ.700కి థార్‌ను (Mahindra Thar) కొనుగోలు చేయమని అతని తండ్రిని అడగకుండా ఉంటాడు' అని భావిస్తున్నట్లు ఆనంద్ మహీంద్రా కామెంట్ చేశారు.

వీడియా ఆధారంగా తండ్రితోపాటు చీకు.. మహారాష్ట్రలోని పూణేలోని చకాన్ ప్లాంట్ గేట్ వద్దకు చేరుకున్నాడు. అక్కడకు వెళ్లగానే తనకు రూ.700 ఇవ్వమని చీకు తండ్రిని అడుగుతాడు. అనంతరం మహీంద్రా ప్లాంట్‌లోకి వెళ్లారు. ప్రధాన ద్వారం వద్ద చీకును మహీంద్రా సిబ్బంది స్వాగతం పలుకుతారు.
అనంతరం సిబ్బంది ఇచ్చిన హెల్మెట్ ధరించి.. తొలుత మహీంద్రా XUV700 అసెంబ్లీ లైన్ దగ్గరకు వెళ్తాడు. అక్కడ నుంచి టైర్ ర్యాక్‌ను పరిశీలిస్తాడు. అనంతరం అక్కడే ఉన్న మహీంద్రా XUV700 లోపలికి వెళ్లి సన్‌రూఫ్ తెరవమని అలెక్సాని అడుగుతాడు. తెరిచాక.. సన్‌రూఫ్ నుంచి బయటకు చూడడం వీడియో గమనించవచ్చు. చివరగా ప్లాంట్ ఆవరణలో ఓ చెట్టును నాటి బయటకు వస్తాడు.

ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా తన X (ట్విట్టర్) ద్వారా షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. ఆనంద్ మహీంద్రాపై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. దేశవిదేశాల్లో క్రీడలు సహా ఇతర రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి కార్లు సహా ప్రత్యేక బహుమతులు ఇచ్చి ఆనంద్ మహీంద్రా ప్రోత్సహిస్తుంటారు.
మహీంద్రా థార్ ఇంజిన్, పనితీరు : భారత్‌లో అందుబాటులో ఉన్న 3-డోర్ వేరియంట్ 1,5 లీటర్ డీజిల్, 2.2 లీటర్ డీజిల్ మరియు 2,0 లీటర్ టర్బోఛార్జడ్ పెట్రోల్ ఇంజిన్లు ఉన్నాయి. 6- స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో లభిస్తుంది. ఈ థార్ SUV ఫోర్ వీల్ డ్రైవ్- 4WD, రేర్ వీల్ డ్రైవ్- RWD టెక్నాలజీని పొందుతుంది. ఇది 15.2 kmpl మైలేజీని ఇస్తుంది.

3- డోర్ థార్ 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్‌తో సహా అనేక కీలక ఫీచర్లను కలిగి ఉంది. ప్రస్తుతం భారత్‌లో అందుబాటులో ఉన్న థార్ వేరియంట్ ధర రూ.11.25 లక్షల నుంచి రూ.17.20 లక్షల మధ్య ఉంది. ఆక్వా మెరిన్, రెడ్ రేజ్, ఎవరెస్ట్ వైట్, నాపోలి బ్లాక్ వంటి రంగుల ఆప్షన్‌లో లభిస్తోంది.
భద్రత పరంగానూ ఈ వాహనం కీలక ఫీచర్లను కలిగి ఉంది. డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్, యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), హిల్ డీసెంట్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటి అనేక కీలక ఫీచర్లను కలిగి ఉన్నాయి. త్వరలో 5-డోర్ థార్ వాహనం లాంచ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే టెస్ట్ రైడ్‌లు కూడా నిర్వహించారు.


Click it and Unblock the Notifications








